Just In
- 11 hrs ago
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- 13 hrs ago
హ్యుందాయ్ నుండి మరో కొత్త ఎస్యూవీ వస్తోంది, టీజర్ విడుదల
- 14 hrs ago
పూర్తి చార్జ్‌పై 500 కి.మీ ప్రయాణించే మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఏ ఎలక్ట్రిక్!
- 14 hrs ago
మాట నిలబెట్టుకున్న జగన్మోహన్రెడ్డి.. రేషన్ డోర్ డెలివరీకి సర్వం సిద్ధం
Don't Miss
- Lifestyle
శుక్రవారం దినఫలాలు : జాబ్ కోసం నిరుద్యోగులు అకస్మాత్తుగా జర్నీ చేయొచ్చు...!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Movies
ఎంతటి రాకీ భాయ్ అయినా కూడా అది తప్పదు.. మాల్దీవుల్లో యశ్ రచ్చ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
లాక్ డౌన్ సమయంలో పోలీసు సైరన్ ఉపయోగించి పట్టుబడిన రెస్టారెంట్ ఓనర్
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. భారతదేశంలో కూడా రోజు రోజుకి ఎక్కువగా విజృంభిస్తోంది. కోవిడ్ -19 వైరస్ భారతదేశంలో వేగంగా వ్యాపిస్తున్న కారణంగా దీనిని నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి.

కరోనా వైరస్ నివారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ ప్రకటించింది. ప్రజలు అనవసరంగా ఇల్లు వదిలి బయటకు వెళ్ళకుండా పరిమితం చేశారు. అత్యవసర సమయాల్లో అవసరమైన వస్తువులను కొనడానికి ప్రజలు బయటకు రావడానికి కూడా అవకాశం కల్పించబడింది.
లాక్ డౌన్ కారణంగా దేశం మొత్తం బస్సులు, ట్రైన్లు మరియు విమాన సేవలు అన్ని రద్దు చేయబడ్డాయి. వాహనాలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడం వల్ల రోడ్లు ఖాళీగా ఏర్పడ్డాయి.

కరోనా నివారణకు ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ ఇంకా కొంతమంది కార్లు మరియు బైక్‌లలో ప్రయాణిస్తున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అనవసరమైన వాహనదారులకు జరిమానా విధించడంతో పాటు, వాహనాలను జప్తు చేస్తున్నారు. వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులు కూడా నమోదు చేస్తున్నారు.

ఈ లాక్ డౌన్ నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘించినందుకు ముంబై పోలీసులు అక్కడి ప్రసిద్ధ కూలర్ రెస్టారెంట్ ఓనర్ ని అరెస్ట్ చేశారు. కూలర్ రెస్టారెంట్ యజమాని "అలీ కూలర్" ఇటీవల సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు.

ఈ వీడియోలో తానూ కారులో తిరగటం చూడవచ్చు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వైరల్ అవుతోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన తరువాత ఈ సంఘటన జరిగింది. అలీ కూలర్ తన కారులో పోలీసు సైరన్ ఉపయోగించి బహిరంగ రోడ్లపై ప్రయాణించాడు.
అవసరం లేకుండా ఎవరూ బయటకు రాకూడదని ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ, రెస్టారెంట్ యజమాని వీటిని ఉల్లంఘించి రోడ్డుపైకి రావడం చూడవచ్చు. ఈ విధంగా జరిగిన సంఘటనకు అలీ కూలర్ క్షమాపణలు చెప్పాడు.
మరొక వీడియోలో అలీ కూలర్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ కి కట్టుబడి ఉండాలని అన్నారు. వైద్యులు మరియు పోలీసులు ప్రతి ఒక్కరూ తమ భద్రతకు ప్రాధాన్యతనిస్తున్నారు. కాబట్టి మనం కూడా వారికి మద్దతు తెలపాలి అన్నారు. అంతే కాకుండా లాక్ డౌన్ సమయంలో అతడు బయటకు వచ్చినందుకు క్షమాపణలు చెప్పారు. అతను క్షమాపణ చెప్పిన తర్వాత కూడా అతనిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

జనసాంద్రత ఎక్కువగా కలిగిన భారతదేశంలో కోవిడ్ -19 వైరస్ వేగంగా వ్యాపించడానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి ఈ భయంకమైన వైరస్ నివారణకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించబడింది. ఈ కారణంగా, ప్రజలు బయటకు రాకూడదని పోలీసులు డిమాండ్ చేస్తున్నారు.