అత్యవసర సమయంలో ఫ్రీ క్యాబ్ సర్వీస్, ఎక్కడో తెలుసా ?

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువవుతున్న కారణంగా కరోనా వైరస్ వ్యాప్తిని ఆపడానికి అన్ని దేశాలు అహర్నిశలు కష్టపడుతున్నాయి. ఈ భయంకరమైన వైరస్ నుండి ప్రాణనష్టం రోజురోజుకు భారీగా పెరుగుతోంది. భారతదేశంలో వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా 2020 మే 3 వరకు లాక్ డౌన్ అమలు చేయబడింది.

అత్యవసర సమయంలో ఫ్రీ క్యాబ్ సర్వీస్, ఎక్కడో తెలుసా ?

లాక్ డౌన్ కారణంగా బస్సులు మరియు ట్రైన్ సర్వీసులు అన్నీ రద్దు చేయబడ్డాయి. ప్రస్తుతం లాక్ డౌన్ లో టాక్సీలు మరియు ఆటోలు కదలడం లేదు. ప్రజలు అవసరంగా బయటికి రాకూడదని ప్రభిఉత్వాలు ఆదేశించాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రాకూడదని నిబంధనలు ప్రస్తుతం అమలులో ఉన్నాయి. అనుమతి పొందిన వారికి మాత్రమే బయటకు వచ్చే అవకాశం ఉంది.

అత్యవసర సమయంలో ఫ్రీ క్యాబ్ సర్వీస్, ఎక్కడో తెలుసా ?

ఈ కరోనా వైరస్ క్లిష్ట పరిస్థితుల్లో హాస్పిటల్ కి వెళ్లే వారికి పాస్‌లు కావాలి. కానీ ఈ పాస్‌లు పొందడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. ముఖ్యంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడింది. దీనికోసం ప్రత్యేక పాస్ లు పొందటం కూడా చాలా కష్టమవుతోంది.

MOST READ:గుడ్ న్యూస్ చెప్పిన కర్ణాటక గవర్నమెంట్, ఏంటో తెలుసా..?

అత్యవసర సమయంలో ఫ్రీ క్యాబ్ సర్వీస్, ఎక్కడో తెలుసా ?

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి నోయిడా- ఢిల్లీ సరిహద్దులను కట్టుదిట్టం చేశారు. రోగుల నుండి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లోని గౌతమ బుద్ధ నగర్ జిల్లా ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయి.

అత్యవసర సమయంలో ఫ్రీ క్యాబ్ సర్వీస్, ఎక్కడో తెలుసా ?

నోయిడా నుండి ఢిల్లీకి ప్రయాణించే అత్యవసర రోగులకు ఉచిత క్యాబ్ సేవలను అందించనున్నారు. డయాలసిస్ మరియు క్యాన్సర్ వంటి రోగుల చికిత్స కోసం ఢిల్లీ చేరుకోవాల్సిన వారికి ఉచిత క్యాబ్ సేవలు అందించబడుతుంది.

MOST READ:మెర్సిడెస్ బెంజ్ విడుదలచేయనున్న ఎలక్ట్రిక్ కార్ : ఇక్యూసి

అత్యవసర సమయంలో ఫ్రీ క్యాబ్ సర్వీస్, ఎక్కడో తెలుసా ?

గౌతమ బుద్ధ పట్టణ జిల్లాకు ఉబర్‌ తన సేవలను అందిస్తోంది. ఈ సేవను అందించడానికి హెల్ప్‌లైన్ నంబర్ కూడా అందించబడింది. రోగులు 18004192211 నంబర్‌కు కాల్ చేసి ఈ ప్రత్యేక సేవను పొందవచ్చు. ఈ సేవను పొందాలనుకునే వారికి ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి.

అత్యవసర సమయంలో ఫ్రీ క్యాబ్ సర్వీస్, ఎక్కడో తెలుసా ?

గౌతమ బుద్ధ పట్టణ జిల్లా అధికారులు ప్రకారం, ఈ సేవ పొందాలనుకునే వారు తప్పనిసరిగా ప్రిస్క్రిప్షన్ మరియు చికిత్స పత్రాన్ని సమర్పించాలి. సేవను స్వీకరించడానికి ఒక రోజు ముందు దరఖాస్తు చేసుకోవాలి.

MOST READ:లాక్‌డౌన్ లో ఇల్లుచేరుకోవడానికి 3 లక్షలు పైగా ఖర్చుపెట్టిన వ్యక్తి, ఎలా వెళ్ళాడో తెలుసా ?

అత్యవసర సమయంలో ఫ్రీ క్యాబ్ సర్వీస్, ఎక్కడో తెలుసా ?

ఇది అత్యవసర సమయంలో రోగులకు సేవ చేస్తూ వారి సమస్యను నివారిస్తుంది. ఈ సేవ అత్యవసర రోగులకు మాత్రమే అందించబడుతుంది. అత్యవసర రోగులు అంబులెన్స్‌లను ఉపయోగించవచ్చు. గౌతమ బుద్ధ పట్టణ జిల్లా ఈ చర్య వల్ల చాలా మంది రోగులు ప్రయోజనం పొందుతారని భావిస్తున్నారు.

Most Read Articles

English summary
Free taxi service from Noida to Delhi for non emergency patients. Read in Telugu.
Story first published: Wednesday, April 29, 2020, 13:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X