కార్ రిపేర్ ఫీజు రూ. 9,900, పార్కింగ్ ఫీజు రూ. 91,000.. ఇది కోర్టు తీర్పు.. ఎందుకో మీరే చూడండి

రిపేర్ చేసుకోవడానికి ఇచ్చిన కారును సకాలంలో డెలివరీ చేసుకోకపోవడంతో అక్షరాలా రూ. 91,000 పార్కింగ్ ఫీజు చెల్లించాలని గాంధీనగర్ కన్స్యూమర్ కోర్టు ఒక లాయర్ ని ఆదేశించింది. రిపేర్ చేయించుకోవడానికి ఇచ్చిన తర్వాత దాదాపు 910 రోజులు వర్క్ షాప్ లోనే ఉంచడం వల్ల పార్కింగ్ ఫీజు చెల్లించాలని వర్క్‌షాప్ ఓనర్ డిమాండ్ చేశారు.

కార్ రిపేర్ ఫీజు రూ. 9,900, పార్కింగ్ ఫీజు రూ. 91,000

నివేదికల ప్రకారం ఒక లాయర్ తన టాటా నానో కారును 2018 జూన్‌లో గాంధీనగర్‌లోని కారు రిపేర్ సెంటర్ లో రిపేర్ కోసం ఇచ్చారు. అయితే, రిపేర్ అయిపోయిన తర్వాత, రిపేర్ షాప్ ఓనర్ కారు తీసుకెళ్లమని కోరినప్పుడు, కారు సరిగా రిపేర్ చేయలేదని అంతే కాకుండా కారులోని చాల భాగాలూ లేవని ఆ న్యాయవాది ఆరోపించాడు.

కార్ రిపేర్ ఫీజు రూ. 9,900, పార్కింగ్ ఫీజు రూ. 91,000

దీనిని ఆరోపిస్తూ, న్యాయవాది కారును అక్కడే వదిలేశాడు, అప్పటి నుండి కారు గ్యారేజీలో ఉండిపోయింది.మోసం చేసారని మరియు నిర్లక్ష్యం చేసినందుకు గాంధీనగర్ కన్స్యూమర్ ఫోరమ్‌లోని రిపేర్ సెంటర్ యజమానిపై 2019 లో న్యాయవాది ఫిర్యాదు చేశారు.

MOST READ:వామ్మో.. పెట్రోల్ బంకులో ఇంత మోసమా.. మీరే చూడండి

కార్ రిపేర్ ఫీజు రూ. 9,900, పార్కింగ్ ఫీజు రూ. 91,000

అయితే, ఈ కేసు యొక్క పూర్వాపరాలను తేల్చిన తర్వాత రిపేర్ షాప్ తరపున ఎటువంటి మోసం జరగలేదని రిపేర్ సెంటర్ తెలిపింది. అంతే కాకుండా రిపేర్ అయిపోయినప్పటినుంచి న్యాయవాదిని కారును తీసుకెళ్లమని రిపేర్ షాప్ ఓనర్ 58 సార్లు మెయిల్ చేసినట్లు కూడా తెలిపాడు.

కార్ రిపేర్ ఫీజు రూ. 9,900, పార్కింగ్ ఫీజు రూ. 91,000

రిపేర్ సెంటర్ ఓనర్ లాయర్ కి అనేకసార్లు నోటీసులు పంపినప్పటికీ అతని వైపు నుండి ఎటువంటి స్పందన లేదని చెప్పారు. ఈ కారణంగా, అతని టాటా నానో రెండేళ్లుగా సర్వీస్ సెంటర్ గ్యారేజీలోనే పడి ఉంది. ఈ కారణంగా రిపేర్ షాప్ ఓనర్ రోజుకు 100 రూపాయల చొప్పున 910 రోజులు పార్కింగ్ ఛార్జీని చెల్లించాలని కోరాడు.

MOST READ:వావ్.. ల్యాండ్‌రోవర్ డిఫెండర్ క్యాపబిలిటీ అద్భుతః ; ఎందుకో మీరే చూడండి

కార్ రిపేర్ ఫీజు రూ. 9,900, పార్కింగ్ ఫీజు రూ. 91,000

ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపిన తర్వాత, లాయర్ ఆరోపణలు అవాస్తవమని తేలింది. అంతే కాకుండా 910 రోజులకు గాను రూ. 91,000 పార్కింగ్ ఛార్జీని చెల్లించాలని తీర్పు ఇచ్చింది. న్యాయస్థానం, తీర్పు ఇస్తూ, చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందని వ్యాఖ్యానించింది.

కార్ రిపేర్ ఫీజు రూ. 9,900, పార్కింగ్ ఫీజు రూ. 91,000

లాయర్ రిపేర్ కోసం ఇచ్చిన కారును తిరిగి తీసుకోకుండా సర్వీస్ సెంటర్ లో వదిలిపెట్టడం వల్ల అతనికి పార్కింగ్ ఛార్జీ విధించబడింది. అంతే కాకుండా కార్ రిపేర్ కి గాను 9,900 రూపాయల కూడా చెల్లిచాలని కోర్టు తీర్మానించింది.

MOST READ:రైల్వే ట్రాక్ వద్ద సహనం లేకుంటే ఏమవుతుందో తెలుసా.. అయితే వీడియో చూడండి

Note: Images are representative purpose only

Most Read Articles

English summary
Court Orders Lawyer To Pay Rs 91,000 As Parking Charge. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X