బైక్‌పై రొమాన్స్‌తో రెచ్చిపోయిన యువ జంట.. రూ. వేలల్లో ఫైన్ వేసి ఝలక్ ఇచ్చిన పోలీసులు
పబ్లిక్ రోడ్లపై స్టంట్స్ చేయడం చట్ట విరుద్ధం. ఇది వారికే కాదు తోటి వాహనాదారులు, ప్రయాణికులకు ప్రమాదకరం. అయితే ఈ నిబంధనలన్నిటినీ తుంగలో తొక్కుతూ కొందరు బైక్, కార్లపై స్టంట్స్ చేస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఉత్తరప్రదేశ్(Romance On Moving Bike)లోని హాపూర్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
ఈ మధ్య కాలంలో హైస్పీడ్‌లో బైక్‌లను నడిపే ట్రెండ్ ఎక్కువైంది. ముఖ్యంగా బైక్‌పై రైడ్‌పై చేస్తూ యువ జంటలు రొమాన్స్ చేసుకుంటూ వెళ్లడం. ఇప్పటివరకూ ఇలాంటి చాలా సంఘటనలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అవి పోలీసుల దృష్టికి వెళ్లడంతో జరిమానా విధిస్తున్నారు. అయితే పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి.

ఇటీవల కదులుతున్న బైక్‌పై యువ జంట రొమాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు విపరీతంగా స్పందించారు. బైక్ ఫ్యూయెల్ ట్యాంకుపై కూర్చున్న యువకుడిని ఓ యువతి కౌగిలించుకోగా.. అతను బైక్ నడుపుతున్నాడు. ఇంకా వారిద్దరూ హెల్మెట్ ధరించలేదు. ట్రాఫిక్ నిబంధనలూ పాటించ లేదు.
సింబోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని 9వ నెంబరు నేషనల్ హైవేపై ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు స్పందించినా.. ఇలా పబ్లిక్ రోడ్డుపై ఇబ్బందికరంగా ప్రయాణించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ వీడియో పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారిపై చర్యలు తీసుకున్నారు. మోటారు వాహన చట్టం కింద కేసు నమోదు చేసి వారికి రూ. 8,000 జరిమానా విధించారు.

సంఘటనపై హాపూర్ పోలీసులు X (ట్విట్టర్)లో స్పందించారు. సింబోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ఈ యువ జంట బైక్‌పై అసభ్యకరంగా ప్రయాణిస్తున్న ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన తమ దృష్టికి రావడంతో జరిమానా విధించినట్లు తెలిపారు. మోటార్ వెహికల్ (ఎంవీ) చట్టం కింద కేసు నమోదు చేసి బైక్ యజమానికి రూ.8000 జరిమానా చెల్లించినట్లు పేర్కొన్నారు.
కాగా కొన్ని నెలల క్రితం కూడా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఢిల్లీలో బైక్‌పై యువజంట రోడ్డు మీద వెళ్తూ రొమాన్స్ చేస్తున్నారు. ఇంకా అతని వద్ద లైసెన్స్, హెల్మెట్ లేకుండా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనం నడిపారు. ఈ సంఘటన ఢిల్లీ పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారిపై కేసు నమోదు చేసి రూ.11 వేలు జరిమానా విధించారు.

దేశంలో పబ్లిక్ రోడ్లపై విన్యాసాలు చేయడం చట్టరీత్యా నేరంతో పాటు ప్రమాదకరం. ఇది వాహన డ్రైవర్ లేదా ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే అవకాశం ఉంది. అయితే స్టంట్లు లేదా సాహసోపేతమైన రైడ్‌లు చేయాలనుకునేవారు.. అవసరమైన భద్రతా పరికరాలను ఉపయోగించి నైపుణ్యం కలిగిన వ్యక్తుల మార్గదర్శకత్వంలో మీ ప్రైవేట్ స్థలంలో లేదా రేస్ ట్రాక్‌లో చేయడం ఉత్తమమని గుర్తుంచుకోవాలి.
రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించడం చాలా అవసరం. దీని ద్వారానే చాలా వరకు రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు. దీంతో పాటు హైవేపై నిర్దేశించిన లిమిటెడ్ స్పీడ్‌లోనే వాహనాలను నడపాలి. ఇంకా బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని గుర్తుంచుకోవాలి. కారు డ్రైవింగ్ చేసేటప్పుడు సీటు బెల్ట్ ధరించడం తప్పనిసరి. ఇంకా ఫోన్‌లో మాట్లాడుతూ మద్యం సేవించి వాహనం నడపడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడపకూడదని తెలుసుకోవాలి.


Click it and Unblock the Notifications








