నిజమైన ఫార్ములా వన్ కారులా కనిపించే వీడియో గేమ్

By Ravi

మీరు గేమింగ్ ప్రియులా..? ఫార్ములా వన్ వంటి రేస్ గేమ్‌లు ఆడటమంటే మీకు ఇష్టమేనా..? అయితే ఈ గేమ్‌ను రొటీన్‌గా కంప్యూటర్ లేదా మొబైల్స్ వంటి గ్యాడ్జెట్లపై కాకుండా కొంచెం రియలిస్టిక్‌గా ఆడుదామా...? గ్యాడ్జెట్లపై రేసింగ్ గేమ్‌ల పట్ల తృప్తి చెందని వారి కోసం, యూకేకు చెందిన కాస్ట్‌కో కంపెనీ ఓ అధునాత వీడియో గేమ్ పరికరాన్ని రూపొందించింది. ఇది చూడటానికి అచ్చం ఫార్ములా వన్ కారు మాదిరిగానే ఉంటుంది.

ఈ ఫార్ములా వన్ సిమ్యులేటర్ సాధారణ గేమింగ్ కన్సోల్ కన్నా చాలా భిన్నంగా ఉంటుంది. ఈ కారులో కూర్చొని వీడియో గేమ్ ఆడుతుంటే, రియల్‌గా రేస్ ట్రాక్‌పై తాము ఫార్ములా వన్ కారును నడుపుతున్న అనుభూతి కలుగుతుంది. ఫార్ములా వన్ కార్లలో ఉండే స్టీరింగ్ వీల్, బ్రేక్స్, యాక్సిలేటర్ అన్ని ఇందులో ఉంటాయి. ఇందులోని కంప్యూటర్లు ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్, 16 జిబి ర్యామ్, ఇంటెల్ ఎస్ఎస్‌డి, ట్రిపుల్ హెడ్ గ్రాఫిక్స్ కార్డ్ మరియు విండోస్ 7 ఓఎస్‌తో పనిచేస్తాయి.

వైర్‌లెస్ కీబోర్డ్, మౌస్‌ను కూడా కంపెనీ ఆఫర్ చేస్తుంది. ఇందులో 23 ఇంచ్ పరిమాణం కలిగిన మూడు టిఎఫ్‌టి స్క్రీన్లు ఉంటాయి. ఈ సిమ్యులేటర్ అనుభూతిని మరింత వాస్తవికంగా మార్చేందుకు ఇందులో 5.1 సరౌండ్ సౌండ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ రియలిస్టిక్ వీడియో గేమ్ ధర 90,000 బ్రిటీష్ పౌండ్లు (మన దేశ కరెన్సీలో సుమారు రూ.75.2 లక్షలు). మరి వాస్తవిక ఫార్ములా వన్ అనుభూతి కావాలంటే ఆ మాత్రం చెల్లించక తప్పదు. మీరేమంటారు..!

కాస్ట్‌కో యూకే రియలిస్టిక్ ఎఫ్1 సిమ్యులేటర్

కాస్ట్‌కో యూకే రియలిస్టిక్ ఎఫ్1 సిమ్యులేటర్

కాస్ట్‌కో యూకే రియలిస్టిక్ ఎఫ్1 సిమ్యులేటర్

కాస్ట్‌కో యూకే రియలిస్టిక్ ఎఫ్1 సిమ్యులేటర్

కాస్ట్‌కో యూకే రియలిస్టిక్ ఎఫ్1 సిమ్యులేటర్

కాస్ట్‌కో యూకే రియలిస్టిక్ ఎఫ్1 సిమ్యులేటర్

More from DriveSpark

Article Published On: Wednesday, May 22, 2013, 10:15 [IST]
English summary
The UK division of Costco, a wholesale corporation, is offering a Formula One simulator for those who are not satisfied by the experience of playing a racing game on a regular gaming console or PC. If you are ready to shell out £90,000 (~ INR 75.2 lakhs) you get the most authentic Formula One racing experience while still being stationary.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+