కరోనా ఎఫెక్ట్ : 1500 కిలోమీటర్లు సైకిల్ ప్రయాణానికి సిద్దమైన కార్మికులు
చైనా నుంచి వ్యాపించిన కరోనా వైరస్ దాదాపు అన్ని దేశాలలో విస్తరించింది. ఈ భయంకరమైన మహమ్మారి వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అంతే కాకుండా చాలామంది ప్రజలు ఈ వైరస్ భారిన పడ్డారు. ఈ కరోనా వైరస్ భారతదేశంలో కూడా వ్యాపించింది. మనదేశంలో ఇప్పటికే కరోనా భాదితుల సంఖ్య దాదాపు 85,000 దాటింది.

భారతదేశంలో వ్యాపించిన ఈ కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి భారతప్రభుత్వం చాలా కఠినమైన చర్యలను తీసుకుంటోంది. ఇందులో భాగంగానే లాక్ డౌన్ విధించబడింది.
మనదేశంలో లాక్ డౌన్ 2020 మార్చి 24 నాలుగు నుంచి ఇప్పటిదాకా మొదటి, రెండవ మరియు మూడవదశ లాక్ డౌన్ లు పూర్తయ్యాయి. మూడవ దశ లాక్ డౌన్ లో గ్రీన్, ఆరంజ్ మరియు రెడ్ జోన్లుగా విభజించి, కోన్ని సడలింపులు కల్పించింది. ఇప్పుడు తాజాగా నాలుగవ దశ లాక్ డౌన్ మొదలయింది. ఇది ఈనెల 31 వరకు ఉంటుంది.

భారతదేశంలో లాక్ డౌన్ ప్రకటించడం వల్ల పేద ప్రజలు వలస కూలీలు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. లాక్ డౌన్ కారణంగా వలస కూలీలు సుదూర ప్రాంతాల నుంచి వారి స్వస్థలాలకు రావడానికి కూడా వీలులేకుండా పోయింది. లాక్ డౌన్ రోజు రోజుకి పొడిగిస్తున్న కారణంగా చాలామంది వలస కూలీలు సుదూర ప్రాంతాల నుంచి కాలి నడకన మరియు సైకిల్స్ లో వారి ప్రాంతాలకు ప్రయాణాలు సాగించారు. ఇలాంటి సంఘటనే ఇప్పుడు మరొకటి వెలుగులోకి వచ్చింది.

పుదుచ్చేరిలో ఒడిస్సాకి చెందిన నలుగురు వలస కూలీలు లాక్ డౌన్ కారణంగా వారి స్వగ్రామాలకు రాకుండా అక్కడే చిక్కుకుపోయారు. దాదాపు వీరు రెండు నెలలుగా బస్సులు, ట్రైన్లు లాంటివి లేకపోవడం వల్ల వారు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పుదుచ్చేరిలోని ఒక రవాణా సంస్థలో నరోట్టం బారిక్, జితేంద్ర బారిక్ మరియు బాలాసోర్ జిల్లాకు చెందిన సురేంద్ర బారిక్ మరియు కటక్ జిల్లాకు చెందిన బులు సరుకులను ఎక్కించి, దించే పని చేసుకుంటూ ఉన్నారు.

లాక్ డౌన్ రెండు నెలల ముందు సంస్థ యజమాని వారి డబ్బు క్లియర్ చేయలేదు. లాక్ డౌన్ సమయంలో సంస్థ మూసివేశారు. కానీ త్వరలో పని ప్రారంభమవుతుందనే ఆశతో అక్కడే ఉండిపోయారు. భారతదేశంలో లాక్ డౌన్ మళ్ళీ మళ్ళీ పొడిగించడంతో వారు అక్కడ నుంచి ఇంటికి రావాలను నిర్చయించుకున్నారు.

వారిదగ్గర ఉన్న కొంత డబ్బుతోనే నాలుగు సైకిళ్లను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు.వారు సైకిల్స్ కొనుక్కుని బుధవారం రాత్రి తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. భయంకరమైన వేడి ఉన్నప్పటికీ వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.

తమిళనాడులోని తాంబరం వద్ద గురువారం రాత్రి ఆగిన తరువాత ఈ నలుగురు శుక్రవారం చెన్నై చేరుకున్నారు. అక్కడ ఒక వ్యక్తి వారికి బిస్కెట్లు వంటివి తినడానికి ఇచ్చారు. వారు అవి తిన్న తరువాత మధ్యాహ్నం మళ్ళీ ప్రయాణాన్ని ప్రారంభించారు. దాదాపు 1500 కిలోమీటర్లు ప్రయాణించాలంటే దాదాపు 12 రోజులు పట్టే అవకాశం ఉంటుందని వారు తెలిపారు. కరోనా లాక్ డౌన్ కారణంగా చాలామంది ఈ విధంగా వారి స్వస్థలాలకు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications








