లాక్‌డౌన్ లో జరిగిన పెళ్లి : రాయల్ ఎన్ఫీల్డ్ పై రైడింగ్

కరోనా వైరస్ అధికంగా విస్తరిస్తున్న కారణంగా భారతదేశంలో ప్రస్తుతం రెండవదశ లాక్ డౌన్ కొనసాగుతోంది. దాదాపు భారతదేశంలో లాక్ డౌన్ నెలరోజులు దాటింది. ఈ లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ చాల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తోంది. ఈ కరోనా మహమ్మారి మానవ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది. ఈ సమయంలో వేడుకలు, పండుగలు ఇతర కార్యక్రమాలు అన్నీ రద్దు చేయబడ్డాయి. అంతే కాకుండా వివాహాది శుభకార్యాలు కూడా వాయిదా పడుతున్నాయి.

లాక్‌డౌన్ లో జరిగిన పెళ్లి : రాయల్ ఎన్ఫీల్డ్ పై రైడింగ్

కరోనా మహమ్మారి వల్ల అక్కడక్కడా ఎలాంటి ఆడంబరాలు లేకుండా కొన్ని వివాహాలు జరుగుతున్నాయి. ఇందులో కూడా ఎక్కువమంది బంధువులు కూడా హాజరుకాకుండా శ్రద్ధ తీసుకుంటున్నారు. స్నేహితులు మరియు బంధువులు లేకుండానే ప్రజలు చాలా సింపుల్ పద్ధతిలో వివాహం చేసుకుంటున్నారు. పంజాబ్‌లో ఇలాంటి వివాహమే ఒకటి జరిగింది. దీని గురించి ఇక్కడ తెలుసుకుందాం.

లాక్‌డౌన్ లో జరిగిన పెళ్లి : రాయల్ ఎన్ఫీల్డ్ పై రైడింగ్

వివాహితులు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద ఆలయం నుండి ఇంటికి వెళతారు. పంజాబ్ పోలీసులు బైక్‌ను ఆపి కొత్త జంటను పరిశీలించారు. దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

MOST READ:లాక్‌డౌన్ లో తల్లిని చూడటానికి 480 కి.మీ సైకిల్ పై వచ్చిన కొడుకు, చివరికి ఏమైందంటే

లాక్‌డౌన్ లో జరిగిన పెళ్లి : రాయల్ ఎన్ఫీల్డ్ పై రైడింగ్

ఆ వధూవరులు ఆలయంలో వివాహం చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్నట్లు పోలీసులకు తెలిపారు. ఇది తెలుసుకున్న పోలీసులు వారికి పువ్వులు, స్వీట్లు ఇవ్వడం మనం ఈ వీడియోలో చూడవచ్చు.

లాక్‌డౌన్ లో జరిగిన పెళ్లి : రాయల్ ఎన్ఫీల్డ్ పై రైడింగ్

సాధారణ వివాహం చేసుకోవడానికి నగర పోలీసుల నుండి అవసరమైన అనుమతి లభించిందని ఈ జంట చెప్పారు. అతని వివాహానికి కేవలం ఐదుగురు మాత్రమే హాజరయ్యారు.

MOST READ:రిషి కపూర్ మరణం : లాక్‌డౌన్ లో కూడా ఇల్లుచేరిన రిధిమా కపూర్

ఉత్తర భారతదేశంలో వివాహాలు ముఖ్యంగా చాలా వరకు పంజాబీ తరహా వివాహాలు జరుగుతున్నాయి. ఇటువంటి వివాహాలు చాలా కోలాహలంగా ఉంటాయి. స్నేహితులు మరియు బంధువులు దూరం నుండి వివాహాలకు వస్తారు. ఈ నేపథ్యంలో వివాహం చాలా రోజులు పెద్ద పండగలాగా జరుగుతుంది.

లాక్‌డౌన్ లో జరిగిన పెళ్లి : రాయల్ ఎన్ఫీల్డ్ పై రైడింగ్

ఈ వీడియోలో మనం గమనించినట్లయితే నూతన వధూవరులు వారి వివాహ వస్త్రధారణలో ఉన్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై ఇంటికి తిరిగి వస్తున్నారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చిన తరువాత వారు వెళ్ళడానికి అనుమతించారు.

Image Courtesy: India Exclusive/YouTube

MOST READ:కరోనా ఎఫెక్ట్ : విమానాశ్రయాల్లో ఆంటిసెప్టిక్ రోబోట్స్

Most Read Articles

English summary
Couple ride Royal Enfield after wedding amid lockdown. Read in Telugu.
Story first published: Saturday, May 2, 2020, 10:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X