Just In
Don't Miss
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Movies
ఝాన్సీ, శ్రీముఖి ఖతం.. ఇప్పుడు సుమ వంతు.. ఇప్పటికైనా ఆ షో గట్టెక్కేనా?
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
24 గంటల్లో 7,413 వాహనాలు సీజ్ చేసిన చెన్నై పోలీసులు, ఎందుకంటే ?
భారతదేశంలో కరోనా వైరస్ రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతోంది. భారతదేశంలో కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపిస్తున్న రాష్ట్రాలలో ఒకటి తమిళనాడు. తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతున్న ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విధించాలని ఆదేశించింది. వాహనదారులు తమ వాహనాలను రోడ్లపైకి తీసుకురావడానికి ఇ-పాస్ పొందాలని కూడా సంబంధిత అధికారులు ఆదేశించారు.

లాక్ డౌన్ సమయంలో చాలామంది వాహనదారులు ఈ నిబంధనను ఉల్లంఘించి ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. లాక్ డౌన్ ప్రకటించిన 24 గంటల్లో చెన్నై పోలీసులు వేలాది వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తమిళనాడు ప్రభుత్వ అధికారిక పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై పోలీసులు 8,105 కేసులు బుక్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న మొత్తం వాహనాల సంఖ్య దాదాపు 7,413. లాక్ డౌన్ ప్రకటించిన కేవలం 24 గంటల్లో మొత్తం 6,926 ద్విచక్ర వాహనాలు, 215 ఆటోరిక్షాలు, 272 తేలికపాటి మోటారు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జూన్ 22 ఉదయం 6 గంటల నుండి జూన్ 23 ఉదయం 6 గంటల మధ్య ఈ కేసులు నమోదయ్యాయి.
MOST READ:ముంబైలో కనుమరుగు కానున్న ప్రీమియర్ పద్మిని టాక్సీలు, ఎందుకో తెలుసా ?

లాక్ డౌన్ కారణంగా చెన్నై నగర పోలీసులు నగరమంతా మల్టిపుల్ చెక్‌పోస్టులను సృష్టించారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రించడానికి ఈ పాయింట్లు సృష్టించబడ్డాయి. ఎలాంటి కదలికలను నిరోధించడానికి నగర పోలీసులు ద్విచక్ర వాహనాలు మరియు కార్లపై నగరంలో పెట్రోలింగ్ ప్రారంభించారు. కరోనా మహమ్మారిని నివారించడానికి ఈ పద్ధతులు అనుసరిస్తున్నారు.

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం జూన్ 15 న చెన్నై మరియు సరిహద్దు ప్రాంతాలలో పూర్తి లాక్ డౌన్ ప్రకటించింది. ఒకే స్థలంలో ప్రజలు గుమిగూడకుండా చూసేందుకు ప్రభుత్వం సెక్షన్ 144 మరియు కర్ఫ్యూను విధించారు.
MOST READ:జెమోపాయ్ మిసో మినీ ఎలక్ట్రిక్ స్కూటర్ : ధర & ఇతర వివరాలు

కరోనా కారణంగా ప్రస్తుతం ఎమర్జెన్సీ వాహనాలు మరియు నిత్యావసరాలు కొనడానికి ప్రైవేట్ వాహనాలు మాత్రమే రోడ్లపై ఉండటానికి అనుమతి ఉంది. ప్రభుత్వం 12 రోజుల కఠిన లాక్ డౌన్ విధించింది.
అంతే కాకుండా ఈ ప్రాంతాలలో నివసించే వారికి కూడా అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి వాహనాలను ఉపయోగించవద్దని తెలియజేసింది. ఒకవేళ ప్రజలు అవసరమైన వస్తువులను కొనడానికి 2 కిలోమీటర్ల లోపు మాత్రమే ప్రయాణించడానికి అనుమతి ఉంది.

దేశ వ్యాప్తంగా ఎక్కువ కరోనా కేసులు ఉన్న రాష్ట్రాలలో ప్రస్తుతం తమిళనాడు మూడవ స్థానంలో ఉంది. ఇక్కడ దాదాపు 64,000 కంటే ఎక్కువ కేసులు ఉన్నాయి. జూన్ 23 న, మొత్తం 28,428 మంది రోగులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని, 35,339 మంది రోగులు వైరస్ నుండి కోలుకున్నారని ప్రభుత్వ డేటా చూపిస్తుంది. చెన్నైలో మాత్రమే 18,889 కేసులు ఉన్నాయి. అంతే కాకుండా రోజుకు 1,000 కి పైగా కేసులు నమోదవుతున్నాయి.
MOST READ:న్యూస్ పేపర్ తో రైల్ నమూనా నిర్మించిన స్కూల్ స్టూడెంట్

దేశవ్యాప్తంగా విధించిన కరోనా లాక్ డౌన్ సమయంలో నిబంధనలను ఉల్లంఘించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఉల్లంఘించినవారికి విధించిన జరిమానా గురించి కచ్చితమైన సమాచారం ఇవ్వలేదు. లాక్ డౌన్ ముగిసిన తర్వాతే వాహనాలు విడుదల చేయబడతాయి. ఇటీవల లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు మాజీ భారత క్రికెటర్ రాబిన్ సింగ్ కారును కూడా స్వాధీనం చేసుకున్న విషయం అందరికి తెలిసిన విషయమే. కాబట్టి కరోనా మహమ్మారి నుంచి బయట పాడటానికి ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి.
Note : Images are for representative purpose only