బెస్ట్ ఇంటీరియర్స్‌తో లభిస్తున్న కాంపాక్ట్ సెడాన్లు: డిజైర్, అమేజ్, ఆరా మరెన్నో..

భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో కాంపాక్ట్ సెడాన్లకు ఓ ప్రత్యేకమైన డిమాండ్ మరియు కస్టమర్ బేస్ ఉంది. ఖరీదైన మిడ్-సైజ్ మరియు ప్రీమియం సెడాన్లను కొనుగోలు చేయలేని కస్టమర్లు, అలాగే హ్యాచ్‌బ్యాక్‌ల కన్నా కాస్తంత మెరుగైన బూట్ స్పేస్ మరియు ఇంటీరియర్ ఫీచర్లు లభించే వాహనాలను కొనాలనుకునే వారికి కాంపాక్ట్ సెడాన్లు చక్కటి ఆప్షన్ గా ఉంటాయి.

బెస్ట్ ఇంటీరియర్స్‌తో లభిస్తున్న కాంపాక్ట్ సెడాన్లు: డిజైర్, అమేజ్, ఆరా మరెన్నో..

ఇటీవల కాలంలో దేశీయ మార్కెట్లో ఎంట్రీ లెవల్ సెడాన్ బాగా ప్రాచుర్యం పొందాయి. ఎందుకంటే ఇవి సరసమైన ధర, ఎక్కువ లగేజ్ స్పేస్ మరియు అందమైన డిజైన్ లను కలిగి ఉన్నాయి. ఇలాంటి కార్లు క్యాబిన్ లోపల మంచి సౌకర్యాన్ని మరియు స్థలాన్ని కలిగి ఉంటాయి. కాంపాక్ట్ సెడాన్లు హ్యాచ్‌బ్యాక్‌ల కంటే ఎక్కువ లెగ్‌రూమ్ మరియు హెడ్‌రూమ్‌ని అందిస్తాయి.

బెస్ట్ ఇంటీరియర్స్‌తో లభిస్తున్న కాంపాక్ట్ సెడాన్లు: డిజైర్, అమేజ్, ఆరా మరెన్నో..

మరి ఈనాటి మన కథనంలో, భారత మార్కెట్లో లభిస్తున్న అద్భుతమైన ఇంటీరియర్‌లను కలిగిన టాప్ 5 ఎంట్రీ లెవల్ కాంపాక్ట్ సెడాన్ల గురించి తెలుసుకుందాం రండి.

బెస్ట్ ఇంటీరియర్స్‌తో లభిస్తున్న కాంపాక్ట్ సెడాన్లు: డిజైర్, అమేజ్, ఆరా మరెన్నో..

మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire)

ఈ విభాగంలో మారుతి సుజుకి డిజైర్ అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. అంతేకాకుండా, కాంపాక్ట్ సెడాన్ విభాగంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కారు కూడా ఇదే. గత కొన్నేళ్లుగా డిజైర్ భారత మార్కెట్‌లో అమ్మకానికి ఉంది. కంపెనీ ఎప్పటికప్పుడు ఈ మోడల్ ని మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా అప్‌గ్రేడ్ చేస్తూ వస్తోంది.

బెస్ట్ ఇంటీరియర్స్‌తో లభిస్తున్న కాంపాక్ట్ సెడాన్లు: డిజైర్, అమేజ్, ఆరా మరెన్నో..

మారుతి సుజుకి డిజైర్ లోపలి భాగం ఒక లేత గోధుమరంగు (బేజ్ కలర్) థీమ్‌ని అనుసరిస్తుంది, ఇది క్యాబిన్‌కు చాలా మంచి రూపాన్ని జోడిస్తుంది. ఇందులో అనలాగ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ కారులోని స్టీరింగ్ కూడా చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. ఈ కారులోని క్యాబిన్ చాలా విశాలమైనది మరియు ఐదుగురు వ్యక్తులకు తగినంత స్థలం ఉంటుంది. ఈ కారులో 378 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఉంటుంది.

బెస్ట్ ఇంటీరియర్స్‌తో లభిస్తున్న కాంపాక్ట్ సెడాన్లు: డిజైర్, అమేజ్, ఆరా మరెన్నో..

హోండా అమేజ్ (Honda Amaze)

జపనీస్ కార్ బ్రాండ్ హోండా భారత మార్కెట్లో విక్రయిస్తున్న అమేజ్ సెడాన్ కూడా అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటిగా ఉంటుంది. అమ్మకాల పరంగా, ఇది మారుతి డిజైర్ తర్వాతి స్థానంలో ఉంటుంది. ఈ కాంపాక్ట్ సెడాన్ లోపలి భాగం నలుపు మరియు లేత గోధుమరంగు కలయిక (బ్లాక్ అండ్ బేజ్ డ్యూయెల్ టోన్ థీమ్)తో ఉంటుంది. ఈ సెగ్మెంట్లోని ఇతర ఎంట్రీ లెవల్ సెడాన్‌ లతో పోలిస్తే, హోండా అమేజ్ సెడాన్ మరింత ఇంటీరియర్ చాలా అప్‌మార్కెట్ ఫీల్ ని కలిగి ఉంటుంది.

బెస్ట్ ఇంటీరియర్స్‌తో లభిస్తున్న కాంపాక్ట్ సెడాన్లు: డిజైర్, అమేజ్, ఆరా మరెన్నో..

హోండా అమేజ్ ఇంటీరియర్ ప్రీమియంనెస్‌తో పాటుగా విశాలంగా కూడా ఉంటుంది. అమేజ్ కాంపాక్ట్ సెడాన్ కారులోని సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి మరియు సదూర ప్రయాణాలకు సైతం అనుకూలంగా ఉంటాయి. ఈ కారులోని డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ చాలా సింపుల్ గా మరియు స్పష్టంగా ఉంటుంది. ఈ చిన్న కారులో 420 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది.

బెస్ట్ ఇంటీరియర్స్‌తో లభిస్తున్న కాంపాక్ట్ సెడాన్లు: డిజైర్, అమేజ్, ఆరా మరెన్నో..

హ్యుందాయ్ ఆరా (Hyundai Aura)

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ అందిస్తున్న కార్లు ప్రీమియం ఇంటీరియర్ మరియు కంఫర్ట్ ఫీచర్లకు చాలా ప్రసిద్ధి చెందినవి. ఇతర తయారీదారులతో పోలిస్తే హ్యుందాయ్ కార్లు కాస్తంత ఖరీదు ఎక్కువైనప్పటికీ, ఇవి ధరకు తగిన విలువను కలిగి ఉంటాయి. అలాంటి హ్యుందాయ్ బ్రాండ్ నుండి వచ్చిన కాంపాక్ట్ సెడాన్ ఆరా ఈ విభాగంలో ఖచ్చితంగా ఉత్తమ ఇంటీరియర్‌లు కలిగిన కార్లలో ఒకటిగా చెప్పొచ్చు.

బెస్ట్ ఇంటీరియర్స్‌తో లభిస్తున్న కాంపాక్ట్ సెడాన్లు: డిజైర్, అమేజ్, ఆరా మరెన్నో..

హ్యుందాయ్ ఆరా ఇంటీరియర్ లేఅవుట్ ఐ20 మరియు వెర్నా మోడళ్ల నుండి ప్రేరణ పొంది డిజైన్ చేసినట్లుగా అనిపిస్తుంది. డ్యాష్‌బోర్డ్ మధ్యలో సెంటర్ కన్సోల్ అమరిక చాలా చక్కగా ఉంటుంది మరియు మెరుగైన విజిబిలిటీ కోసం కోసం ఇది డ్రైవర్ వైపు కొద్దిగా వంగినట్లుగా ఉంటుంది. ఇందులో మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ ఇతర మోడళ్ల కంటే చాలా మెరుగ్గా అనిపిస్తుంది. ఇందులోని క్యాబిన్ స్పేస్ అమేజ్ అంత సంవృద్ధిగా ఉండకపోవచ్చు, కానీ బాగానే ఉంటుంది. ఈ కారులోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ లు ఇతర పోటీదారుల కంటే మెరుగ్గా ఉంటాయి. ఈ కారులో 402 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది.

బెస్ట్ ఇంటీరియర్స్‌తో లభిస్తున్న కాంపాక్ట్ సెడాన్లు: డిజైర్, అమేజ్, ఆరా మరెన్నో..

టాటా టిగోర్ (Tata Tigor)

టాటా మోటార్స్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ టియాగోలో కనిపించే ఇంటీరియర్ లేఅవుట్ నే మనం కొత్త టాటా టిగోర్ కాంపాక్ట్ సెడాన్ లో కూడా చూడొచ్చు. కాకపోతే, ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో చాలా స్పోర్టీగా ఉండే స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు చూడటానికి చాలా ఖరీదైన కార్లలో ఉన్న అనుభూతిని కలిగిస్తాయి.

బెస్ట్ ఇంటీరియర్స్‌తో లభిస్తున్న కాంపాక్ట్ సెడాన్లు: డిజైర్, అమేజ్, ఆరా మరెన్నో..

టాటా టిగోర్ ఇంటీరియర్ బ్లాక్ అండ్ గ్రే థీమ్ లో ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ అమరిక కూడా చాలా క్లీన్ గా ఉంటుంది. సెంటర్ కన్సోల్ మధ్యలోనే అమర్చిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ఏసి వెంట్స్ మరియు వాటి చుట్టూ క్రోమ్ ఇన్‌సెర్ట్స్, పియానో బ్లాక్ ఫినిష్డ్ మెటీరియల్స్ తో ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే, ఈ కారులోని సీట్లు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. అయితే ఇవి నలుగురు పెద్దలకు మాత్రమే అనుకూలంగా ఉంటాయి. ఈ కారులో 419 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది.

బెస్ట్ ఇంటీరియర్స్‌తో లభిస్తున్న కాంపాక్ట్ సెడాన్లు: డిజైర్, అమేజ్, ఆరా మరెన్నో..

స్కోడా రాపిడ్ (Skoda Rapid)

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా అందిస్తున్న ఎంట్రీ లెవల్ సెడాన్ ర్యాపిడ్ ఈ విభాగంలో కెల్లా అత్యంత ప్రీమియం ఇంటీరియర్ లేఅవుట్ ని మరియు అత్యధిక బూట్ స్పేస్ (460 లీటర్లు) కలిగి ఉంటుంది. స్కోడా రాపిడ్ సెడాన్ లో మాత్రమే ముందు వైపు డ్రైవర్, కో-డ్రైవర్ ఆర్మ్‌రెస్ట్ ఫీచర్ లభిస్తుంది.

బెస్ట్ ఇంటీరియర్స్‌తో లభిస్తున్న కాంపాక్ట్ సెడాన్లు: డిజైర్, అమేజ్, ఆరా మరెన్నో..

స్కోడా ర్యాపిడ్ లోని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అనలాగ్ యూనిట్ అయినప్పటికీ, ఇది చాలా చక్కగా డిజైన్ చేయబడి ఉంటుంది. సెంటర్ కన్సోల్‌లో పరికరాల అమరిక కూడా చక్కగా ఉంటుంది. ఇందులో డ్యాష్‌బోర్డ్ మధ్యలో అమర్చిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, దానికి ఎగువనే ఉండే ఏసి వెంట్స్ మరియు దిగువన ఉండే ఏసి కంట్రోల్స్ వాటి చుట్టూ క్రోమ్ ఇన్‌సెర్ట్స్ మరియు పియానో బ్లాక్ ఫినిష్డ్ మెటీరియల్స్ ఉంటాయి.

Most Read Articles

English summary
Compact sedans in india with amazing interiors dzire amaze aura and more
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X