కొత్తగా మారిన ప్రమాదానికి గురైన కారు - ఫిదా చేస్తున్న వీడియో!
కారు ఏదైనా ప్రమాదంలో చిక్కుకుని ఎక్కువ డ్యామేజ్‌కి గురైనప్పుడు దాన్ని విక్రయించడం లేదా నిరుపయోగంగా ఉంచడం జరుగుతుంది. ఈ రెండింటికి భిన్నంగా ఒక వ్యక్తి ప్రమాదానికి గురైన కారును మరింత దృడంగా మరియు అందంగా మార్చుకున్నాడు. మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.
భారతదేశంలో మహీంద్రా కంపెనీ బోలెరోను 4x4 సిస్టమ్‌తో అందించేదని చాలామందికి తెలియకపోవచ్చు. కానీ నేటికీ అలాంటి కార్లు అక్కడక్కడా కనిపిస్తుంటాయి. అంతే కాకుండా ఈ కార్లపైన ఉన్న అభిమానం లేదా ఇష్టంతో మరికొందరు తమకు నచ్చినట్లు మోడిఫైడ్ చేసుకుంటున్నారు. ఇలాంటి సంఘటన మళ్ళీ ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన చిత్రాలు కూడా నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో వెల్లడైన ఫోటోలను గమనించినట్లయితే.. ప్రమాదంలో భారీగా దెబ్బ తిన్న కారు మరింత దృఢంగా తయారై ఉండటం గమనించవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించిన వీడియోలో మొదట్లో మీరు దెబ్బతిన్న కారును చూడవచ్చు. చివరికి ఆ కారు కాస్త అందమైన ఆఫ్-రోడర్ మాదిరిగిగా మారిపోయి.. చూపరులను ఒక్క చూపుతోనే ఆకర్షిస్తోంది. ఇది గతం మాదిరిగా కాకుండా దాదాపు మారిపోయింది.
ముందు భాగంలో బాగా దెబ్బ తిన్న కారును దాని యజమాని పూర్తిగా మోడిఫైడ్ చేయించుకున్నారు. ఇందులో కుడివైపు ఫెండర్, హెడ్‌ల్యాంప్‌లు, బానెట్, అల్లాయ్ వీల్స్ మరియు టైర్లు కూడా దెబ్బతిని ఉండటం చూడవచ్చు. ప్రమాదం జరిగిన తరువాత కారును వర్క్‌షాప్‌కు తీసుకెళ్లారు. అందులో జరిగిన నష్టాలను భర్తీ చేయడమే కాకుండా కొత్త పెయింట్ కూడా చేయడం గమనించవచ్చు.
కారు అసలు రంగు సిల్వర్.. కానీ మోడిఫైడ్ చేసుకున్న తరువాత కొత్త కలర్ పొంది ఉండటం గమనించవచ్చు. ఫ్రంట్ గ్రిల్, ఫెండర్లు, బానెట్ అన్నీ కూడా కొత్తగా భర్తీ చేసినట్లు తెలుస్తోంది. కారులో ప్రమాదానికి గురైన భాగాలు మొత్తం భర్తీ చేయబడ్డాయి, కానీ యాంత్రికంగా ఏమైనా మార్పులు జరిగాయా లేదా అనేది వెల్లడికాలేదు. అయితే ఇది ప్రత్యేకంగా ఆఫ్ రోడింగ్ రూపొందించినట్లు తెలుస్తోంది. దీనికోసం టైర్లు, ఆఫ్టర్‌మార్కెట్ వీల్స్ ఉపయోగించారు.
మొత్తం కొత్త కారుగా మార్చిన తరువాత బొలెరో మునుపటికంటే కూడా కొంత పొడవుగా కనిపిస్తుంది. వీల్స్ కూడా ప్రత్యేకమైన కలర్ పొందుతాయి. ఫ్రంట్ గ్రిల్ మరియు బంపర్ వంటివి బ్లాక్ కలర్ పొందుతాయి. ఇందులో ఇప్పుడు రూప్ రాక్ కూడా ఉండటం చూడవచ్చు. అంతే కాకుండా పైన లైటింగ్ సెటప్ ఉండటం కూడా గమనించవచ్చు. వెనుక డోర్స్, విండ్‌స్క్రీన్ మీద గ్రాఫిక్స్ మరియు స్టిక్కర్లు ఉన్నాయి.
కారు బయట చేసిన మార్పులు మాత్రమే మనకు కనిపిస్తున్నాయి. కానీ ఇంటీరియర్ ఎలాంటి అప్డేట్స్ పొందిందనే వివరాలు ఇక్కడ వెల్లడించలేదు. బహుశా ఎక్కువ మార్పులే జరిగి ఉండవచ్చని భావిస్తున్నాము. మొత్తానికి దేశంలో అందంగా కనిపించే మహీంద్రా బొలెరో 4x4 కార్లలో ఇది ఒకటి అని చెప్పవచ్చు. అయితే భారతదేశంలోని పబ్లిక్ రోడ్ల మీద మోడిఫైడ్ కార్లను డ్రైవ్ చేయడం చట్టరీత్యా నేరం.
దేశంలో మోడిఫైడ్ కార్లను ప్రజా రహదారుల మీద వినియోగించడం నేరం. కాబట్టి ఈ కారును మోడిఫైడ్ చేసుకున్న యజమాని భవిష్యత్తులో తప్పకుండా ఇబ్బందులను ఎదుర్కునే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నాము. కాబట్టి కార్లను మోడిఫైడ్ చేసుకున్న యజమానులు వీలైనంత వరకు పబ్లిక్ రోడ్ల మీద వాటిని ఉపయోగించకుండా ఉండటమే ఉత్తమం. లేకుంటే జరిమానాలు వంటివి చెల్లించాల్సి ఉంటుంది. తప్పకుండా వీటిని గుర్తుంచుకోవాలి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








