గర్ల్‌ఫ్రెండ్‌ను ఒడిలో కూర్చొబెట్టుకొని.. రోడ్డుపై రొమాంటిక్‌ డ్రైవ్‌.. వైరల్‌ అవుతున్న వీడియో!

పబ్లిక్‌ రోడ్లపై మోటార్‌సైకిళ్లు, కార్లతో ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఇటువంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. లవర్స్‌, యువతీయువకులు పబ్లిక్‌ రోడ్లపై అభ్యంతరకరంగా ప్రయాణించిన వీడియోలు కూడా వైరల్‌ అవుతున్నాయి. సోషల్‌ మీడియా సహా రోడ్లపైన అమర్చిన సీసీ కెమెరాల ద్వారా ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారికి పోలీసులు జరిమానా విధిస్తున్నారు.

అయితే తాజాగా గర్ల్‌ ఫ్రెండ్‌తో రొమాంటిక్‌ రైడ్‌ వీడియో మరొకటి వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాయ్‌పూర్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. ఈ వీడియో ఆధారంగా ఓ జంట మోటార్‌ సైకిల్‌పై అభ్యంతరకరంగా, ప్రమాదకరంగా ప్రయాణం చేస్తోంది. గర్ల్‌ఫ్రెండ్‌ను రైడర్‌ తన ఒడిలో కూర్చోపెట్టుకొని (girl sit on the bike rider lap) ప్రయాణం చేస్తున్నారు.

Couple romantic ride in bike in raipur

దాంతోపాటు రోడ్డుపై అభ్యంతరకరంగా ప్రవర్తించడం వీడియో గమనించవచ్చు. అయితే వీడియో ఆధారంగా వారు ప్రయాణం చేస్తున్న రోడ్లు రద్దీ తక్కువగా కనిపిస్తున్నా.. ఏదైనా అకస్మాత్తుగా ప్రమాదం జరిగితే ఇద్దరు కూడా తీ‌వ్రగాయపడే అవకాశం ఉంది. దాంతోపాటు ఇద్దరు కూడా హెల్మెట్‌ ధరించకుండా డ్రైవింగ్‌ చేయడాన్ని గమనించవచ్చు.

షాక్‌ ఇచ్చిన పోలీసులు : ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. వీడియో ఆధారంగా ఆ జంటను ట్రాక్‌ చేసిన పోలీసులు వారికి షాక్ ఇచ్చారు. హెల్మెట్‌ లేని ప్రయాణం సహా ప్రమాదకరంగా ప్రయాణం చేసినందుకు రూ.4000 జరిమానా విధించారు.

girl sit on the bike rider lap in raipur

సోషల్‌ మీడియా క్రేజీ కారణంగా చాలా మంది యువతీయువకులు ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేస్తు్‌న్నారు. అయితే ఈ విన్యాసాలు పబ్లిక్‌ రోడ్లపై చేయడం మరింత ప్రమాదం. ఏదైనా ప్రమాదం జరిగితే ఇతరులు కూడా తీవ్రంగా గాయపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి వీడియోలు, ఘటనలపై పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మరియు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

జరిమానాలు విధిస్తున్నా.. : సోషల్‌ మీడియా, రోడ్లమీద అమర్చిన సీసీ టీవీ సహా ఇతర మార్గాల ద్వారా ఇలాంటి ఘటనలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. భారీగా జరిమానాలు విధిస్తున్నారు. అయినా కొంతమందిలో ఎటువంటి మార్పు రావడం లేదు. పబ్లిక్‌ రోడ్లపై ప్రమాదకర విన్యాసాలు సహా రొమాంటిక్‌ డ్రైవ్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ క్షణం సంతోషం అనిపించినా.. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది.

Couple romantic ride on bike

ఫేమస్‌ అయ్యేందుకే ఇలా చేస్తున్నారా? : యువత సోషల్‌ మీడియా క్రేజ్‌ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఫేమస్‌ అయ్యేందుకు అభ్యంతరకర ప్రయాణం సహా ప్రమాదకర విన్యాసాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలకు చెక్‌పెట్టేందుకు జరిమానాలు వేయడమే కాకుండా పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Friday, November 10, 2023, 15:13 [IST]
English summary
Couple romantic ride in bike in raipur video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+