మెట్రోలో మరోసారి లిప్‌లాక్‌ సీన్ రిపీట్.. అందరి ముందే ముద్దులతో రెచ్చిపోయిన జంట

ఇటీవలి కాలంలో ఢిల్లీ మెట్రో రైళ్లలో జరిగిన పలు సంఘటనలు వైరల్‌గా మారుతున్నాయి. గతంలో కొందరు ఆకతాయి యువకులు ఆటోమేటెడ్‌ డోర్స్ మధ్య కాలు పెట్టి డోర్స్‌ క్లోజ్‌ అవ్వకుండా చేసిన సంఘటన వైరల్‌ అయింది. మరోచోట ఓ యువతి తన జుట్టును మెట్రోలోనే స్ట్రెయినింగ్‌ చేసుకోవడం వైరల్‌గా మారింది.

ఇంకో చోట మెట్రో రైలులో ఇద్దరు మహిళలు సీటు కోసం కొట్లాడుకోవడం చూశాం. ఇలాంటి సంఘటనలు మనకి నవ్వు తెప్పించినా మెట్రోలోని ప్రయాణికులకు ఇబ్బందిని కలిగిస్తాయి. అయితే ఇవన్నీ ఓ పరిమితి వరకే ఉంటే.. తాజాగా ఢిల్లీలో మెట్రోలో జరిగిన ఓ సంఘటన వెగటు పుట్టించడమే నెటిజన్ల ఆగ్రహానికి గురిచేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Couple-Kissing-Delhi-Metro

ఢిల్లీ మెట్రో రైలులో ఓ జంట తమ చుట్టూ ఉన్న ప్రయాణికులను పట్టించుకోకుండా ముద్దులతో రెచ్చిపోయిన వీడియో వైరల్ అవుతోంది. అయితే ఇప్పటికే చాలా సార్లు ఢిల్లీ మెట్రో రైళ్లలో ఇలాంటి సంఘటనలు జరిగాయి. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టులో వెళ్తున్న ప్రయాణికులు ఇలాంటివి చూడలేక ఇబ్బందులకు గురవుతున్నారు.

పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు అయిన మెట్రో రైలులో ప్రేమ జంట ఇలా అందరి ముందే ముద్దులు పెట్టుకోవడం ప్రయాణికులకు ఇబ్బందిని కలిగించింది. అంతేకాకుండా దీనిని వాళ్ల ఎదురుగా ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి X(ట్విట్టర్‌)లో షేర్‌ చేశారు. ఆనంద్ విహార్‌ మెట్రో స్టేషన్ వద్ద ఈ సంఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ వీడియోను ఈ నెల 21 న X లో పోస్ట్ చేశారు.

Couple-Kissing-Delhi-Metro

తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతుండటంపై ఢిల్లీ మెట్రో అధికారులు ప్రయాణికులకు ఇప్పటికే కొన్ని సూచనలు చేశారు. అంతేకాకుండా వార్నింగ్ కూడా ఇచ్చారు. మెట్రో రైలులో తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించేలా, ఇబ్బంది కలిగించేలా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇలాంటివి జరుగుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

ప్రేమ జంటలు తాము పబ్లిక్‌ ఉన్న ప్రాంతంలో ఉన్నాం అనే ఆలోచనే లేకుండా ఇలా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఢిల్లీ మెట్రో తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పబ్లిక్‌ ప్లేస్‌లో ఇలా అసభ్యకరంగా ప్రవర్తించిన ప్రేమ జంటపై వెంటనే చర్యలు తీసుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొందరు ఈ వీడియో ఎలా తీశారంటూ వీడియో తీసిన వ్యక్తిని తిడుతున్నారు. ఇలాంటి సంఘటనలు ఎలా వీడియో తీస్తారంటూ మండిపడుతున్నారు.

Couple-Kissing-Delhi-Metro

కాగా గతంలోనే ఢిల్లీ మెట్రో అధికారులు ఇలాంటి చర్యలపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. మహానగరంలోని పలు స్టేషన్‌ల వద్ద నిఘా పెడుతున్నారు. అంతేకాకుండా సెక్యూరిటీ సిబ్బంది మఫ్తీలో మెట్రో రైళ్లు ఎక్కి అభ్యంతరకరంగా ప్రవర్తించిన వాళ్లను గుర్తించి చర్యలు తీసుకునేందుకు రంగంలోకి దిగారు.

అంతేకాకుండా మెట్రో ప్రయాణికులు DMRC అధికారులు పలు విజ్ఞప్తులు చేశారు. మెట్రోలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే మెట్రో అధికారులకు లేదంటే CISF కి సమాచారం అందించాలని తెలిపారు. వీరిపై DMRC యాక్ట్‌ కింద చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయినా ఇలాంటివి జరుగుతూనే ఉండటం ఆందోళనకరం.

Couple-Kissing-Delhi-Metro

గత నెలలో ఢిల్లీ మెట్రోలోనే ఇద్దరు మహిళల మధ్య తీవ్ర వాగ్వాదం వీడియో వైరల్‌గా మారింది. ఇద్దరు మహిళలు సీటు కోసం గొడవ పడుతూ.. ఒకరినొకరు వేలు చూపించుకుంటూ గొడవకు దిగారు. తోటి మహిళా ప్రయాణికురాలు వారిని వారించడానికి యత్నించినా ఫలితం లేకుండా పోయింది. పబ్లిక్‌ ప్లేస్‌ అనే ఆలోచన కూడా లేకుండా గొడవపడ్డారు.

More from DriveSpark

Article Published On: Monday, September 25, 2023, 18:47 [IST]
English summary
Couple caught kissing in delhi metro train netizens slams video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+