కరోనా ఎఫెక్ట్ : ఇకపై ఇలా చేస్తేనే మీకు పెట్రోల్

నేడు ప్రపంచం మొత్తం కరోనా వైరస్ బారిన పడింది. చైనా నుండి సంక్రమించిన ఈ కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచదేశాలన్నినింటి వ్యాపించింది. ఈ కోవిడ్ -19 వైరస్ కారణంగా అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ మరియు ఇంగ్లాండ్‌ వంటి దేశాలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి.

కరోనా ఎఫెక్ట్ : ఇకపై ఇలా చేస్తేనే మీకు పెట్రోల్

కోవిడ్ -19 వైరస్ భారతదేశాన్ని కూడా వదలటం లేదు. ఈ భయానకమైన మహమ్మారి కోవిడ్ -19 వైరస్ భారతదేశంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీనిని నివారించడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నాయి. ఈ కారణంగానే భారత దేశంలో లాక్ డౌన్ అమలు చేయబడింది. అంతే కాకుండా ఇప్పుడు డాక్ డౌన్ 2 వ దశ కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ లాక్ డౌన్ రెండవ దశ 2020 మే 03 వరకు ఉంటుంది.

కరోనా ఎఫెక్ట్ : ఇకపై ఇలా చేస్తేనే మీకు పెట్రోల్

కరోనా లాక్ డౌన్ కారణంగా వాహనసేవలన్నీ నిలిపివేయబడ్డయి. ప్రజలు అత్యవసర సమయాల్లో మాత్రమే భారత ప్రభుత్వం అనుమతించింది. ఒక వేళా అనవసరంగా బయటకు వచ్చే వాహనదారులను కఠినంగా శిక్షించడమే కాకుండా, వాహనాలను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు.

MOST READ: త్వరలో లాంచ్ కానున్న కొత్త కవాసకి నింజా ZX-25R బైక్ [వీడియో]

కరోనా ఎఫెక్ట్ : ఇకపై ఇలా చేస్తేనే మీకు పెట్రోల్

ఈ కారణంగా ప్రజలు తమ ఇళ్లను వదిలి బయటకు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. వాహనాలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడం వల్ల రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఏర్పడ్డాయి. ప్రస్తుతం ప్రస్తుతం ట్రక్కుల వంటి వాహనాలు ప్రయాణించడానికి మాత్రమే అనుమతించడం జరిగింది.

కరోనా ఎఫెక్ట్ : ఇకపై ఇలా చేస్తేనే మీకు పెట్రోల్

ద్విచక్ర వాహనాలు, కార్లు మరియు బస్సులు నిలిచిపోవడం వల్ల, పెట్రోల్, డీజిల్ అమ్మకాలు భారీగా తగ్గుతున్నాయి. ఇంతలో అఖిల భారత పెట్రోలియం డీలర్ల సంఘం చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. కరోనా దేశం మొత్తం విలయతాండవం చేస్తున్న వేళ మాస్కులు ధరించని వాహనదారులకు పెట్రోల్ మరియు డీజిల్ అమ్మరు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇది జరిగింది. పెట్రోల్ బంక్ సిబ్బంది భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.

MOST READ:అప్‌డేట్ ఫీచర్స్ తో లాంచ్ కానున్న 2020 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్

కరోనా ఎఫెక్ట్ : ఇకపై ఇలా చేస్తేనే మీకు పెట్రోల్

ఈ సందర్భంగా అఖిల భారత పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ బన్సాల్ మాట్లాడుతూ, మా సిబ్బంది భద్రత కోసం మాస్కు ధరించని ప్రజలకు ఇంధనాన్ని విక్రయించకూడదని నిర్ణయించామన్నారు.

కరోనా ఎఫెక్ట్ : ఇకపై ఇలా చేస్తేనే మీకు పెట్రోల్

అవసరమైన వస్తువుల జాబితాలో పెట్రోల్ మరియు డీజిల్ వంటివి ఉండటం వల్ల లాక్ డౌన్ సమయంలో కూడా ఇంధనం అమ్ముడవుతోంది. అంతే కాకుండా లాక్ డౌన్ సమయంలో పెట్రోల్ బంక్ సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. పెట్రోల్ బంక్ సిబ్బంది కస్టమర్లతో వ్యవహరించాల్సిన అవసరం ఉన్నందున, వారు కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉంది. ఈ కారణంగా మాస్కు ధరించేవారికి మాత్రమే ఇంధనాన్ని విక్రయించాలని నిర్ణయించారు.

MOST READ: విమానాల బుకింగ్స్ ఆపివేయాలని ఆదేశించిన డిజిసిఎ, ఎందుకో తెలుసా..?

కరోనా ఎఫెక్ట్ : ఇకపై ఇలా చేస్తేనే మీకు పెట్రోల్

ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు కూడా ప్రయోజనం ఉంటుంది. పెట్రోల్ బంక్ సిబ్బందికి సోకితే, అవి వినియోగదారులకు వ్యాపించకుండా ఉంటాయి. ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. ఈ నిర్ణయం తీసుకున్న తరువాత ఢిల్లీలోని బంకర్‌లో మాస్కు ధరించని వాహనదారులకు ఇంధనం ఇవ్వకుండా వెనక్కి పంపించడం కూడా జరిగింది.

Most Read Articles

English summary
Covid 19 No face mask no fuel at Petrol pumps across India. Read in Telugu.
Story first published: Tuesday, April 21, 2020, 15:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X