కరోనా దెబ్బకి కుప్పకూలిన టాక్సీ పరిశ్రమ

ప్రజల జీవితంలో ప్రయాణించడం అనేది జీవితంలో ఒక భాగంగా మారింది. సాధారణంగా ఉపయోగించే ప్రజా రవాణా వాహనాలకంటే ప్రయివేటు వ్యక్తుల వాహనాలయిన టాక్సీలు ఈ కాలంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. భారత దేశంలో ఇప్పుడు ఓలా మరియు ఉబర్ టాక్సీ సేవలు ఎక్కువ వినియోగంలో ఉన్నాయి.

కరోనా దెబ్బకి కుప్పకూలిన టాక్సీ పరిశ్రమ

సాధారణంగా క్యాబ్ లలో ప్రయాణించడానికి ఎక్కువ ధరలను చెల్లించాల్సి వస్తుంది. ఈ ధరలు పగటి పూత ఒక ఎత్తయితే, రాత్రిపూట మరియు పండుగలు ఇతర ప్రత్యేకమైన రోజులలో అదనపు చార్జీలు వసూలు చేస్తుంటారు.

కరోనా దెబ్బకి కుప్పకూలిన టాక్సీ పరిశ్రమ

ఈ నేపథ్యంలో క్యాబ్ కంపెనీల దోపిడీని ముగించాలని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కొత్త విధానాన్ని అమలు చేసింది. ఈ విధానం అదనపు చార్జీలను తగ్గించడానికి రూపొందించబడింది.

కరోనా దెబ్బకి కుప్పకూలిన టాక్సీ పరిశ్రమ

కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో రిక్షాల్లో కొత్త మీటర్లను ఏర్పాటు చేయాలని సూచించాయి. ఈ నిర్ణయాలతో క్యాబ్ కంపెనీలు, ఆటో రిక్షా యజమానులు ఇబ్బంది పడుతున్నారు.

ఇటీవల కాలంలో అతివేగంగా వ్యాపించి ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ ప్రజల పాలిట శాపంగా మారింది. ఈ వైరస్ సాధారణంగా తుమ్మటం, మాట్లాడటం, వైరస్ సోకినా వ్యక్తులను సోకడం వంటివి చేయడం వల్ల మరింత వేగంగా వ్యాపించే అవకాశం ఉంది.

కరోనా దెబ్బకి కుప్పకూలిన టాక్సీ పరిశ్రమ

ఈ కారణాల వల్ల ప్రజలు బయటకు వెళ్ళడానికి భయపడతారు. బహిరంగ ప్రదేశాల్లో తిరగటం కూడా ఆపేసారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా వారం రోజులు అన్ని సేవలను నిలిపివేయాలని ఆదేశించింది. ప్రజలు ఇల్లు వదిలి వెళ్ళడానికి వెనుకాడుతున్నారు. కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే విధంగా ఏర్పాట్లు చేసాయి.

కరోనా దెబ్బకి కుప్పకూలిన టాక్సీ పరిశ్రమ

ఈ విధానం వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు ఇంటి వద్ద ఉండటంతో అద్దె కార్ల వాడకం తగ్గుతోంది. ప్రధానంగా బెంగళూరు మరియు ముంబైలలో అద్దె వాహనాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి.

కరోనా దెబ్బకి కుప్పకూలిన టాక్సీ పరిశ్రమ

నగరాల్లో నడుస్తున్న అద్దె వాహనాలు ఇప్పుడు వినియోగదారులు లేకుండా రోడ్డు పక్కన ఉన్నాయి. కరోనా భయం దీనికి ప్రధాన కారణం. బ్యాంకులో ఇఎంఐ చెల్లించే టాక్సీ డ్రైవర్ల పాలిట ఇది ఒక ఎదురు దెబ్బగా మారింది అని చెప్పవచ్చు.

కరోనా దెబ్బకి కుప్పకూలిన టాక్సీ పరిశ్రమ

ఇదిలా ఉండగా ఇంకా రాబోయే రోజుల్లో వారు వాహనాల యొక్క ఇఎంఐ ని ఎలా చెల్లిస్తారు అనే ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. క్యాబ్ డ్రైవర్ల ఇఎంఐ రీయింబర్స్‌మెంట్ కొన్ని నెలలు ఆలస్యం చేయాలని బ్యాంకులను డిమాండ్ చేసారు.

కోవిడ్ -19 వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. తత్ఫలితంగా షాపింగ్ మాల్స్ మరియు థియేటర్లతో సహా అనేక రాష్ట్రాల్లోని బహిరంగ ప్రదేశాలు ప్రజలు లేకుండా ఉన్నాయి. ఇది ఎక్కువగా కేరళ మరియు బెంగళూరులలో కనిపిస్తుంది.

కరోనా దెబ్బకి కుప్పకూలిన టాక్సీ పరిశ్రమ

ప్రభుత్వం ఆదేశించిన ఈ నిర్ణయాల వల్ల అద్దె వాహనాలను ఉపయోగించే వారి సంఖ్య బెంగళూరులో గణనీయంగా పడిపోయింది. గత వారం 40% నుండి 50% క్షీణించినట్లు నివేదికలు వచ్చాయి. అదే సమయంలో వోగో మరియు యులే వంటి సంస్థలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

కరోనా దెబ్బకి కుప్పకూలిన టాక్సీ పరిశ్రమ

ఎందుకంటే ఈ పరిస్థితులు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని కంపెనీలు భయపడుతున్నాయి. వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి నిర్దిష్ట రక్షణ పరికరాలను ఉపయోగించమని ఉబెర్ మరియు ఓలా డ్రైవర్లను ఆదేశించారు. క్యాబ్ డ్రైవర్లు కూడా యాంటిసెప్టిక్స్ కొనాలని సూచించారు.

Source: ET Auto

Most Read Articles

English summary
Corona virus affects taxi service business. Read in Telugu.
Story first published: Saturday, March 14, 2020, 16:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X