పనికిరాని ఈ డొక్కు ఫెరారీ ధర రూ.1.54 కోట్లు

By Ravi

ఈ ఫొటోలో కనిపిస్తున్న కారును చూడండి. అస్సలు పూర్తిగా పనికిరాని దశలో ఉన్న ఈ కారును ఫ్రీగా ఇస్తామన్నా ఎవరైనా తీసుకుంటారా..? అలాంటిది ఈ కారు కోసం ఓ వ్యక్తి కోట్లు చెల్లించాడు. ఇటీవల ప్యారిస్‌లో జరిగిన వార్షిక ఫోయిర్ ఇంటర్నేషనల్ డిఆర్ట్ కాంటెంపోరియన్ (ఎఫ్ఐఏసి)లో వివిధ రకాల ఆర్ట్ వస్తువులను ప్రదర్శనకు ఉంచారు. అందులో ఈ ఫెరారీ డినో 308 జిటి4 కారు కూడా ఒకటి.

ఇది ఆషామాషీ ఆర్ట్ ప్రదర్శన కాదు. ఇందులో రెగ్యులర్ పెయింట్ వర్క్స్ కాకుండా విచిత్రమైన వస్తువులు అమ్ముడుపోతుంటాయి. ఉదాహరణకు విచిత్రంగా కనిపించే కేక్, గోడపై విచిత్రమైన రీతిలో చేసిన రంధ్రం ఇలా ఇక్కడ కనిపించేవన్నీ విచిత్రంగా (పిచ్చిగా) ఉంటాయి.


ఈ ఏడాది ఎఫ్ఐఏసిలో ఓ డొక్కు ఫెరారీ కారు ఏకంగా 2,50,000 డాలర్ల వెల పలికింది. మనదేశ కరెన్సీలో దీని ధర సుమారు రూ.1.54 కోట్లకు పైమాటే. ఈ కారు ఎంతలా డ్యామేజ్ అయిదంటే, దాన్ని రిపేరు చేయటానికి వీలుకానంతగా. ఈ డొక్కు కారును మోడ్రన్ పేరిట వేలంలో విక్రయించారు.

ఈ మోడ్రన్ ఆర్ట్‌లో భాగంగా నుజ్జు నుజ్జయిన ఈ ఫెరారీ డినో 308 జిటి4 కారును 'రెడీ-మేడ్' ఆర్ట్ పేరిట విక్రయించారు. ఈ క్రాష్డ్ ఫెరారీ వెనుక ఉన్న ఆర్టిస్ట్ పేరు బెట్రాండ్ లావియర్. టర్కీకి చెందిన ఓ ధనవంతుడు ఈ కారును కొనుగోలు చేశాడు.

Ferrari Dino

ఈ కారు వేలంలో ఇంత అధిక వెల పలకటానికి గల ప్రధాన కారణం ఇది అరుదైన మోడల్ కావటమే. ఫెరారీ కంపెనీ 1973 మరియు 1980 మధ్య కాలంలో డినో 308 జిటి4 కారును ఉత్పత్తి చేసింది. ఈ కార్లలో 252 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 3.0 లీటర్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నట్లుంది కదూ.. ఈ కథనం చదువుతుంటే.

More from DriveSpark

Article Published On: Tuesday, November 5, 2013, 11:09 [IST]
English summary
The annual Foire Internationale d'Art Contemporain (FIAC) that takes place in Paris is an art exhibition of strange articles. We are not talking about paintings that make no sense, but stranger things. At this year edition of FIAC a Ferrari was purchased for €181,185.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+