బంగారం లాంటి బైకులను ఇలా..... : దిస్ ఈస్ టూ మచ్ బ్రదర్
ప్రపంచంలో మంచోళ్లు ఎంత మంది ఉంటే, చెడ్డోళ్లు కూడా అంతే మంది ఉంటారు. మంచోళ్ల గురించి ప్రక్కన పెడితే, చెడ్డ వాళ్లు ప్రభుత్వాలకు ఎదో ఒక కారణం చేత మూడు చెరువుల నీళ్లు తాగస్తుంటారు. ఇలాంటి వారికి బుద్ది చెప్పి వారి ఆటలు కట్టడి చేయడానికి ఎన్నో పాట్లు పడుతుంటారు. వారికి బుద్ది చెప్పే ఆలచనల్లో కొన్ని సార్లు ప్రభుత్వాలు బుద్ది లేని నిర్ణయాలు తీసుకుంటారు. అందుకు నిదర్శనం ఈ క్రింద గల వీడియో
న్యూయార్క్ సిటిలో ఆకతాయి బైకు రైడర్లుకు కొదవే లేదు. కొంచెం ఢిఫరెంట్‌గా ఉండాలనుకునేవారు చేసే ఆకతాయి పనులు ప్రభుత్వాల రూల్స్‌ను కూడా అతిక్రమిస్తారు. వీరిని అరికట్టడానికి న్యూయార్క్ పోలీసులు మరియు న్యూయార్క్ నగర మేయర్ బిల్ డి బ్లాసియో కలిసి ఒకస బుద్ది లేని నిర్ణయం తీసుకున్నారు.
దీనిని కూడా చదవండి: ఈ కాలంలోనే కాదు, ఆ కాలంలో కూడా వీటిని చూసి విస్తుపోయారు
న్యూ యార్క్ నగరంలో రూల్స్‌ను అతిక్రమించినందుకు గాను జప్తు చేసిన ఎన్నో బైకులను, ద్విచక్రవాహనాలను బుల్డోజర్‌తో తొక్కించి నుజ్జు నుజ్జు చేయించారు. ఈ తతంగం తరువాత న్యూ యార్క్ పోలీస్ డిపార్ట్ మరియు సిటి మేయర్ మాట్లాడుతూ, ఇకనైనా ఆకతాయిలు బుద్దిగా ఉండాలని వివరణ ఇచ్చారు. వారు బుద్దిగా ఉండటం గురించి ప్రక్కన పెడితే బంగారం లాంటి బైకులను నాశనం చేశారు. కనీసం వీటికి వేలం నిర్వహించి ఉంటే ప్రభుత్వానికి కూసంత పైకమయినా వచ్చేది.
దీనిని కూడా చదవండి: జిపిఎస్‌ను నమ్మి 100 అడుగుల నూతిలో నిండా మునిగింది


Click it and Unblock the Notifications








