ఆటో, టాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన ప్రభుత్వం, ఎక్కడో తెలుసా..?

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ప్రపంచంలోని వివిధ దేశాలలో ఇప్పుడు లాక్ డౌన్ అమలు చేయబడింది. దీనివల్ల ప్రజలు తమ ఇళ్లను విడిచి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. చాలా మందికి ఆదాయం లేకుండా కష్టాల్లో ఉన్నారు.

ఆటో, టాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన ప్రభుత్వం, ఎక్కడో తెలుసా..?

భారతదేశంలో కూడా ఆర్ధిక పరిస్థితి దెబ్బతినింది. భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించారు. దీనివల్ల అన్ని ప్రజా రవాణా సేవలు రద్దు చేయబడ్డాయి. అదనంగా ఆటో, టాక్సీ మరియు ఎలక్ట్రిక్ రిక్షాలు బయటికి రాలేని పరిస్థితి ఏర్పాడి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

ఆటో, టాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన ప్రభుత్వం, ఎక్కడో తెలుసా..?

కరోనా వైరస్ కారణంగా ప్రజలు తమ ఇళ్లను విడిచి బయటికి రాకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ కారణంగా ప్రజలు తమ ఇళ్లనుండి బయటికి వెళ్లడం లేదు. ఆటో, టాక్సీ, ఎలక్ట్రిక్ రిక్షాలను నమ్ముకుని జీవిస్తున్న వారి చాల ఇబ్బదుల్లో పడ్డారు.

ఆటో, టాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన ప్రభుత్వం, ఎక్కడో తెలుసా..?

ఈ వాహనాల నుండి రోజువారీ ఆదాయాన్ని సంపాదించే వారి పరిస్థితి చాలా వరకు క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో వారికి సహాయం చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. లాక్ డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వం మరియు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు సహాయం చేయడానికి వచ్చాయి.

ఆటో, టాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన ప్రభుత్వం, ఎక్కడో తెలుసా..?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ బాటలో ప్రజలకు సహాయం చేస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే 35,000 మందికి పైగా భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక సహాయం ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ. 5,000 చొప్పున ఆర్ధిక సహాయాన్ని ప్రకటించింది.

ఆటో, టాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన ప్రభుత్వం, ఎక్కడో తెలుసా..?

పేద ప్రజలకు మాత్రమే కాకుండా ఆటో, టాక్సీ, ఎలక్ట్రిక్ రిక్షా డ్రైవర్లకు కూడా 5 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి తమ వంతు సాయంగా ఢిల్లీ ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయాన్ని తీసుకుంది.

ఆటో, టాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన ప్రభుత్వం, ఎక్కడో తెలుసా..?

దీని గురించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ ఎవరూ ఆకలితో ఉండకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఆటో, టాక్సీ, ఎలక్ట్రిక్ రిక్షా డ్రైవర్లకు వచ్చే 7 నుంచి 10 రోజుల్లో రాయితీలు చెల్లించబడతాయి అని కూడా ప్రస్తావించారు.

ఆటో, టాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన ప్రభుత్వం, ఎక్కడో తెలుసా..?

ప్రజా రవాణా వాహనాలు పూర్తిగా నిలిపివేయడం వల్ల భారతదేశంలో దాదాపు అన్ని రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఈ సందర్భంలో కూడా కొంత మంది ఈ లాక్ డౌన్ కి వ్యతిరేకంగా రోడ్లపై తిరుగుతున్నారు. ఇది చట్ట విరుద్ధమైన చర్య. ఇప్పటి పరిస్థితుల్లో ఈ విధంగా చేయడం ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ విధంగా చేయడం వల్ల కరోనా వైరస్ భారిన పడే అవకాశం ఉంది. కేవలం ఆ వ్యక్తి మాత్రమే కాకుండా అతని కుటుంబం కూడా ఈ వైరస్ ప్రభావానికి లోను కావాల్సిందే.

ఆటో, టాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన ప్రభుత్వం, ఎక్కడో తెలుసా..?

లాక్ డౌన్ సమయంలో అనవసరంగా బయటకు వచ్చే వారిని పోలీసులు కఠినంగా శిక్షిస్తున్నారు. ఇప్పటికే చాల వాహనాలను సీజ్ చేయడం జరిగింది, అంతే కాకుండా చాల మందిపై కేసులు కూడా నమోదు చేయడం జరిగింది.

ఏది ఏమైనా ప్రజలు ఈ లాక్ డౌన్ కి తమ వంతు మద్దతు తెలిపాలి. ఇంక ఈ లాక్ డౌన్ పరిమితి కేవలం 10 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికైనా మనకోసం ఇంతగా కష్టపడుతున్న ప్రభుత్వానికి మనవంతు మద్దతుగా ఇంట్లోనే ఉండాలి.

Most Read Articles

English summary
Delhi government to give Rs.5000 to auto taxi drivers. Read in Telugu.
Story first published: Saturday, April 4, 2020, 13:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X