కర్ఫ్యూ సమయంలో పట్టుబడ్డారో.. ఇక అంబులెన్స్‌లోకే, ఎందుకంటే?

భారతదేశంలో కరోనా వైరస్ యొక్క సెకండ్ చాలా ఉదృతంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి రోజురోజుకి ఎంతోమంది ప్రజల ప్రాణాలు హరిస్తూ దేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది. ఈ కరోనా వైరస్ నివారణకోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ విధించబడింది.

కర్ఫ్యూ సమయంలో పట్టుబడ్డారో.. ఇక అంబులెన్స్‌లోకే, ఎందుకంటే?

కరోనా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న కారణంగా ప్రజలు ఇళ్ళ నుండి బయటకు రాకుండా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకోసమే కర్ఫ్యూలు మరియు పాక్షిక లాక్ డౌన్స్ వంటివి అమలులో ఉన్నాయి. ఈ సమయంలో కచ్చితంగా ప్రజలు పాటించేలా చూడటానికి పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

కర్ఫ్యూ సమయంలో పట్టుబడ్డారో.. ఇక అంబులెన్స్‌లోకే, ఎందుకంటే?

కానీ ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ అనవసరంగా వచ్చే ప్రజలను బయటకు రాకుండా చూడలేకపోతున్నారు. కావున పోలీసులు ఇలాంటి వారిపై విరుచుకుపడుతున్నారు. ఇటీవలే జోధ్పూర్ లో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియోను రాజస్థాన్ పోలీసులు సోషల్ మీడియాలో విడుదల చేశారు.

MOST READ:కరోనా రోగుల కోసం కార్లనే మొబైల్ హాస్పిటల్స్‌గా మార్చిన యువకులు

కర్ఫ్యూ సమయంలో పట్టుబడ్డారో.. ఇక అంబులెన్స్‌లోకే, ఎందుకంటే?

ప్రస్తుతం ఆ ప్రాంతం మొత్తం రెడ్ అలర్ట్ విధించారు. కావున ప్రజలు ఇక్కడ కారణం లేకుండా బయటకు రాకూడదనే నియమం కూడా ఉంది. కావున అకారణంగా బయటకి వచ్చే వాహనదారులకు పోలీసులు సరైన గుణపాఠం చెబుతున్నారు. ఇందులో భాగంగా పోలీసులు భారీ జరిమానాలు విధింస్తున్నారు, అంతే కాకుండా ఒక పోలీస్ టీమ్ ఒక కొత్త పద్దతిని అనుసరించింది.

కర్ఫ్యూ సమయంలో పట్టుబడ్డారో.. ఇక అంబులెన్స్‌లోకే, ఎందుకంటే?

ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులను పోలీసులు బలవంతంగా పట్టుకెళ్లి అంబులెన్సులో బంధిస్తున్నారు. వీడియోలో మొదట బైకర్ పోలీసుల నుండి తప్పించుకుంటాడు, కాని రెండవ ప్రయత్నంలో, బైకర్ పట్టుబడ్డాడు. వీడియోలో పలువురు పోలీసు అధికారులు బలవంతంగా ఆ వ్యక్తిని బైక్ నుండి తీసుకెళ్లి అంబులెన్స్‌లో వేస్తున్నారు.

MOST READ:కరోనా ఎఫెక్ట్; అంబులెన్సులుగా మారిన పోలీస్ వాహనాలు

కర్ఫ్యూ సమయంలో పట్టుబడ్డారో.. ఇక అంబులెన్స్‌లోకే, ఎందుకంటే?

అంబులెన్స్ ఆ సమీపంలోనే ఉంచి ఉండటం మీరు వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. లాక్ డౌన్ సమయంలో బయటికి వెళ్లిన వారిని ఈ అంబులెన్స్ లోకి ఎక్కిస్తున్నారు. వారు అంబులెన్స్ నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు కూడా చేస్తుండటం ఇక్కడ గమనించవచ్చు.

కర్ఫ్యూ సమయంలో పట్టుబడ్డారో.. ఇక అంబులెన్స్‌లోకే, ఎందుకంటే?

ప్రభుత్వం ప్రకటించిన కొత్త రూల్స్ ప్రకారం నిబంధనలు ఉల్లఘిస్తూ పట్టుబట్టవారు నిబంధనల ప్రకారం, వారిని సంస్థాగత నిర్బంధ సెటప్‌లో సమయం గడపడానికి అధికారులు పంపుతారు. తర్వాత ఈ వ్యక్తులకు RT-PCR టెస్ట్ చేస్తారు. ఇందులో నెగిటీవ్ వస్తే బయటికి పంపడానికి అనుమతిస్తారు. అయితే ఇక్కడ వీడియోలో కనిపించే వ్యక్తులు ఎంత సమయం నిర్బంధించబడ్డారో కచ్చితంగా తెలియదు.

MOST READ:రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కాపాడిన హెల్మెట్.. ఎలా అనుకుంటున్నారా?

ఏది ఏమైనా కరోనా లాక్ డౌన్ అనేది కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడటానికి విధించింది. అయితే ప్రజలు దీనిని ఏ మాత్రం పట్టించుకోకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఇది నిజంగా క్షమించరాని నేరం. కావున ప్రజలు ప్రభుత్వాలకు సహకరించాలి.

కర్ఫ్యూ సమయంలో పట్టుబడ్డారో.. ఇక అంబులెన్స్‌లోకే, ఎందుకంటే?

భారతదేశంలో కరోనా వల్ల మరణిస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువవుతోంది. అంతే కాదు ఈ కరోనా వల్ల బాధపడుతున్న వారు మరింత ఎక్కువగా ఉన్నారు. కావున ప్రజలు వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా నడుచుకోవాలి. అప్పుడే ఈ మహమ్మారిని జయించగలము.

MOST READ:వావ్.. 19 వ శతాబ్దాల్లోనే ఇలాంటి ట్రైన్స్ సర్వీస్.. సూపర్ టెక్నాలజీ

Most Read Articles

English summary
Cops Sends Bike Riders Into Ambulance For Violating Lockdown Rules In Jodhpur. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X