మరో Rolls Royce కొనుగోలు చేసిన 'సీరమ్ ఇన్‌స్టిట్యూట్' CEO: పూర్తి వివరాలు

భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ఒకరు 'అదార్ పూనావల్లా'. సాధారణంగా పారిశ్రామికఎత్తలకు, సినీ ప్రముఖులు మొదలైనవారికి లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. అయితే అదార్ పూనావల్లాకు కూడా ఖరీదైన లగ్జరీ కార్లంటే ఎక్కువ మక్కువ. కేవలం అతడు మాత్రమే కాదు అతని కుటుంబంలోని వారందరూ కూడా ఖరీదైన కార్లను వినియోగిస్తున్నారు.

మరో Rolls Royce కొనుగోలు చేసిన 'సీరమ్ ఇన్‌స్టిట్యూట్' CEO: పూర్తి వివరాలు

అదార్ పూనావల్లా ఎప్పటికప్పుడు తన గ్యారేజిలో కొత్త కొత్త విలాసవంతమైన లగ్జరీ కార్లను చేరుస్తూనే ఉంటాడు. ఇందులో భాగంగానే అదార్ పూనావల్లా ఇటీవల ఖరీదైన Rolls Royce Phantom VIII (రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII) కొనుగోలు చేసాడు. ఈ కొత్త Rolls Royce Phantom VIII స్టాండర్డ్ మరియు ఎక్స్‌టెండెడ్ వీల్‌బేస్ వెర్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. అయితే పూనావల్లా ఏ మోడల్‌లో ఈ కారుని కొనుగోలు చేశారనే దానిపై ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.

మరో Rolls Royce కొనుగోలు చేసిన 'సీరమ్ ఇన్‌స్టిట్యూట్' CEO: పూర్తి వివరాలు

అదార్ పూనావల్లా సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) సీఈఓ. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో కోవ్‌షీల్డ్ అనే కోవిడ్ 19 వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. పూణేలో ఉన్న ఒక పెద్ద వ్యాక్సిన్ తయారీదారు అయిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, దాని తయారీ ప్లాంట్‌లో ఇతర వ్యాక్సిన్‌లను కూడా తయారు చేస్తుంది.

మరో Rolls Royce కొనుగోలు చేసిన 'సీరమ్ ఇన్‌స్టిట్యూట్' CEO: పూర్తి వివరాలు

ఇటీవల ముంబైలో ప్రయాణిస్తున్నప్పుడు అదార్ పూనావల్లా కొత్త రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII లో కనిపించారు. రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII, అదార్ పూనావల్లా యొక్క రెండవ రోల్స్ రాయిస్ కారు. వారు తమ మొదటి రోల్స్ రాయిస్ కారును 2019లో కొనుగోలు చేశారు. మొదటి రోల్స్ రాయిస్ కారుని పూణెలోని తన ఇంట్లో ఉంచారు.

మరో Rolls Royce కొనుగోలు చేసిన 'సీరమ్ ఇన్‌స్టిట్యూట్' CEO: పూర్తి వివరాలు

ప్రస్తుతం కొత్తగా కొనుగోలు చేసిన రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII కారును వారి ఉపయోగం కోసం ముంబైలో ఉంచినట్లు తెలిపారు. అంతే కాకుండా పూనవల్లా కుటుంబం రెండు పాత తరం ఫాంటమ్ VII సెడాన్‌లను కూడా కలిగి ఉన్నారు. ఈ కార్లను యోహన్ పూనావాలా ఉపయోగిస్తున్నారు. రోల్స్ రాయిస్ ఫాంటమ్ స్టాండర్డ్ ఎడిషన్ ధర రూ. 10 కోట్లు.

మరో Rolls Royce కొనుగోలు చేసిన 'సీరమ్ ఇన్‌స్టిట్యూట్' CEO: పూర్తి వివరాలు

అయితే ఈ కొత్త Rolls Royce Phantom VIII ధర రోడ్ టాక్స్ వంటి వాటితో కలిపి దాదాపు రూ. 12 కోట్లు. ఈ కారు కొత్త అల్యూమినియం స్పేస్ ఫ్రేమ్‌పై ఆధారపడి ఉంటుంది. రోల్స్ రాయిస్ ఈ కారును లగ్జరీ ఆర్కిటెక్చర్ అని పిలుస్తుంది. ఈ మోడల్ పాత మోడల్ కంటే 30% తేలికైనది.

మరో Rolls Royce కొనుగోలు చేసిన 'సీరమ్ ఇన్‌స్టిట్యూట్' CEO: పూర్తి వివరాలు

ఈ కొత్త కారు కూడా పాత మోడల్ కంటే సైజులో పెద్దది. రోల్స్ రాయిస్ ఫాంటమ్ సిరీస్ VIII కారులో సిగ్నేచర్ 24-స్లాట్ గ్రిల్‌తో పాటు ముందు భాగంలో రెండు సొగసైన హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. హెడ్‌ల్యాంప్‌లు ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో కూడిన ఎల్ఈడీ ప్రొజెక్టర్ ల్యాంప్ యూనిట్‌లు. ఇవి ఈ కారుకు ప్రత్యేక గుర్తింపునిస్తాయి. కారు వెనుక భాగం కూడా కొత్త ఆకారాన్ని కలిగి ఉంది, ఇది మునుపటి మోడల్ కంటే కూడా చాలా అద్భుతంగ ఉంటుంది.

మరో Rolls Royce కొనుగోలు చేసిన 'సీరమ్ ఇన్‌స్టిట్యూట్' CEO: పూర్తి వివరాలు

ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో రోల్స్ రాయిస్ కూడా ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ లగ్జరీ కారును పరిచయం చేసింది. ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారు డబ్బున్న ధనవంతులకు మాత్రమే పరిమితం చేయబడింది.

2011 లో రోల్స్ రాయిస్ తన ఫాంటమ్ కారు కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ మోడల్‌ను ఆవిష్కరించింది. ఈ కారు పూర్తిగా ఎలక్ట్రిక్ మరియు ఆటోమాటిక్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ ఏడాది ప్రారంభంలో, రోల్స్ రాయిస్ సైలెంట్ షాడో అనే ఎలక్ట్రిక్ కారును అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ మేలో జర్మనీలోని పేటెంట్ కార్యాలయంలో ట్రేడ్‌మార్క్ దరఖాస్తును దాఖలు చేసింది. మొత్తానికి కంపెనీ తన ఎలక్ట్రిక్ కారుకు సైలెంట్ షాడో అని పేరు పెట్టింది.

మరో Rolls Royce కొనుగోలు చేసిన 'సీరమ్ ఇన్‌స్టిట్యూట్' CEO: పూర్తి వివరాలు

ఈ రోల్స్ రాయిస్ యొక్క ఎలక్ట్రిక్ కారు యొక్క బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత 500 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. 2040 నాటికి ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే ఉత్పత్తి చేస్తామని రోల్స్ రాయిస్ ఇప్పటికే ప్రకటించింది. ఆ తర్వాత కంపెనీ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ల ఉత్పత్తిని నిలిపివేస్తుంది. రోల్స్ రాయిస్ శక్తివంతమైన మరియు వేగవంతమైన ఇంజిన్‌లకు ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు కంపెనీ ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ కార్ల వైపు అడుగులు వేస్తోంది. కావున త్వరలో కంపెనీ యొక్క ఎలక్ట్రిక్ కార్లు రోడ్డుపైకి రానున్నాయి.

Most Read Articles

English summary
Covid vaccine maker adar poonawalla buys new rolls royce phantom viii details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X