కరోనాపై పోరాటానికి తమిళనాడు సిఎం రిలీఫ్ ఫండ్‌కు ఓలా ఇచ్చిన విరాళం ఎంతో తెలుసా ?

కరోనా వైరస్ ప్రభావం వల్ల ఇప్పుడు దేశం మొత్తం చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో కరోనాపై పోరాడుతున్న ప్రభుత్వానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతుగా సినీ పరిశ్రమ వారు మరియు ఆటో పరిశ్రమ వారు చాలా విరాళాలను అందించారు. ఈ నేపథ్యంలో ఓలా సంస్థ కూడా ప్రభుత్వానికి ఎక్కువ మొత్తంలో విరాళాలను అందించారు. కానీ మళ్ళీ ఇటీవల కాలంలో తమిళనాడు ప్రభుత్వానికి విరాళాన్ని అందించింది. దీని గురించి పూర్తి సమాచారం మానసం ఇక్కడ తెలుసుకుందాం.

కరోనాపై పోరాటానికి తమిళనాడు సిఎం రిలీఫ్ ఫండ్‌కు ఓలా ఇచ్చిన విరాళం ఎంతో తెలుసా ?

దేశంలో కోవిడ్ -19 మహమ్మారిపై పోరాడటానికి ఓలా కంపెనీ తమిళనాడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు రూ. 50 లక్షలు విరాళంగా ఇచ్చారు. విరాళంగా ఇచ్చిన నిధులతో సహాయక చర్యలు మరియు ఆరోగ్య సంరక్షణ సహాయాన్ని అందించడం ద్వారా ప్రభుత్వానికి సహాయం చేయడమే కంపెనీ లక్ష్యం.

కరోనాపై పోరాటానికి తమిళనాడు సిఎం రిలీఫ్ ఫండ్‌కు ఓలా ఇచ్చిన విరాళం ఎంతో తెలుసా ?

ఓలా వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘డ్రైవ్ ది డ్రైవర్ ఫండ్' అనే కొత్త పద్దతిని కంపెనీ ప్రారంభించింది. లాక్ డౌన్ సమయంలో మొత్తం డ్రైవర్ సంఘానికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఓలా గ్రూప్ మరియు దాని ఉద్యోగులకు ఇప్పటికే రూ. 20 కోట్లు అందించగా, ఓలా సహ వ్యవస్థాపకుడు మరియు సిఇఒ భవీష్ అగర్వాల్ ఈ ఫండ్ కోసం ఒక సంవత్సరం జీతం ఇవ్వడానికి ముందుకు వచ్చాడు.

MOST READ:బిఎస్ 6 ఇంజిన్‌లో విడుదలైన కొత్త కవాసకి నింజా 650 బైక్

కరోనాపై పోరాటానికి తమిళనాడు సిఎం రిలీఫ్ ఫండ్‌కు ఓలా ఇచ్చిన విరాళం ఎంతో తెలుసా ?

ఓలా ఈ ప్రయత్నం ద్వారా డ్రైవర్ భాగస్వాములకు మరియు వారి కుటుంబాలకు అవసరమైన నిత్యావసర సామాగ్రి, వైద్య సహాయం మరియు ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా సహాయం చేస్తుంది. నిధులను పెంచడానికి, సంస్థ ‘డ్రైవ్ ది డ్రైవర్ ఫండ్' ప్రాజెక్టును ప్రజల అవసరాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి మద్దతు ఇవ్వడంతో పాటు, ఓలా గ్రూప్ కూడా ఏప్రిల్‌లో పిఎం-కేర్స్ సహాయ నిధికి రూ. 5 కోట్లు కూడా అందించింది.

కరోనాపై పోరాటానికి తమిళనాడు సిఎం రిలీఫ్ ఫండ్‌కు ఓలా ఇచ్చిన విరాళం ఎంతో తెలుసా ?

ఓలా కంపెనీ ఇచ్చిన ఈ విరాళం గురించి ఓలా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు మరియు సిఇఒ భవీష్ అగర్వాల్ మాట్లాడుతూ, ఇప్పుడు ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడంతో ఇప్పుడు సంక్షోభాన్నీ ఎదుర్కోవడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కృషి చేస్తున్నాయి.

కరోనాతో పోరాడటానికి మేము కలిసి పనిచేస్తున్నప్పుడు తమిళనాడు రాష్ట్రానికి మా వినయపూర్వకమైన సహకారాన్ని అందిస్తున్నాము. ఈ సమయంలో అధికారులకు మరియు డాక్టర్లకు ఓలా సంస్థ తమ సహాయ సహకారాలను అందిస్తుందని చెప్పాడు.

MOST READ:కరోనా సోకినా ప్రాంతాలు తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఈ యాప్ మీ కోసమే

కరోనాపై పోరాటానికి తమిళనాడు సిఎం రిలీఫ్ ఫండ్‌కు ఓలా ఇచ్చిన విరాళం ఎంతో తెలుసా ?

దీనికి సంబంధించిన వార్తల ప్రకారం ఓలా క్యాబ్స్ భారతదేశంలో తిరిగి తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. క్యాబ్ అగ్రిగేటర్ దేశంలోని 100 నగరాల్లో తమ సేవలను అందించడం ప్రారంభించింది. అయితే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ సేవలు గ్రీన్ మరియు ఆరంజ్ జోన్లలో తిరుగుతాయి.

కరోనాపై పోరాటానికి తమిళనాడు సిఎం రిలీఫ్ ఫండ్‌కు ఓలా ఇచ్చిన విరాళం ఎంతో తెలుసా ?

దేశంలో కొనసాగుతున్న కోవిడ్ -19 మహమ్మారి సమయంలో పనిచేయడానికి కంపెనీ తమ డ్రైవర్-భాగస్వాములు మరియు వినియోగదారులకు 10 టైప్స్ మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో సరైన పరిశుభ్రత పాటించడానికి ప్రతి రైడ్ తర్వాత క్యాబ్‌లు కూడా శుభ్రం చేయబడతాయి.

MOST READ:హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ ఎలక్ట్రిక్ వెర్షన్ లో వస్తుందా, రాదా..?

Most Read Articles

English summary
Ola donates Rs.50 lakh to Tamilnadu CM relief fund. Read in Telugu.
Story first published: Tuesday, May 12, 2020, 14:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X