నమ్మి తీరాల్సిందే!! మెర్సిడెస్ బెంజ్ ఎస్‌యూవీగా మహీంద్రా బొలెరో

ఓ కస్టమైజేషన్ బృందం ఓ సాధారణ మహీంద్రా బొలెరో వాహనాన్ని అచ్చం మెర్సిడెస్ బెంజ్ జి-వ్యాగన్ రూపంలోకి మార్చేసింది.

By Anil

మెర్సిడెస్ బెంజ్ ఎస్‌యూవీ అంటే మాటలా... కోట్ల రుపాయల యవ్వారం. డబ్బున్నోడికైనా... లేనోడికైనా... మెర్సిడెస్ బెంజ్ అంటే ఇష్టం ఎవరికుండదు. కోట్లకొద్ది డబ్బుల్లేని మెర్సిడెస్ అభిమానులు ఏవో మోడిఫైడ్ కార్లతో సరిపెట్టుకోవాల్సిందే.

మోడిఫైడ్ మహీంద్రా బొలెరో

అలాంటి ఎంతో మంది అభిమానుల కలను నిజం చేసేందుకు తమిళనాడుకు చెందిన ఓ కస్టమైజేషన్ బృందం ఓ సాధారణ మహీంద్రా బొలెరో వాహనాన్ని అచ్చం మెర్సిడెస్ బెంజ్ జి-వ్యాగన్ రూపంలోకి మార్చేసింది. మీకు కూడా ఇలాంటి వెహికల్ కావాలా...? అయితే, ఈ స్టోరీ తప్పకుండా చదవాల్సిందే...

Recommended Video

This McLaren 720S Costs Only 30 Bitcoins While Others Cost $285,000
మోడిఫైడ్ మహీంద్రా బొలెరో

తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన జీప్ స్టూడియో బృందం మహీంద్రా బొలెరో వాహనాన్ని సుమారుగా నాలుగు నెలల పాటు శ్రమించి అచ్చం మెర్సిడెస్ బెంజ్ జి-వ్యాగన్ ఎస్‌యూవీ రూపంలోకి మార్చారు.

మోడిఫైడ్ మహీంద్రా బొలెరో

ఇంటీరియర్ కాకుండా కేవలం ఎక్ట్సీరియర్ మోడిఫికేషన్ ప్యాకేజి ధర రూ. 7.35 లక్షలుగా ఉన్నట్లు జీప్ స్టుడియో పేర్కొంది. దీనిని వ్యక్తిగత అవసరాలకు ఎంచుకునే కస్టమర్లకు మాత్రమే విక్రయిస్తున్నారు.

మోడిఫైడ్ మహీంద్రా బొలెరో

ఛాసిస్ మరియు ఇంజన్ మినహాయిస్తే, మహీంద్రా బొలెరో బాడీ మొత్తాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. వీటి స్థానంలో మెర్సిడెస్ వ్యాగన్‌ను పోలి ఉండే శరీర విడిభాగాలతో అసెంబుల్ చేసి బాడీని మోడిఫై చేసారు.

మోడిఫైడ్ మహీంద్రా బొలెరో

అంటే, ఇంజన్, ఛాసిస్, ఫ్రేమ్ మరియు ఇంటీరియర్ మినహాయిస్తే కేవలం ఎక్ట్సీరియర్ బాడీ మీద అంటించిన మెర్సిడెస్ తరహా బాడీ ప్లేట్లకు 7.35 లక్షలు చార్జ్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ మోడిఫైడ్ బొలెరోలో వెళ్తుంటే మెర్సిడెస్ బెంజ్ ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న ఫీల్ కలుగడం ఖచ్చితం.

మోడిఫైడ్ మహీంద్రా బొలెరో

జీప్ స్టుడియో నిర్వహించిన మోడిఫికేషన్స్‌లో వైట్ కలర్ బాడీ పెయింట్, ఆల్ న్యూ టఫెండ్ గ్లాస్, సరికొత్త ఫ్రంట్ మరియు రియర్ బంపర్లు, అధునాతన అల్లాయ్ వీల్స్ మరియు టైర్లు వంటివి ఉన్నాయి.

మోడిఫైడ్ మహీంద్రా బొలెరో

ప్రస్తుతం మహీంద్రా బొలెరో బేస్ వేరియంట్ ధర రూ. 6.75 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. అంటే మోడిఫికేషన్ ఖర్చులు 7.35 లక్షలతో కలుపుకుంటే ఇలాంటి మోడిఫైడ్ మెర్సిడెస్ బెంజ్ జి-వ్యాగన్ ఎస్‌యూవీని 14.10 లక్షల ఎక్స్-షోరూమ్‌ ధరతో సొంతం చేసుకోవచ్చన్నమాట.

మోడిఫైడ్ మహీంద్రా బొలెరో

మీకు ఇలాంటి మోడిఫైడ్ బొలెరో కావాలంటే జీప్ స్టుడియో బృందాన్ని సంప్రదించగలరు. మోడిఫైడ్ కార్ల గురించి డ్రైవ్‍‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్లో ప్రచురించబడినమరిన్నిస్టోరీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

More from DriveSpark

Article Published On: Friday, December 15, 2017, 13:33 [IST]
English summary
Read In Telugu: Convert Your Mahindra Bolero to Mercedes-Benz G-Wagen for Rs 7.35 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+