Hyundai Compensation కస్టమర్‌కు రూ. 2 లక్షలు చెల్లించాలని హ్యుందాయ్‌కు కోర్టు ఆదేశాలు.. అసలేం జరిగిందంటే.!!

కస్టమర్లకు ఏదైనా వస్తువును విక్రయించినప్పుడు ఖచ్చితంగా గ్యారంటీ, వారంటీని అందిస్తాయి. అందులో ఫెయిల్‌ అయితే కస్టమర్‌కు తగిన పరిహారం చెల్లించాలని కన్జ్యూమర్‌ కోర్టు.. సదరు కంపెనీలను ఆదేశిస్తుంది. తాజాగా ఓ మహిళా కస్టమర్‌కు కూడా రూ. 2 లక్షల పరిహారం చెల్లించాలని ఢిల్లీ కన్జ్యూమర్‌ కోర్టు ఆదేశించింది. ఇంతకీ ఇది ఏ విషయంలో..

కారును కొనుగోలు చేసిన నెలలోపే దాని క్వాలిటీలో లోపం బయటపడటంతో ఆందోళనకు గురైన మహిళ.. చేసిన వాదనకు ఫలితంగా ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్(NCDRC).. ఈ అంశం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఈ సంఘటన 2009 లో జరగ్గా.. 14 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పునిచ్చింది.

Hyundai-i10

కస్టమర్ PR మీనా సెప్టెంబర్ 2009లో హ్యుందాయ్‌(Hyundai) i10 హ్యాచ్‌బ్యాక్‌ను కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆమె ఆ కారును దాదాపు 6,200 కి.మీ పైగానే నడిపారు. అయితే కారును కొనుగోలు చేసిన మొదటి నెలలోనే దానిని నడుపుతున్నప్పుడు బిల్ట్‌ క్వాలిటీ లోపం కారణంగా కారు టైర్‌ ఊడిపోయినట్లు మహిళ ఆరోపించారు. దీనిపై మహిళ జిల్లా కమిషన్‌ను ఆశ్రయించారు.

ఈ అంశంపై స్పందించిన హ్యుందాయ్‌ మోటార్స్‌.. మహిళ కారును గంటకు 65 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నట్లు కోర్టుకు తెలిపింది. లోపభూయిష్టమైన కారు తాము విక్రయించలేదని, కారులో ఎటువంటి లోపాలు లేవని కోర్టులో వాదించింది. మహిళ నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని హ్యుందాయ్‌ మోటార్స్‌ కోర్టులో తెలిపింది.

అయితే అన్ని అంశాలు మరియు సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత కోర్టు.. సరికొత్త కారు ప్రమాదం కారణంగా ఫిర్యాదుదారు లేదా వినియోగదారు చాలా అసౌకర్యానికి లోనవుతారని అభిప్రాయం వ్యక్తం చేసింది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేవారు వాహనం చిన్నదైనా, తరచూ మరమ్మతుల కోసం గ్యారేజీ లేదా సర్వీస్ స్టేషన్‌కు వెళ్లి రిపేర్ చేయించుకోవడానికి ఇష్టపడరని పేర్కొంది.

2015లో, జిల్లా కమిషన్ ఇదే విధమైన తీర్పును ఆమోదించింది. హ్యుందాయ్ నిర్మాణ ప్రమాణాలు సరిగా లేనందుకు దోషిగా పేర్కొంటూ.. 2015లో కమిషన్.. బాధితురాలికి రూ.80,000 పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే ఆ పరిహారం మొత్తంపై సంతృప్తి చెందని పీఆర్ మీనా మరో అడుగు ముందుకేసి ఢిల్లీ స్టేట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్‌ను ఆశ్రయించారు.

కేసును సమీక్షించిన రాష్ట్ర కమిషన్ ఇప్పుడు పరిహారం మొత్తాన్ని రూ. 2 లక్షలకు సవరించింది. ఈ మొత్తాన్ని కస్టమర్‌కు చెల్లించాలని ఆదేశించింది. అయితే భారత్‌లో ఇలా కస్టమర్లకు పరిహారం చెల్లించాలని కార్‌ మేకర్లను ఆదేశించడం ఇది తొలిసారి కాదు. లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ఇంజిన్‌ విషయంలో కస్టమర్లకు రూ.42 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

కాగా ఇటీవల పాత డబ్ల్యుఆర్-వీ విక్రయానికి సంబంధించి కస్టమర్లకు రూ.9.27 లక్షలను రీఫండ్ చేయాలని వినియోగదారుల కోర్టు హోండాను ఆదేశించగా.. మరో సంఘటనలో, కొత్త హ్యాచ్‌బ్యాక్‌లో ప్రయాణిస్తుండగా నిప్పంటుకోవడంతో కస్టమర్‌కు రూ.1.4 లక్షల నగదుతో పాటు సరికొత్త హ్యుందాయ్ శాంట్రో చెల్లించాలని హ్యుందాయ్‌కి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

More from DriveSpark

Article Published On: Tuesday, December 19, 2023, 18:47 [IST]
English summary
Consumer court asks hyundai motors to pay rs 2 lakh compensation to customer
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+