వీళ్ల టాలెంట్‌కు సలాం.. మారుతి సుజుకి జిమ్నీ కారులో ఫుల్ బెడ్ సెటప్ చేసిన జంట
భారతీయ ఆటో మొబైల్ రంగంలో ఎప్పటికప్పుడు అధునాతన డిజైన్లు, ఫీచర్లు, ఆకర్షణీయమైన లుక్‌తో వాహనాలు విడుదల అవుతూనే ఉన్నాయి. మార్కెట్‌లో వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా విభిన్న రకాల్లో టూవీలర్లు, ఫోర్ వీలర్లు తయారుచేస్తున్నారు. తాజాగా మారుతి నుంచి విడుదలైన జిమ్నీ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ను ఏర్పరుచుకుంది.
అయితే ఇక్కడ మనం మారుతి జిమ్నీ కారు గురించి మాట్లాడుకోవడానికి ఓ కారణం ఉంది. సాధారణంగా మనం కార్లలో ప్రయాణించేటప్పుడు కునుకు వేయాలనిపిస్తే సీట్లోనే తలవాల్చి నిద్రపోతాం. కానీ ఇక్కడ ఓ జంట తమ మారుతి జిమ్నీ కారును ఓ చిన్నపాటి పడక గదిగా మార్చేశారు. పూర్తి సమాచారం ఈ కథనంలో చదవండి.

దేశంలో తమ క్రియేటివిటీతో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు కొందరు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి లక్షల్లో లైక్‌లు సంపాదిస్తున్నారు. అంతే కాకుండా ఆ వీడియోలు ఆసక్తికరంగా, ఫన్నీగానూ ఉంటున్నాయి. Xtreme Moto Adventure అనే యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేయబడిన ఈ వీడియో వైరల్‌గా మారింది.
ఇక్కడ భార్యాభర్తలు తమ మారుతి జిమ్నీ కారులో క్రియేటివిటీని ప్రదర్శించి ఔరా అనిపించారు. మారుతి సుజుకి జిమ్నీ యజమాని, తన భార్యతో కలిసి, కారు లోపలి భాగంలో పూర్తిగా పరుపు వేసి చిన్న పాటి బెడ్‌రూమ్‌గా మార్చారు. అందుకు సంబంధించి దశలవారీ ప్రక్రియను వీడియోలో వివరించారు.

ముందుగా కారు వెనుక డోర్ తెరిచి వీల్‌నట్ల సాయంతో కవర్‌ను తీసివేశారు. ఆ తరువాత పరుపు (Mattress) ను అమర్చడానికి మిడిల్ సీటును తొలగించారు. అయితే మొదటిరోజు బోల్టులను తీసివేయడం కొంచెం కష్టంగా ఉండటంతో ఆ పనిని మరుసటి రోజుకు వాయిదా వేశారు.
మరుసటి రోజు వారు సులభమైన పద్ధతిలో మిడిల్ లైన్ సీట్లలోని పైభాగాన్ని తొలగించారు. సీట్ బెల్ట్ హోల్టర్లను సైతం తీసివేశారు. ఇవి సెన్సార్‌ల కోసం విద్యుత్ కనెక్షన్లను కలిగి ఉన్నాయి. ఈ క్రమంలో అతి జాగ్రత్తగా సీట్లను తొలగించారు. సౌకర్యవంతమైన క్యాంపింగ్ సెటప్ కోసం ఫ్రంట్ సీట్లను వెనక్కి వాల్చారు.

అనంతరం తమ ఇంట్లో ఉన్న 6-అంగుళాల సింగిల్ బెడ్‌ను తీసుకువచ్చారు. మారుతి జిమ్నీ లోపల ఎక్కడైతే సీట్లు తొలగించారో అక్కడ సెట్ చేశారు. ఖాళీలు ఏర్పడిన చోట దిండ్ల(Pillow)తో సరిచేశారు. అనంతరం పైన బెడ్‌షీట్‌తో బెడ్‌ను కప్పి ఆకర్షణీయంగా మార్చారు. ఈ మొత్తం ప్రక్రియ ఉత్సాహంగా కొనసాగుతుంది.
అయితే చాలా మంది ప్రొఫెషనల్ క్యాంపర్స్.. తమ కార్ల కోసం కస్టమ్ ప్లైవుడ్ ఫ్రేమ్‌లను ఆశ్రయించగా, అలాంటి బెడ్ సెటప్‌లకు అనుగుణంగా, ఈ దంపతులు ఆచరణాత్మక విధానాన్ని ఎంచుకున్నారు. మరీ విస్తృతమైన మార్పులు చేయకుండా చాలా సింపుల్ సెటప్‌తో జిమ్నీ కారులో బెడ్‌ను ఏర్పాటు చేశారు.
క్రియేటివిటీ ఉంటే మారుతి సుజుకి జిమ్నీ వంటి కాంపాక్ట్ వాహనంలో ఇలా సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేసుకోవచ్చని రుజువు చేశారు ఈ జంట. కారులో బెడ్ సెటప్‌ని పూర్తి చేసిన తర్వాత, ఆ దంపతులు త్త క్యాంపింగ్ ఏర్పాటును ఉత్సాహంగా ప్రదర్శించారు. చిన్న పిల్లలు, పెద్దవాళ్లతో లాంగ్ టూర్ వెళ్లే వారికి ఈ తరహా సెటప్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








