Just In
- 5 hrs ago
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- 6 hrs ago
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- 6 hrs ago
మారుతి సుజుకి కంపెనీ తలమానికం 'మారుతి స్విఫ్ట్' ; ఎందుకో తెలుసా?
- 8 hrs ago
భారత్‌లో స్ట్రీట్ 750, స్ట్రీట్ రాడ్ డిస్కంటిన్యూ; హ్యార్లీ కథ ముగిసినట్లేనా?
Don't Miss
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Movies
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
లాక్డౌన్ ఎఫెక్ట్ : లక్షకుపైగా వాహనాలు సీజ్, ఎక్కడో తెలుసా..?
భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. ఈ లాక్ డౌన్ మర్చి 24 నుంచి దాదాపు 23 రోజులపాటు ఏప్రిల్ 14 వరకు అమలు చేశారు. కానీ కరోనా వ్యాప్తి అనుకున్న విధంగా నివారించడానికి వీలులేని కారణంగా రెండవ దశ లాక్ డౌన్ 2020 మే 03 వరకు ప్రకటించారు. రెండవ దశ లాక్ డౌన్ కూడా పొడిగిస్తూ మే 17 వరకు ప్రకటించారు.

భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో కొరోనా వైరస్ సంక్రమణల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రజలు ఇంటి వద్దే ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.

అత్యవసర సమయాల్లో తప్ప ప్రజలు బయటకి రాకూడదని అధికారులు ఆదేశించారు. కానీ ఈ సూచనలను కూడా ఉల్లంఘిస్తూ చాలామంది వ్యక్తులు ఇప్పటికీ రోడ్డు మీదికి వస్తున్నారు. ఈ విధంగా లాక్ డౌన్ ని ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు.
MOST READ:ఆకాశంలోకి ఎగరటానికి ట్రై చేసిన హీరో అక్షయ్ కుమార్ [వీడియో]

లాక్డౌన్ నిబంధనను ఉల్లంఘించిన వాహనదారులపై దేశవ్యాప్తంగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఇప్పటివరకు 1.2 లక్షలకు పైగా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

మార్చి 22 నుంచి ఇప్పటి వరకు 1.2 లక్షల వాహనాలను తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 1.1 లక్షల ద్విచక్ర వాహనాలు, 4,881 త్రీ వీలర్లు, 3,390 కార్లు మరియు 539 ఇతర వాహనాలు ఉన్నాయి.
MOST READ:నిస్సాన్ కి కష్ట కాలం : నిలిపివేయబడిన టెర్రానో ఎస్‌యువి

తెలంగాణ పోలీసులు కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు మరియు సరైన కారణం లేకుండా బయటకు వచ్చే వాహనదారులపై చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ పోలీసులు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు మరియు వాలంటీర్ల గుర్తింపు కార్డులను కూడా తనిఖీ చేస్తున్నారు.

అత్యవసర సమయాల్లో బయటకి వచ్చే వాహనాలను కూడా పరీక్షిస్తున్నారు. తెలంగాణ పోలీసులు అదనపు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
MOST READ:నిజంగా ఈ పెళ్లి కొడుకు అదృష్టవంతుడే, ఎందుకో మీరే చూడండి

ఈ సంఘటన గురించి సీనియర్ పోలీసు అధికారులు మాట్లాడుతూ, సరైన కారణం లేకుండా బయటకు వస్తున్న వాహనాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నామని, అంతే కాకుండా వాహన యజమానులపై కేసు కూడా నమోదు చేసినట్లు చెప్పారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను కోర్టుకు అప్పగించనున్నారు.
లాక్‌డౌన్ సడలించిన తర్వాత వాహనాలను తిరిగి ఇస్తామని చెప్పారు. ఏప్రిల్ 21 న మాత్రం దాదాపు 7,000 ద్విచక్ర వాహనాలు, 181 త్రీ వీలర్లు, 290 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

దీనిపై తెలంగాణ టుడే నివేదిస్తూ భారతదేశంలో నిబంధనలను ఉల్లంఘించడం మరియు ఆ వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం సర్వసాధారణం. నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
MOST READ:లాక్‌డౌన్‌లో ఎమ్మెల్యే స్టిక్కర్ తో పట్టుబడ్డ యువకుడు, చివరికి ఏమైందంటే ?

దేశవ్యాప్తంగా ఇప్పుడు లాక్ డౌన్ మూడవ దశ అమలులో ఉంది. దీని ప్రకారం అన్ని రాష్ట్రాలను గ్రీన్ ఆరంజ్ మరియు రెడ్ జోన్లుగా విభజించారు. ఆ జోన్లలో కొంత వరకు లాక్ డౌన్ సడలింపులు కూడా ప్రకటించారు. కానీ ఇటువంటి సమయంలో కూడా సామజిక దూరం పాటించి కరోనా నుంచి విముక్తి పొందాలి. కాబట్టి వీలైనంత వరకు బయటకు వెళ్లడం మానుకోవాలి. ఇప్పుడు కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ సమయంలో ప్రభుత్వాలకు మద్దతుగా ప్రజలు ఇంట్లోనే ఉండాలి.