కరోనా ఎఫెక్ట్ : సామజిక దూరంతో పాలు పోస్తున్న పాల వ్యాపారి

కరోనా వైరస్ రోజు రోజుకి ఎక్కువగా సంక్రమిస్తున్న కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించబడింది. ఈ లాక్ డౌన్ కారణంగా దేశం మొత్తం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతోంది. ప్రస్తుతం లాక్ డౌన్ మూడవ దశలో ఉంది. ఈ లాక్ డౌన్ 2020 మే 17 వరకు ఉంటుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ మూడవ దశలో లాక్ డౌన్ నుంచి కొన్ని విరమణలు కూడా కల్పించారు.

కరోనా ఎఫెక్ట్ : సామజిక దూరంతో పాలు పోస్తున్న పాల వ్యాపారి

లాక్ డౌన్ లో కలిగించిన కొన్ని మినహాయింపుల ప్రకారం గ్రీన్ మరియు ఆరంజ్ జోన్లలో కొన్ని వాహన సేవలు నిర్వహించే అవకాశం కూడా ఉంది. రెడ్ జోన్లో ఇప్పటికి కఠినమైన నిబంధనలను పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ ఖచ్చితంగా సామాజిక దూరాన్ని పాటించాలి.

కరోనా ఎఫెక్ట్ : సామజిక దూరంతో పాలు పోస్తున్న పాల వ్యాపారి

కరోనా వైరస్ సంక్రమణము నివారించాలంటే సామాజిక దూరం చాలా అవసరం కాబట్టి ఈ క్రమంలో ఒక పాల వ్యాపారి ఒక కొత్త పద్దతిని ప్రవేశపెట్టాడు. ఇది అందరిని ఆశ్చర్య పరుస్తోంది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కరోనా ఎఫెక్ట్ : సామజిక దూరంతో పాలు పోస్తున్న పాల వ్యాపారి

కోవిడ్ -19 వ్యాప్తి మధ్య సామాజిక దూరాన్ని కొనసాగిస్తూ వినియోగదారులకు పాలు సరఫరా చేయడానికి తన బైక్‌కి కట్టిన గరాటు మరియు పైపును ఉపయోగించి ఒక మిల్క్‌మ్యాన్ ఫోటో మనం ఇక్కడ చూడవచ్చు.

కరోనా ఎఫెక్ట్ : సామజిక దూరంతో పాలు పోస్తున్న పాల వ్యాపారి

ఈ చిత్రాన్ని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్) అధికారి నితిన్ సంగ్వాన్ ట్విట్టర్‌లో షేర్ చేసాడు. ఇటీవల కాలంలో చాలామంది తమను మరియు తమ నుండి ఇతరులను కరోనా వైరస్ నుంచి రక్షించడానికి కొత్త ఉపాయాలను ఆలోచిస్తున్నారు.

కరోనా ఎఫెక్ట్ : సామజిక దూరంతో పాలు పోస్తున్న పాల వ్యాపారి

ఇప్పుడు ప్రజలందరూ ఇళ్లకే పరిమితమై అత్యవసర సమయాల్లో బయటకు వచ్చినప్పుడు కూడా మాస్కులు మరియు గ్లౌజులు వంటి వాటిని ఉపయోగిస్తున్నారు. కానీ ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో పాల వ్యాపారి ఈ విధంగా అలోచించి సామజిక దూరాన్ని అమలుచేస్తున్నాడు.

కరోనా ఎఫెక్ట్ : సామజిక దూరంతో పాలు పోస్తున్న పాల వ్యాపారి

సంగ్వాన్ షేర్ చేసిన ఈ చిత్రంలో ఒక పాలవ్యాపారి సామాజిక దూరాన్ని కొనసాగిస్తూ తన వినియోగదారునికి పాలు సరఫరా చేయడాన్ని చూడవచ్చు. అతను తన బైక్‌కు ఒక గరాటు మరియు పైపును అటాచ్ చేసి అలా చేశాడు. పాలు కావాలనుకున్న కస్టమర్ పైపు చివర నిలబడతాడు. అప్పుడు పాల వ్యక్తి పాలు గరాటు ద్వారా సరఫరా చేస్తాడు.

కరోనా ఎఫెక్ట్ : సామజిక దూరంతో పాలు పోస్తున్న పాల వ్యాపారి

ఈ కరోనా నేపథ్యంలో చాలామంది ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారట. ఇటీవల కాలంలో ఒకవ్యక్తి తన కుమార్తె కోసం సామాజిక దూరాన్ని పాటించే ఒక బైక్ కూడా తయారు చేసాడు. ఇది కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

More from DriveSpark

Article Published On: Friday, May 8, 2020, 16:04 [IST]
English summary
Milkman uses funnel and pipe jugaad to supply milk while maintaining social distance. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+