Tata Punch వర్సెస్ Maruti WagonR: పోటీలో ఎవరు గెలుస్తారు?

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం Tata Motors (టాటా మోటార్స్) నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో ఒకటి Tata Punch (టాటా పంచ్) మైక్రో ఎస్‌యూవీ. భారత మార్కెట్లో పెరుగుతున్న ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, కంపెనీ ఓ సరికొత్త వ్యూహంతో పంచ్ మైక్రో ఎస్‌యూవీ ద్వారా ప్రజల ముందుకు వస్తోంది.

Tata Punch వర్సెస్ Maruti WagonR: పోటీలో ఎవరు గెలుస్తారు?

ప్రస్తుతం Tata Motors నుండి లభిస్తున్న Nexon (నెక్సాన్) ఎస్‌యూవీకి దిగువన ఎంట్రీ లెవల్ ఎస్‌యూవీగా కంపెనీ ఈ Punch (పంచ్) మైక్రో ఎస్‌యూవీని ప్రవేశపెట్టనుంది. ఈ చిన్న కారుకి సంబంధించి కంపెనీ పూర్తి వివరాలు వెల్లడించనప్పటికీ, ఇందులో ఏమేమి ఆశించవచ్చో కంపెనీ ఇప్పటికే కొన్ని సూచనలు ఇచ్చింది. టాటా పంచ్ కొత్త హ్యాచ్‌బ్యాక్ మోడళ్ల మార్కెట్‌ని క్యాప్చర్ చేయగలదని భావిస్తున్నారు.

Tata Punch వర్సెస్ Maruti WagonR: పోటీలో ఎవరు గెలుస్తారు?

అంటే, దీని అర్థం టాటా నుండి రాబోయే కొత్త మినీ ఎస్‌యూవీ ఈ విభాగంలో Maruti WagonR మరియు Hyundai Santro వంటి హ్యాచ్‌బ్యాక్‌లకు సవాలుగా ఉంటుంది. ఈ విభాగంలో Maruti Suzuki WagonR ఇప్పటికే భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్యామిలీ కారుగా ఉంది. టాల్ బాయ్ డిజైన్ కలిగిన వ్యాగన్ఆర్ చూడటానికి మినీ ఎస్‌యూవీలా ఉండి Tata Punch తో పోటీకి సిద్ధంగా ఉంటుంది. మరి ఈ కథనంలో పంచ్‌కి మరియు మరియు వ్యాగన్ఆర్‌కి మధ్య ఉన్న పోలికలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..

Tata Punch వర్సెస్ Maruti WagonR: పోటీలో ఎవరు గెలుస్తారు?

డిజైన్, స్టైల్ మరియు పరిమాణం

Tata Punch మైక్రో ఎస్‌యూవీ గతంలో కంపెనీ ఆవిష్కరించిన HBX కాన్సెప్ట్‌తో దాదాపు 90 శాతం వరకూ సమానంగా ఉంటుంది. అయితే, ఈ కాన్సెప్ట్ వెర్షన్ కన్నా ప్రొడక్షన్ వెర్షన్ పంచ్ ఎస్‌యూవీ చాలా ప్రాక్టికల్‌గా కనిపిస్తుంది. స్ప్లిట్ ఫ్రంట్ గ్రిల్, టాటా హారియ్ నుండి ప్రేరణ పొందిన స్ప్లిట్ హెడ్‌ల్యాంప్‌లు మరియు హుడ్‌కు దిగువన అమర్చిన సన్నటి ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

Tata Punch వర్సెస్ Maruti WagonR: పోటీలో ఎవరు గెలుస్తారు?

పంచ్ మైక్రో ఎస్‌యూవీలో ఫ్రంట్ డిజైన్ చాలా విశిష్టంగా కనిపిస్తుంది. దీని ఫ్రంట్ బంపర్ డ్యూయెల్ టోన్‌లో ఉంటుంది. ఫ్రంట్ బంపర్‌లో X మరియు Y ప్యాటర్న్‌తో కూడిన గ్రిల్ మరియు పెద్ద ఎయిర్ ఇంటేక్స్ ఉంటాయి. అదే బంపర్ దిగువ భాగంలో గుండ్రటి ఫాగ్ ల్యాంప్స్ కూడా అమర్చబడి ఉంటాయి. బానెట్‌పై బాడీ లైన్స్ కూడా మజిక్యులర్‌గా కనిపిస్తాయి.

Tata Punch వర్సెస్ Maruti WagonR: పోటీలో ఎవరు గెలుస్తారు?

సైడ్ డిజైన్‌ను గమనిస్తే చబ్బీ వీల్ ఆర్చెస్, పెద్ద బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్, రూఫ్ కలర్‌తో మ్యాచ్ అయ్యే సైడ్ మిర్రర్స్ మరియు వాటిపై ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్, బాడీ కలర్ ఫ్రంట్ డోర్ హ్యాండిల్ మరియు సి-పిల్లర్‌పై అమర్చిన బ్లాక్ రియర్ డోర్ హ్యాండిల్ మరియు స్టైలిష్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. వెనుక వైపు బ్లాక్ కలర్ బంపర్, రూఫ్ స్పాయిలర్, డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్ మరియు రియర్ వైపర్ విత్ వాషర్ మొదలైనవి ఉన్నాయి.

Tata Punch వర్సెస్ Maruti WagonR: పోటీలో ఎవరు గెలుస్తారు?

ఇక Maruti WagonR డిజైన్ విషయానికి వస్తే, ఇదొక టాల్‌బాయ్ డిజైన్ కలిగిన హ్యాచ్‌బ్యాక్ మరియు చూడటానికి చిన్న సైజు ఎస్‌యూవీ మాదిరిగా ఉంటుంది. అయితే, పంచ్‌తో పోలిస్తే వ్యాగన్ఆర్ డిజైన్ చాలా సింపుల్‌గా ఉంటుంది, ఇందులో ప్రత్యేకంగా మోడ్రన్ ఎలిమెంట్స్ ఏవీ లేవు. ఇందులో పెద్ద హాలోజెన్ హెడ్‌ల్యాంప్‌లు, బంపర్ దిగువ భాగంలో గుండ్రటి ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి.

Tata Punch వర్సెస్ Maruti WagonR: పోటీలో ఎవరు గెలుస్తారు?

ఫ్రంట్ బంపర్ ఎగువ భాగం మరియు హుడ్ దిగువ భాగంలో దీర్ఘచతురస్రాకారపు ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది, దీనిపై క్రోమ్ గార్నిష్ మరియు మధ్యలో పెద్ద సుజుకి లోగో ఉంటుంది. ఫ్రంట్ బంపర్ దిగువన పెద్ద ఎయిర్ ఇన్‌టేక్ కూడా ఉంటుంది. సైడ్ మరియు వెనుక డిజైన్ కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది. ఓవరాల్‌గా మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (WagonR) బాక్సీ టైప్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

Tata Punch వర్సెస్ Maruti WagonR: పోటీలో ఎవరు గెలుస్తారు?

డిజైన్ పరంగా ఈ రెండు మోడళ్లను పోల్చి చూస్తే, Punch మినీ ఎస్‌యూవీ WagonR కంటే పొడవుగా మరియు వెడల్పుగా ఉంటుందని తెలుస్తోంది. అయితే, Maruti కారు కొంచెం పొడవైన వీల్‌బేస్ మరియు అధిక ఎత్తు కలిగి ఉండటం గమనార్హం. ఒక్కమాటలో చెప్పాలంటే, స్టైలింగ్ పరంగా Tata Punch బెస్ట్‌గా ఉంటుంది. Tata Motors అన్ని రకాల సరికొత్త ఫీచర్లతో ఈ వాహనాన్ని రూపొందించింది.

Tata Punch వర్సెస్ Maruti WagonR: పోటీలో ఎవరు గెలుస్తారు?

ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్లు

Tata Punch లోపలి భాగాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే, దీని ఇంటీరియర్ టియాగో మరియు అల్ట్రోజ్ మోడళ్ల మాదిరిగానే ఉంటుందని సమాచారం. మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లను ఇందులో ఆశించవచ్చు. టాటా HBX కాన్సెప్ట్ నుండి స్పూర్తి పొంది దీని ఇంటీరియర్స్‌ను డిజైన్ చేసే అవకాశం ఉంది.

Tata Punch వర్సెస్ Maruti WagonR: పోటీలో ఎవరు గెలుస్తారు?

ఇంకా ఈ చిన్న కారులో ఆల్ పవర్ విండోస్, పవర్ ఆపరేటెడ్ సైడ్ మిర్రర్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, స్మార్ట్ కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, రియర్ పార్కింగ్ కెమెరా మరియు లేటెస్ట్ IRA కనెక్ట్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉండొచ్చని తెలుస్తోంది.

Tata Punch వర్సెస్ Maruti WagonR: పోటీలో ఎవరు గెలుస్తారు?

ఇక Maruti Suzuki WagonR ఇంటీరియర్స్ విషయానికి వస్తే ఇది చాలా సాధారణంగా ఉంటుంది. ఇందులో డ్యూయెల్ టోన్ బ్లాక్ అండ్ బేజ్ ఇంటీరియర్ డిజైన్, ఆడియో మరియు ఫోన్ కంట్రోల్స్‌తో కూడిన మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు డ్యాష్‌బోర్డ్ మధ్యలో అమర్చిన 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి.

Tata Punch వర్సెస్ Maruti WagonR: పోటీలో ఎవరు గెలుస్తారు?

అంతేకాకుండా, ఇందులో మ్యాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, స్టీరింగ్ వీల్, ఏసి వెంట్స్, గేర్ నాబ్ మరియు డ్యాష్‌బోర్డుపై సిల్వర్ యాక్సెంట్స్, సిల్వర్ కలర్ ఇన్‌సైడ్ డోర్ హ్యాండిల్స్, పవర్ అడ్జస్టబుల్ ORVM, పవర్ విండోస్, కీలెస్ ఎంట్రీ, డ్రైవర్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, రియర్ పార్కింగ్ సెన్సార్ మరియు EBD తో కూడిన ABS వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

Tata Punch వర్సెస్ Maruti WagonR: పోటీలో ఎవరు గెలుస్తారు?

ఫీచర్ల పరంగా చూస్తే, కొత్త టాటా పంచ్ వ్యాగన్ఆర్ కన్నా అడ్వాన్స్ ఫీచర్లతో రావచ్చని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.

Tata Punch వర్సెస్ Maruti WagonR: పోటీలో ఎవరు గెలుస్తారు?

ఇంజన్ ఆప్షన్స్

Tata Punch 1.2 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్‌తో రావచ్చని సమాచారం. ఈ ఇంజన్ గరిష్టంగా 86 బిహెచ్‌పి పవర్‌ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. కాగా, ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్లలో కంపెనీ 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించవచ్చని సమాచారం. ఈ మైక్రో ఎస్‌యూవీ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది.

Tata Punch వర్సెస్ Maruti WagonR: పోటీలో ఎవరు గెలుస్తారు?

మారుతి వ్యాగన్ఆర్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఇది రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులో మొదటి 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఇది గరిష్టంగా 69 బిహెచ్‌పి పవర్‌ను మరియు 90 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, రెండవది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, ఇది గరిష్టంగా 83 బిహెచ్‌పి పవర్‌ను మరియు 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి రెండూ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఏమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో అందుబాటులో ఉన్నాయి. WagonR యొక్క 1.0 లీటర్ మాన్యువల్ వెర్షన్ కూడా సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది.

Tata Punch వర్సెస్ Maruti WagonR: పోటీలో ఎవరు గెలుస్తారు?

ధర

Tata Punch ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ ఏడాది దీపావళి పండుగ సీజన్ నాటికి ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో దీని ఖచ్చితమైన ధర మరియు ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి. అయితే, మార్కెట్ అంచనా ప్రకారం, Tata Punch మినీ ఎస్‌యూవీ ప్రారంభ ధర సుమారు రూ. 5 లక్షలు ఉంటుందని అంచనా.

Tata Punch వర్సెస్ Maruti WagonR: పోటీలో ఎవరు గెలుస్తారు?

Maruti Suzuki WagonR ధరలు ప్రస్తుతం రూ. 4.80 లక్షల నుండి రూ. 6.33 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఈ టాల్‌బాయ్ హ్యాచ్‌బ్యాక్ యొక్క అతి పెద్ద లోపం ఏంటంటే, దీంట్లో అత్యాధునిక ఫీచర్లు లేకపోవడమే. అయితే, ఇది ధరకు తగిన విలువను మాత్రం అందిస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.

Most Read Articles

English summary
Comparison between tata punch and maruti suzuki wagonr
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X