పబ్లిక్ రోడ్డుపై రెచ్చిపోయిన జంట.. కదిలే స్కూటర్‌పై రొమాన్స్, వైరల్ అవుతున్న వీడియో
ప్రస్తుతం రోడ్లపై యువత బైకులు, కార్లపై రొమాన్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇలాంటి వీడియోలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హద్దులు మీరుతున్నారు. ప్రతీరోజు ఇలాంటి వీడియోలు వందల సంఖ్యలో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ ఇతర సామాజిక మాధ్యమాలల్లో దర్శనమిస్తున్నాయి. రోడ్లపై ఈ స్టంట్స్ కొన్నిసార్లు విషాదాలకు కూడా దారి తీస్తున్నాయి. ప్రస్తుతం ఓ జంట రోడ్లపై చేసిన రొమాన్స్ వీడియో ఇంటర్‌నెట్‌ని షేక్ చేస్తోంది. ఆ జంట రెచ్చిపోయి రోడ్డుపై రొమాన్స్ చేసుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. గుజరాత్‌లో ఈ సంఘటన జరిగింది. వీరి వెనక ఫాలో అవుతున్న ప్రయాణికులు ఆ దృశ్యాలను కెమెరాలో బంధించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..
గుజరాత్‌లో ముగ్గురు (ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి) సుజుకి బర్గ్‌మన్ స్కూటీపై వెళ్తూ ఉండగా రొమాన్స్ చేసుకుంటున్న వీడియో వైరల్ అయ్యింది. వీడియో ప్రకారం ముగ్గురు స్కూటీపై వెళ్తున్నారు. అయితే మధ్యలో కూర్చున్న వ్యక్తి వెనక్కి తిరిగి అమ్మాయి వైపు కూర్చున్నాడు. దీంతో వారు కదిలే స్కూటర్‌పైనే ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. పబ్లిక్‌లో ఉన్నామనే విషయాన్ని వారు మరచి రోడ్డుపై రొమాన్స్ చేస్తూ హల్‌చల్ చేశారు.

వీడియోలో కనిపిస్తున్న సుజుకి బర్గ్‌మన్ స్కూటర్ యజమానిని పోలీసు అధికారులు పట్టుకున్నారు. ఆ స్కూటర్ అహ్మదాబాద్‌లోని వత్వాకు చెందిన వ్యక్తికి చెందినదిగా గుర్తించారు. రోడ్డు భద్రతా ఉల్లంఘన చర్యల కింద స్కూటర్ యజమానిని అరెస్టు చేసి పబ్లిక్‌లో రొమాన్స్ చేసిన జంట వివరాలను రాబట్టారు.

ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం ప్రకారం సదరు జంటను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటను పాల్పడిన వారిని మీడియా ముందు పోలీసులు ప్రవేశ పెట్టారు. ఇలాంటి సంఘటనలు దేశవ్యాప్తంగా ఎక్కువ అవుతున్నాయి. ఈ సంవత్సరం మార్చిలో రోడ్డుపై ఓ జంట ఇలాగే కౌగిలించుకుంటూ రొమాన్స్ చేసుకున్నారు. అప్పట్లో ఈ వీడియో కూడా తెగ వైరల్ అయ్యింది. ఇలాంటి వీడియోలు ప్రతీరోజు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
ఈ ఘటనకు ముందు గత ఏడాది సెప్టెంబర్‌లో మరో జంట బైక్‌పై వెళ్తూ బహిరంగంగా ముద్దులు పెట్టుకుంది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేయగా అది రాజస్థాన్‌లోని జైపూరుకి చెందినదిగా వార్తలు వచ్చాయి. ఈ వీడియోలో మోటార్ సైకిల్ నడుపుతున్న వ్యక్తి అతని ముఖాన్ని వెనుకకు తిప్పి తన ప్రియురాలిని ముద్దు పెట్టుకోవడం కనిపించింది.
ఇలా రోడ్లపై రొమాన్స్ చేస్తూ ఇతరులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఈ వీడియోలు ఇంటర్‌నెట్‌లో వైరల్ అవుతున్నాయి. కొంతమంది కావాలనే వీడియోలను చిత్రీకరించి ఫేమస్ అయ్యేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మరి కొందరు మద్యం మత్తులో చెలరేగి పోతున్నారు. ఇలాంటి వారిపై చర్యలకు దేశ వ్యాప్తంగా కఠిన చర్యలు ఉన్నాయి. అయితే వాటిని యువత పట్టించుకోవడం లేదు. ఇలాంటి పనులు చేస్తే చట్ట పరంగా చర్యలు ఉంటాయనే విషయాన్ని యువత గుర్తుంచుకోవాలి.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








