బైక్‌పై రెచ్చిపోయిన ప్రేమ జంట.. వైరల్ అవుతున్న రొమాన్స్ వీడియో
సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు ఇటీవల పలువురు ముఖ్యంగా యువత చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పబ్లిక్ రోడ్లపై అతి వేగంగా ప్రయాణిస్తూ విన్యాసాలు చేస్తున్నారు. ఆ తరహా సంఘటనలు కొన్ని ఇటీవల దేశంలో అనేక చోట్ల చోటుచేసుకున్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా ఇలాంటివి పునరావృతమవుతూనే ఉన్నాయి.
పబ్లిక్ రోడ్లపై విన్యాసాలు చేయడం వల్ల ప్రయాణికులకు మాత్రమే కాదు వాహనం నడిపేవారికి, ఇతర వాహనదారులకు ప్రమాదం. అది మరిచి కొందరు పబ్లిక్ రహదారులపై ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఇటీవల కొందరు యువ జంటలు బైక్‌లపై అతివేగంగా వెళ్తూ అసభ్యకర చేష్టలకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. తాజాగా దేశ రాజధాని న్యూ ఢిల్లీలో ఓ జంట బైక్‌పై రొమాన్స్ చేస్తూ కనిపించింది.

జూలై 16న ఢిల్లీలోని మంగోల్‌పురిలోని ఔటర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్‌పై ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ యువ జంట బైక్‌పై వెళ్తున్నారు. యువకుడు బైక్ నడుపుతుండగా ట్యాంక్‌పై కూర్చున్న యువతి, యువకుడిని హగ్ చేసుకుంది. ఒకరినొకరు గాఢంగా హత్తుకుంటూ రొమాన్స్‌లో ఉన్నట్లుగా వీడియోలో గమనించవచ్చు.
అటుగా వెళ్తున్న వాహనదారులు దీనిని వీడియో తీసి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల, చాలా మంది ఇలా బాధ్యతారాహిత్యమైన మరియు అశ్లీల ప్రవర్తనకు పాల్పడ్డారు. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఘటన జరిగిన సమయం, తేదీ, స్థలాన్ని వివరిస్తూ ట్వీట్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసుల దృష్టికి వెళ్లింది.

ఈ వీడియోపై స్పందించిన ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు వీడియోను పోస్ట్ చేసిన సదరు వ్యక్తికి ధన్యవాదాలు తెలిపారు. ఇలా ఎవరైనా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే.. వారి వివరాలను ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ సెంటినల్ యాప్‌లో తెలియజేయాలని పేర్కొంటూ ట్వీట్ చేశారు.
ఈ వీడియోపై నెటిజన్ల నుంచి కామెంట్లు వెల్లువెత్తాయి. ఇలా పబ్లిక్ రోడ్డుపై అసభ్యకరంగా ప్రవర్తించడం తగదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరికొందరు వారిని అరెస్ట్ చేయాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. బైక్‌పై యువతి హెల్మెట్ ధరించలేదని కొందరు పేర్కొన్నారు.
మరికొందరు ఇలా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధించాలని కోరారు. ఇలాంటి చర్యలకు పాల్పడకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పబ్లిక్ రోడ్డుపై ఇలా అసభ్యకరంగా ప్రవర్తించడం అక్కడ ఇతర వాహనదారులకు, ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తుందని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు.
గత నెలలో ఇదే తరహాలో ఘజియాబాద్‌లోని ఇందిరాపురం ప్రాంతానికి సమీపంలో ఎన్‌హెచ్9పై చోటచేసుకుంది. బైక్ కదులుతుండగా బైక్‌పై ఒక జంట ఒకరినొకరు కౌగిలించుకున్నారు. పైగా వారిద్దరూ హెల్మెట్ ధరించలేదు. ఈ తరహా ఘటనలు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. వీటిని నివారించేందుకు పోలీసులు కేవలం జరిమానాలతో కాకుండా మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
పబ్లిక్ రహదారులపై ఇలా ప్రవర్తించడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వారితో పాటు ఇతర వాహనదారులు కూడా తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇలా చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడటం ద్వారా యువత తమ బంగారు భవిష్యత్తును కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి రోడ్లపై ప్రయాణించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి.


Click it and Unblock the Notifications








