మెట్రోలో ముద్దులాట.. మైమరచిపోయిన యువజంట.. వీడియో వైరల్‌

ఢిల్లీ మెట్రో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. మెట్రో సౌకర్యాలు పెంచడం వల్లనో లేదా ఇతర వసతులు కల్పించడం వల్లనో ట్రెండింగ్‌లోకి వచ్చిందనుకుంటే పొరపాటే.. గతంలో మాదిరిగా ఈసారి కూడా ఓ జంట చేసిన రొమాన్స్‌ కారణంగా ఢిల్లీ మెట్రో హెడ్‌లైన్స్‌లోకి వచ్చింది.

గతంలో ఢిల్లీ మెట్రో కోచ్‌లో ఓ జంట కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, చేతులు పట్టుకోవడం వంటి వీడియోలు ఇటీవల వైరల్‌ అయ్యాయి. మరో యువతి అసభ్యకరంగా బట్టలు ధరించిన వీడియో సైతం నెట్టింట హల్‌చల్‌ చేసింది. ప్రస్తుతం ఓ యువజంట రొమాంటిక్‌ కిస్సింగ్‌ సీన్‌ వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

Couple kissing in Delhi metro

ఈ వీడియోలో మెట్రో కోచ్‌ ప్లోర్‌పై యువకుడు కూర్చోగా.. యువతి అతని కాలుపై తలపెట్టి కూర్చొంది. మెట్రోలోని తోటి ప్రయాణికులే ఈ వీడియో తీసినట్లు తెలుస్తోంది. ఈ ముద్దు సీన్‌పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అందులో కొన్ని సరదా వ్యాఖ్యలు, మరికొందరు సీరియస్‌గా కామెంట్లు చేశారు. ఈ వీడియోలో యువకుడు.. యువతికి సీపీఆర్‌ చేస్తున్నాడంటూ సరదాగా ఓ యూజర్‌ కామెంట్‌ చేశాడు.

ఈ వీడియోపై కొంతమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా సిగ్గులేని వ్యవహారమంటూ ఘాటు వ్యా్ఖ్యలు చేశారు. ఈ ఘటనపై ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ చర్యలు తీసుకోవాలని కొంతమంది కోరారు. యువతి, యువకులు అసభ్యంగా ప్రవర్తిస్తుంటే తోటి ప్రయాణికులు ఎందుకు ఏం మాట్లాడడం లేదంటూ ఓ నెటిజన్‌ ప్రశ్నించారు. ఇది నిజమైన ప్రేమేనా లేదా సోషల్‌ మీడియా కోసమే ఇలా ముద్దుపెట్టుకున్నారా అంటూ మరో యూజర్‌ కామెంట్‌ చేశారు.

రెండు రోజుల క్రితం ఓ రైళ్లో ప్రయాణిస్తున్న యువతుల బృందం డ్యాన్స్‌ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌ అయింది. వేలాది మంది నెటిజన్లు యువతుల గ్రూప్‌ డ్యాన్స్‌పై కామెంట్స్‌ చేశారు. రైళ్లో వెళ్తున్న కొంత మంది యువతుల్లో పైన సీట్లో ఉన్న యువతి తొలుత డ్యాన్స్‌ ప్రారంభించగా.. దాన్ని అనుసరిస్తూ మరో యువతి కిల్లింగ్‌ ఎక్స్‌ప్రెషన్‌తో డ్యాన్స్‌ చేసింది. అనంతరం అక్కడే ఉన్న మిగిలిన యువతులు ఆ పాటకు అనుగుణంగా డ్యాన్స్‌ చేశారు. యువతుల బృందం మాత్రం క్రేజీ మూమెంట్స్‌తో ఎంతో రిథమిక్‌గా డ్యాన్స్ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

ఈ వీడియోను whydahi(Himesh's version) అనే ట్విట్టర్‌ యూజర్‌ పోస్ట్‌ చేశారు. దాంతోపాటు.. నేను, నా సోదరుడు ప్రయాణికుల ముందు ఆహారం కూడా తీసుకోలేమని రాసుకొచ్చింది. దయచేసి నాకు అటువంటి ధైర్యం ఇవ్వు దేవుడా అని కామెంట్‌ చేసింది. అటువంటి ధైర్యం ఎక్కడ దొరుకుతుందని యూజర్లను ప్రశ్నిస్తూ అంటూ మరో కామెంట్‌ చేసింది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, May 10, 2023, 19:12 [IST]
English summary
Couple kissing scene in delhi metro video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+