లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారికి కొత్త పనిష్మెంట్ [వీడియో]

భారతదేశంలో మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ మరియు తమిళనాడులలో కరోనా వైరస్ సంక్రమణ ఎక్కువగా ఉంది. ఈ రాష్ట్రాల్లో మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. కరోనా నివారణ కోసం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ సరైన ఫలితం లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో చాలా ప్రాంతాలలో పోలీసులు కఠినమైన చర్యలు అమలు చేస్తున్నారు.

లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారికి కొత్త పనిష్మెంట్ [వీడియో]

భారతదేశంలో లాక్ డౌన్ 2020 మార్చి 24 నుండి అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ లాక్ డౌన్ మే 31 వరకు పొడిగించబడింది. ఇప్పుడు దేశంలో నాల్గవ దశ అమలులో ఉంది. ఈ లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకి రాకూడదని పోలీసులు హెచ్చరించారు. కానీ ప్రజలు దీనిని ఏమాత్రం లెక్కచేయడం లేదు. కరోనా లాక్ డౌన్ ఉల్లంఘించిన వాహనదారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారికి కొత్త పనిష్మెంట్ [వీడియో]

లాక్ డౌన్ అమలులోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు వాహనదారులపై లాఠీ ఛార్జ్ చేయడంతో పాటు, జరిమానాలు విధించడం వంటివి మాత్రమే కాకుండా వాహనాలను జప్తుచేయడం కూడా జరిగింది. కొన్ని రోజుల తర్వాత పోలీసులు వాహనదారులను కొట్టడం మానేశారు. లాక్ డౌన్ సమయంలో పోలీసులు దేశవ్యాప్తంగా పదిలక్షలకు పైగా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

MOST READ:కరోనా వల్ల స్టార్ట్ అయిన కొత్త బిజినెస్, ఏంటో తెలుసా ?

లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారికి కొత్త పనిష్మెంట్ [వీడియో]

పోలీసులు కరోనా నియంత్రణలో భాగంగా ఎన్ని కఠినమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ట్రాఫిక్‌ను పూర్తిగా నియంత్రించలేకపోయారు. దీంతో పోలీసులు భిన్న చర్యలు తీసుకున్నారు. కరోనా వైరస్ యొక్క తీవ్రతను వాహనదారులు అర్థం చేసుకోవడమే దీని వెనుక ఉద్దేశ్యం.

లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారికి కొత్త పనిష్మెంట్ [వీడియో]

తిరుపూర్ పోలీసులు ఇటీవల తీసుకున్న ఒక విభిన్న చర్య అందరి దృష్టిని ఆకర్షించింది. లాక్ డౌన్ ఉల్లంఘించిన యువతను కరోనావైరస్ సోకిన వారితో గడపడానికి అంబులెన్స్‌లోకి పంపించారు.

MOST READ:1200 కి.మీ తన తండ్రిని సైకిల్ పై తీసుకువచ్చిన 15 ఏళ్ల అమ్మాయి

లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారికి కొత్త పనిష్మెంట్ [వీడియో]

యువకులు అంబులెన్స్ ఎక్కడానికి వెనుకాడడంతో పాటు అరుస్తున్న వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఇటీవల కాలంలో వైరల్ అయింది. ఢిల్లీలో పోలీసులు ఇప్పుడు ఇలాంటి చర్య తీసుకుంటున్నారు.

లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారికి కొత్త పనిష్మెంట్ [వీడియో]

భారతదేశంలో అత్యధికంగా కరోనావైరస్ ఇన్ఫెక్షన్ ఉన్న నగరాల్లో ఢిల్లీ ఒకటి. ఢిల్లీలో ఉన్న వారిపై పోలీసులు వివిధ చర్యలు తీసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం లాక్‌డౌన్ సమయంలో ఐదుగురు యువకులను రెండు బైక్‌లపై పోలీసులు ఆపారు. యువకులు పోలీసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. కానీ పోలీసులకు పట్టుబడ్డారు.

MOST READ:ఇది మాడిఫైడ్ టయోటా అంబులెన్స్.. చూసారా !

పోలీసులు వారిని పట్టుకున్న తరువాత రోడ్డు పక్కన ఉన్న ఒక మృతదేహం దగ్గరకు తీసుకెళ్లారు. శవం కరోనావైరస్ ఉన్న వ్యక్తి కావచ్చని యువకులు భయపడ్డారు. కానీ అది డమ్మీ మృతదేహం. ఆ యువకులు ఇక్కడ చాలా భయపడటం మనం ఇక్కడ చూడవచ్చు.

లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారికి కొత్త పనిష్మెంట్ [వీడియో]

మృతదేహాన్ని మోస్తున్న యువకుల వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ఇప్పుడు వైరల్ అవుతోంది. తూర్పు ఢిల్లీలోని మధు విహార్ వద్ద ఈ సంఘటన జరిగిందని చెబుతున్నారు. ఏది ఏమైనా కరోనా లాక్ డౌన్ ఉల్లంఘించిన వారికీ ఇది ఒక గుణపాఠం అవుతుంది. కరోనా నియంత్రణలో పోలీసులు రాత్రి పగలు కష్టపడుతున్న సమయంలో ప్రజలు వాటిని ఉల్లంఘించడం ఏమాత్రం సరైన పద్ధతి కాదు. ప్రజలు కూడా కరోనా సంక్రమణను దృష్టిలో ఉంచుకుని నడుచుకోవాలి.

MOST READ:విమానాల్లో ప్రయాణించాలనుకుంటున్నారా, అయితే ఇవి తప్పనిసరిగా పాటించాలి

Most Read Articles

English summary
Cops teach lockdown violators a lesson ask them to pick dummy dead body of a corona patient. Read in Telugu.
Story first published: Friday, May 22, 2020, 18:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X