గంజాయి మత్తులో వరుసగా కార్లను ఢీకొట్టిన దంపతులు.. వెంబడించిన పోలీసులు, చివరకు క్రేన్ సాయంతో.!!
గంజాయి మత్తులో(Couple Reckless Driving) కారు డ్రైవ్ చేస్తూ వరుసగా ఇతర కార్లను ఢీకొట్టింది ఓ జంట. అంతే కాకుండా వాహనాలను ఢీకొట్టి కారును ఆపకుండా వెళ్లే ప్రయత్నం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది.. పూర్తి సమాచారం ఈ కథనంలో..
దేశంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన, నిర్లక్ష్య డ్రైవింగ్‌తో వారి ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పును కలిగిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు చాలానే చోటుచేసుకుంటున్నాయి.

సీసీ కెమెరాలు, కార్లలోని డ్యాష్ కెమెరాలు, స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. వాటిని ఉదాహరణగా చూపిస్తూ ట్రాఫిక్ పోలీసులు పలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో కేరళలో జరిగిన ఓ సంఘటన.. వాహనాదారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అద్దం పడుతోంది.
కేరళకు చెందిన ఓ జంట(Couple Crash Cars) డ్రగ్స్ మత్తులో డ్రైవ్ చేసి, పలు కార్లను ఢీకొట్టుకుంటూ పోయారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. పోలీసులు తమ కారును ఆపే వరకు క్రేన్‌ను ఉపయోగించే వరకు వారు తమ స్పీడ్‌ను ఎక్కడా ఆపలేదు.

కేరళలోని కొట్టాయం జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఓ జంట డ్రగ్స్ సేవించి టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు(Tata Nexon EV)ను నడుపుతున్నారు. ఈ క్రమంలో మరియపల్లి నుంచి చింగవనం వరకు తమ ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొట్టుకుంటూ విచ్చలవిడిగా నడుపుకొంటూ పోయారు. ఈ క్రమంలో వారు ఇతర వాహనాలను ఢీకొన్నప్పటికీ ఎక్కడా కారును ఆపలేదు.
సరికదా గంజాయి(Couple Had Ganja and Driving Car) సేవించిన ఆ జంట అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ జంట ప్రమాదకరంగా టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారును నడపడం గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కారు నడుపుతున్న దంపతులను అడ్డుకునేందుకు యత్నించారు. అయితే అప్పటికే ఆ దంపతుల ర్యాష్ డ్రైవింగ్ కారణంగా రోడ్డుపై బీభత్సమే జరిగింది.

పోలీసులు తమ వాహనంలో దంపతులను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. అయితే వారు కారును ఆపకపోవడంతో.. ఓ ప్లాన్ వేశారు. క్రేన్‌ను పిలిపించి కారు వస్తున్న మార్గంలో అడ్డంగా పెట్టించారు. పోలీసుల సూచనల మేరకు క్రేన్ ఆపరేటర్.. ఆ జంట వస్తున్న రోడ్డుపై క్రేన్‌ను ఉంచి రోడ్డును దిగ్బంధించారు. ఎట్టకేలను వారిని అదుపులోకి తీసుకోవడంలో పోలీసులు విజయం సాధించారు.
కారులో ఉన్న దంపతులు గంజాయి వాడారని, వాహనంపై నియంత్రణ లేదని పోలీసులు గుర్తించారు. కారు ఆపివేయడంతో, స్థానికులు వాహనం చుట్టూ గుమిగూడటంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. డ్రైవర్ బయటకు వచ్చేందుకు నిరాకరించడమే కాకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. చివరకు పోలీసులు అతడిని వాహనం నుంచి బయటకు రప్పించారు. ఇది ఇలా ఉండగా అదే వాహనంలో ఉన్న అతని భార్య మరోసారి పోలీసులతో వాగ్వాదానికి దిగింది.
ఇక్కడ ఏం జరుగుతోందని, తన భర్తను ఎందుకు తీసుకెళ్తున్నారని వారిని ప్రశ్నించింది. దీంతో మహిళా పోలీసు అధికారి వచ్చే వరకూ వేచి ఉండి.. ఆమెను కూడా కారులో నుంచి కిందికి దింపారు. వాహనంలో 5 గ్రాముల గంజాయిని గుర్తించారు. దంపతులను చింగవనం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇలాంటి కేసులో ఈ జంట ఇంతకు ముందు కూడా అరెస్ట్ కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications








