ఆ డాక్టర్లు జెసిబి సాయంతో నది దాటారు.. ఎదుకంటే?

కరోనా సెకండ్ వేవ్ భారతదేశంలో ఎంతో మంది ప్రజల ప్రాణాలు తీసింది. ఇప్పటికి కరోనా ప్రభావం చాలా మందిపై ఉంది. అయితే ఇటీవల నివేదికల ప్రకారం కరోనా కేసుల సంఖ్య మునుపటికంటే చాలా తక్కువగా ఉందని తెలుస్తోంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో కొంత ఎక్కువగా ఉంది.

ఆ డాక్టర్లు జెసిబి సాయంతో నది దాటారు.. ఎదుకంటే?

కరోనా మహమ్మరి అధికంగా విజృంభించిన సమయంలో కరోనా రోగులకు సేవచేయడానికి తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఎంతోమంది పోరాడుతున్నారు. ఇందులో భాగంగానే దాదాపు రెండు నెలల క్రితం అమలు చేసిన లాక్‌డౌన్‌ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు క్రమంగా కొంత సడలిస్తున్నాయి.

ఆ డాక్టర్లు జెసిబి సాయంతో నది దాటారు.. ఎదుకంటే?

ప్రస్తుతం దేశంలో కరోనా ఇన్ఫెక్షన్ రేటు తక్కువగా ఉన్నప్పటికీ, వైద్య సిబ్బందిపై పని ఒత్తిడి ఇంకా ఏ మాత్రం తగ్గలేదు. కరోనా రోగులకు సేవ చేస్తూ ఎంతోమంది కరోనా వారియర్స్ మరణించారు. ఎంతోమంది తమ శక్తి వంచన లేకుండా కరోనా మహమ్మారి నివారణకోసం పాటుపడుతున్నారు.

ఆ డాక్టర్లు జెసిబి సాయంతో నది దాటారు.. ఎదుకంటే?

ఇటీవల లడఖ్‌లో జరిగిన ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా తీవ్రగా ఎక్కువగా ఉన్న కారణంగా డాక్టర్లు తప్పకుండా వారికి సర్వీస్ చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలు లేకపోవడం వల్ల వారికి అవసరమైన సర్వీస్ అందించలేకపోతున్నారు.

ఆ డాక్టర్లు జెసిబి సాయంతో నది దాటారు.. ఎదుకంటే?

కొన్ని గ్రామాల్లో కనీసం ప్రాథమిక సౌకర్యాలు కూడా అందుబాటులో లేదు. ఇలాంటి ఒక ప్రాంతానికి చేరుకోవడానికి వైద్యుల బృందం జెసిబి సహాయంతో నదిని దాటింది. దీనిని మీరు ఇక్కడ చూడవచ్చు. ఆ గ్రామానికి చేరుకోవడానికి వేరే మార్గం లేకపోవడంతో ఈ విధంగా దాటవలసి వచ్చింది.

ఆ డాక్టర్లు జెసిబి సాయంతో నది దాటారు.. ఎదుకంటే?

లడఖ్ ఎంపి జమ్యాంగ్ త్సేరింగ్ నాంగ్యాల్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ సమాచారాన్ని షేర్ చేశారు. ఈ ఫొటోలో డాక్టర్లు జెసిబి ముందుభాగంలో కూర్చుని ఉన్నారు. వారిని జెసిబి నది అవతలికి చేరుస్తోంది. ఈ ఫోటో షేర్ చేస్తూ ఎంపీ వారిని ఎంతగానో అభినదించారు.

ఆ డాక్టర్లు జెసిబి సాయంతో నది దాటారు.. ఎదుకంటే?

ఎంపీ షేర్ చేసిన ఈ ఫోటో చూసిన నెటిజన్లు కూడా చాలా అభినందిస్తూ వారిని మెచ్చుకుంటున్నారు. మరికొందరు వైద్య సిబ్బందిని మెచ్చుకున్తున్నారు. మరికొందరు సరైన రోడ్డు లేదని ఎంపిలను ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా డాక్టర్లు చేసిన కృషి చాలా అభినందనీయం

ఆ డాక్టర్లు జెసిబి సాయంతో నది దాటారు.. ఎదుకంటే?

లడఖ్‌లో మంగళవారం 61 కొత్త కరోనా ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో, ఈ ప్రాంతంలో మొత్తం 19,258 కరోనా సంక్రమణ కేసులు నమోదు కాగా, ఇందులో 1,011 యాక్టివ్ కేసులున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా కరోనా మరింత తగ్గిపోయే వరకు ప్రజలు సహకరించాలి.

Most Read Articles

English summary
Ladakh Covid Warriors Ride JCB Machine To Cross River. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X