కూతుర్ని కారు షోరూమ్‌కు తీసుకెళ్తే 22 లక్షలు కట్టాల్సి వచ్చింది

తల్లి దండ్రులు పిల్లలతో బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. లేకుంటే పిల్లల వల్ల జరిగే కొన్ని అనుకోను సంఘటనలకు తల్లి దండ్రులు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇలాంటి సంఘటనే ఇప్పుడు ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

కూతుర్ని కారు షోరూమ్‌కు తీసుకెళ్తే 22 లక్షలు కట్టాల్సి వచ్చింది

చైనాలోని గుయిలిన్‌ ప్రాంతంలో ఒక జంట ఇటీవల తమ 3 సంవత్సరాల కుమార్తెను ఆడి కారు షోరూమ్‌కి తీసుకెళ్లారు. వారు ప్రదర్శనలో ఉన్న కార్ల చుట్టూ చూస్తున్నారు. వారి 3 ఏళ్ల కూతురు ఆ షోరూమ్ సమీపంలో తిరుగుతూ ఉంది. అప్పటికే ఆ చిన్న పిల్ల చేతిలో రాయి ఉండటాన్ని ఆ తల్లి దండ్రులు గమనించుకోలేదు.

కూతుర్ని కారు షోరూమ్‌కు తీసుకెళ్తే 22 లక్షలు కట్టాల్సి వచ్చింది

ఆ చిన్న పిల్ల షోరూం చుట్టూ షికారు చేస్తూ తన వెంట ఉన్న రాయితో కార్లపై గీసింది. ఏకంగా ఆ పిల్ల 10 కార్లపై ఆ రాయితో గీసింది. ఇది గమనించిన తల్లిదండ్రులకు నోటమాట రాకుండా పోయింది. అప్పుడు వారికి ఏమి చేయాలో తెలియక భయానక పరిస్థితిలో ఉండిపోయారు.

MOST READ:స్క్రాప్ మెటీరియల్‌తో‌ లైట్ వెయిట్ బైక్ తయారు చేసిన 9 ఏళ్ల బాలుడు

కూతుర్ని కారు షోరూమ్‌కు తీసుకెళ్తే 22 లక్షలు కట్టాల్సి వచ్చింది

ఈ సంఘటన చూసిన డీలర్ ఆ తల్లిదండ్రలను ఆ చిన్న పిల్ల చేసిన పొరపాటుకు ఏకంగా 200,000 యువాన్ల (సుమారు $ 29,000) పరిహారం చెల్లించాలని చెప్పారు. ఇది సుమారు ఇండియన్ కరెన్సీ ప్రకారం 22 లక్షలు. ఆ తల్లిదండ్రులు అంత మొత్తాన్ని చెల్లించలేమని తిరస్కరించారు.

కూతుర్ని కారు షోరూమ్‌కు తీసుకెళ్తే 22 లక్షలు కట్టాల్సి వచ్చింది

ఈ సమస్య అక్కడ పరిస్కారం కాకపోవడంతో వారు కోర్టుని ఆశ్రయించారు. అయితే కార్ల డీలర్ మంచి కార్లు దెబ్బతిన్నాయని వాదించారు. కొత్త కార్లపై గీతలు గీయడం వల్ల గీతలు మూసివేయడానికి పెయింట్ వేసినప్పటికీ కూడా ఎప్పటిలాగా కొత్త కార్లలాగా అమ్మలేమని తెలిపారు. ఈ కారణంగా కార్లను తక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తుంది. దీని వలన అతని కంపెనీకి భారీ నష్టం జరుగుతుంది.

MOST READ:టైర్ల దిగుమతిపై ప్రభుత్వ ఆంక్షలు; స్థానిక తయారీకే మద్దతు!

కూతుర్ని కారు షోరూమ్‌కు తీసుకెళ్తే 22 లక్షలు కట్టాల్సి వచ్చింది

ఈ సమస్యను రెండు పార్టీలు పరిష్కరించాయి మరియు కారు డీలర్ నిర్ణయించిన విధంగా తల్లిదండ్రులు 70,000 యువాన్ ($ 10,000) చెల్లించడానికి అంగీకరించారు. పిల్లలను బయటికి తీసుకువెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని వారిని కోర్టు హెచ్చరించింది.

కూతుర్ని కారు షోరూమ్‌కు తీసుకెళ్తే 22 లక్షలు కట్టాల్సి వచ్చింది

ఏది ఏమైనా ఆ చిన్న పిల్ల వల్ల కంపెనీకి చాలా నష్టం కలిగింది. కారుపై గీతాలు పెట్టడం వల్ల ఆ దంపతులపై కేసుపెట్టాల్సి వచ్చిందని వారు తెలిపారు. ఎందుకంటే లగ్జరీ కారు చాలా ఎక్కువ ధరను కలిగి ఉంటాయి. వీటికి ఏ చిన్న లోపం ఏర్పడినప్పటికీ సరైన ధరకు విక్రయించలేరు. ఈ విధంగా జరిగితే కంపెనీ చాలా నేస్తాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. తల్లి దండ్రులు పిల్లలని ఎప్పుడు చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి లేకుండా ఇలాంటి సంఘటనలే జరిగే అవకాశం ఉంటుంది.

Source: Sinchew Daily

MOST READ:కరోనా నివారణలో భాగంగా మహీంద్రా అంబులెన్స్

Most Read Articles

English summary
Couple asked to pay $29,000 after 3-year-old daughter scratches 10 brand new Audi cars in showroom. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X