పాత కారును ఎలక్ట్రిక్‌గా మార్చితే లాభమా? నష్టమా?..ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఇవే

భారత మార్కెట్‌లో ప్రస్తుతం పెట్రోల్-డీజిల్ వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ కూడా రోజురోజుకూ చాలా వేగంగా పెరుగుతోంది. ఇప్పుడు చాలా మంది ప్రజలు పెట్రోల్-డీజిల్ కార్ల కాలం పోయిందని, ఎలక్ట్రిక్ కార్లే భవిష్యత్తు అని ఆలోచిస్తున్నారు.

అయితే, ఈ మార్పునకు రెండు మార్గాలున్నాయి.. ఒకటి మీ పాత పెట్రోల్/డీజిల్ కారును ఎలక్ట్రిక్‌గా మార్చడం, లేదా నేరుగా ఒక కొత్త ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయడం. ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్ అనేది చాలా మంది మదిలో మెదిలే ప్రశ్న.

Electric Vehicle

పాత పెట్రోల్ లేదా డీజిల్ కారును ఎలక్ట్రిక్‌గా మార్చాలనుకుంటే ముందుగా రెట్రోఫిట్టింగ్ ప్రక్రియ ఏమిటి, దానిని సరిగ్గా ఎలా చేయించుకోవాలి అనేది అర్థం చేసుకోవాలి. మీ దగ్గర ఇప్పటికే మంచి కండిషన్‌లో ఉన్న పెట్రోల్ లేదా డీజిల్ కారు ఉండి, దానిని స్క్రాప్ చేయకుండా మరికొన్ని సంవత్సరాలు ఉపయోగించాలనుకుంటే.. ఎలక్ట్రిక్ కన్వర్షన్ ఒక మంచి ఆప్షన్ కావచ్చు. ప్రస్తుతం భారతదేశంలో ఈవీ కన్వర్షన్ కిట్‌లను అందించే అనేక కంపెనీలు ఉన్నాయి.

ముందుగా మీ కారు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం రెట్రోఫిట్టింగ్‌కు అర్హత కలిగి ఉందో లేదో చెక్ చేయాలి. సాధారణంగా 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ కార్లు, 15 సంవత్సరాల కంటే ఎక్కువ పాత పెట్రోల్ కార్లు రోడ్డుపై నడపడానికి అనుమతించబడవు. ఇలాంటి వాహనాలను ముందుగా సంబంధిత ప్రాంతీయ రవాణా కార్యాలయంలో డీ-రిజిస్టర్ చేయించుకోవాలి. ఈ ప్రక్రియ వాహనాన్ని ప్రభుత్వ రికార్డుల నుండి తొలగిస్తుంది.

Electric Vehicle

తద్వారా అది రోడ్డుపై నడవడానికి అనుమతి ఉండదు. దీని తర్వాత, ఎలక్ట్రిక్ కిట్ ఇన్‌స్టాలేషన్ కోసం అధీకృత కంపెనీలను సంప్రదించవచ్చు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఆన్‌లైన్ పోర్టల్స్ లేదా రాష్ట్ర రవాణా శాఖ వెబ్‌సైట్ ద్వారా మీరు ధృవీకరించబడిన ఈవీ కిట్ తయారీదారు లేదా ఇన్‌స్టాలర్ వివరాలను తెలుసుకోవచ్చు.

ఈ కంపెనీలను సంప్రదించి మీ కారు మోడల్, ప్రస్తుత పరిస్థితి ఆధారంగా ఈవీ కన్వర్షన్ కిట్‌ను సెలక్ట్ చేసుకోవచ్చు. దీనితో పాటు బ్యాటరీ కెపాసిటీ, మోటార్ స్పెసిఫికేషన్, ఇన్‌స్టాలేషన్ ఖర్చు గురించి పూర్తి సమాచారం ఇస్తారు. ఒకసారి ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తర్వాత, వాహనాన్ని RTOలో ఎలక్ట్రిక్ వెహికల్‌గా మళ్లీ రిజిస్టర్ చేయించాలి. దీని కింద ఫిట్‌నెస్ సర్టిఫికేట్, ఇతర టెక్నికల్ చెకింగ్స్ నిర్వహిస్తారు.

Electric Vehicle

తద్వారా కారు అన్ని భద్రతా నియమాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించబడుతుంది. ఈ విధంగా మీ పాత వాహనాన్ని కొత్త ఎలక్ట్రిక్ అవతారంలో మార్చవచ్చు. ఒక పెట్రోల్/డీజిల్ కారును ఎలక్ట్రిక్‌గా మార్చడానికి సగటున రూ.3లక్షల నుండి రూ.10లక్షల వరకు ఖర్చవుతుంది. ఇది కొత్త ఈవీ కొనుగోలుతో పోలిస్తే చాలా తక్కువ. అయితే, మీ కారులో ఎంత మంచి మోటార్, బ్యాటరీ, కంట్రోలర్, రోలర్ బిగిస్తే, ఖర్చు కూడా అంత పెరుగుతుంది.

చాలా కన్వర్షన్ కిట్‌లు ఎలాంటి అధికారిక సర్టిఫికేషన్ లేకుండా అమర్చుతారు. దీనివల్ల సేఫ్టీ అనేది ప్రశ్నార్థకం. ప్రతి రాష్ట్రంలో ఈవీ కన్వర్షన్ కోసం ఆర్టీవో ఆమోదం అవసరం. ఈ ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉండవచ్చు. కన్వర్ట్ చేయబడిన ఈవీలలో కొత్త ఎలక్ట్రిక్ కార్లలో ఉండే స్మార్ట్ టెక్నాలజీ, కనెక్టివిటీ లేదా బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఉండవు.

నేరుగా ఒక కొత్త ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేస్తే పూర్తిగా ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్స్ పీరియన్స్ పొందుతారు, దీని పర్ఫామెన్స్ లో పనితీరులో మాత్రమే కాకుండా, టెక్నాలజీ విషయంలో కూడా అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. కొత్త ఈవీలు 300 నుండి 500 కి.మీ.ల వరకు రేంజ్‌ను అందిస్తాయి, ఇది మీ రోజువారీ అవసరాలకు సరిపోతుంది.

కంపెనీ నుండి లభించే వారంటీ, RTO ఆమోదంతో సంబంధించి ఎలాంటి సమస్యలు ఉండవు. అనేక రాష్ట్రాలలో ఈవీలపై సబ్సిడీ, రిజిస్ట్రేషన్ ఫీజులో మినహాయింపు లభిస్తుంది. కొత్త కారు రీసేల్ వాల్యూ కన్వర్ట్ చేయబడిన ఈవీ కంటే మెరుగ్గా ఉంటుంది.

కొత్త ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయడానికి రూ.8 లక్షల నుండి రూ.25 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు కావచ్చు. భారతదేశంలో ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య ఇంకా పరిమితంగా ఉంది, దీనివల్ల లాంగ్ డ్రైవ్‌లలో కొద్దిగా ఆందోళన కలగవచ్చు.

మీ పాత కారు మంచి కండీషన్లో ఉండి, మీరు పరిమిత బడ్జెట్‌లో ఈవీ ఎక్స్ పీరియన్స్ పొందాలనుకుంటే, కన్వర్షన్ కిట్ ఆప్షన్ పరిశీలించవచ్చు. కాకపోతే నమ్మకమైన కంపెనీ నుంచి చేయించుకోవాలి. అన్ని చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేయాలి. ఒకవేళ సురక్షితమైన కారును కోరుకుంటే కొత్త ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయడం ఉత్తమం. ఇది నిర్వహణ మెయింటెనెన్స్ గురించి ఆందోళన లేకుండా చేస్తుంది

More from DriveSpark

Article Published On: Tuesday, July 1, 2025, 14:33 [IST]
English summary
Convert your petrol diesel car to ev or buy a new one which is more profitable
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+