Live Video రోడ్డుపై ప్రేమ జంట డేంజరస్ రొమాన్స్.. వీడియో రికార్డు చేస్తున్నట్లు గుర్తించినా..!!
ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారత్ కూడా ఉంది. భారత్‌లో రోడ్డు ప్రమాదాలకు అనేక కారణాలు ఉంటున్నాయి. అందులో ప్రధానమైనవి అతి వేగం మరియు నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్. ఈ రెండు కారణాలతో ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
యువకుడిని హగ్ చేసుకొని.. : సుజుకి స్కూటర్‌పైన వెళ్తున్న ఓ జంట అత్యంత ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తున్నారు. డ్రైవింగ్ చేస్తున్న యువకుడి ఒడిలో యువతి కూర్చోవడం (couple romance on moving scooter) వీడియోలో గమనించవచ్చు. యువకుడిని హగ్ చేసుకోవడాన్ని కూడా గుర్తించవచ్చు. ఈ ఘటన ముంబైలోని బాంద్రాలోని అత్యంత రద్దీగా ఉన్న రోడ్లపై జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో వైరల్ అవుతోంది.

వీడియో రికార్డు చేస్తున్నట్లు గుర్తించినా... : అయితే సుజుకి స్కూటర్‌పైన కూర్చొన్న యువతి యువకులు... వారి సమీపంలో ఉన్న మరో వాహనదారుడు వీరిద్దరి వీడియోను రికార్డు చేస్తున్నట్లు గుర్తించినా, మరింత అభ్యంతకరంగా ప్రవర్తించడం వీడియోలో గుర్తించవచ్చు. స్కూటర్‌ను నడుపుతున్న వ్యక్తి రోడ్డుపై కనీసం దృష్టిపెట్టకపోవడాన్ని కూడా వీడియోలో గమనించవచ్చు.
హెల్మెట్ కూడా ధరించకుండా : ముంబైలోని బాంద్రా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో యువతీయువకులు ఇద్దరు కూడా హెల్మెట్ ధరించలేదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తీవ్రంగా గాయపడే అవకాశం ఉంది. మరియు అత్యంత నిర్లక్ష్యంగా, అభ్యంతరకరంగా ఉండడాన్ని వీడియోలో గమనించవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

సీసీ కెమెరాలు, సోషల్ మీడియా వీడియోల ఆధారంగా : ఇలాంటి ఘటనలు ఇదివరకే అనేకం వైరల్ అయ్యాయి. అయితే పోలీసులు ఎప్పటికప్పుడు ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకున్నా.. ఫలితాలు ఆశాజనకంగా రావడం లేదు. రోడ్లపై ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ఆధారంగా ఇప్పటి వరకు చాలా మందిపై భారీగా జరిమానాలు విధించిన ఘటనలు అనేకం ఉన్నాయి.
అయితే పబ్లిక్ రోడ్లపై ఇటువంటి విన్యాసాలు చేయడం అప్పటికి కాస్త సంతోషంగా అనిపించినా.. ఏదైనా ప్రమాదం జరిగితే మీకు అత్యంత దగ్గరివారు దూరమయ్యే ప్రమాదం ఉంది. మరియు రోడ్లపై ప్రయాణం చేసే సమయంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి మరియు రోడ్డ భద్రతా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

ఇప్పటికే పోలీసులు ఇటువంటి ఘటనలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. భారీగా జరిమానా విధించడం, కౌన్సెలింగ్ ఇస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు. అయితే ముంబైలోని బాంద్రా తాజా ఘటన పోలీసుల దృష్టికి వెళ్లిందా, పోలీసులు ఈ ఘటనపై ఎటువంటి చర్యలు తీసుకున్నారా తెలియలేదు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








