రూఫ్, ఫ్యాన్‌లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ కస్టమైజేషన్

By Ravi

దేశంలో అన్ని చోట్లా ఎండలు మండిపోతున్నాయ్. ప్రజలపై భానుడు కన్నెర్ర చేస్తున్నాడు. మండుటెండలో కాలు బయట పెట్టాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడుతోంది. అలాంటిది ఈ ఎండల్లో టూవీలర్‌పై రైడ్ చేయటమంటే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. పట్టపగలే చుక్కలు కనిపిస్తాయ్ కదూ..! నిజమే కానీ కొందరికి ఎండైనా, వానైనా టూవీలర్ రైడ్ తప్పదు. మరి అలాంటప్పుడు ఈ ఎండ వేడిమి నుంచి తప్పించుకోవటం ఎలా..?

ఇలాంటి ఆలోచనే వచ్చిందో ఏమో, ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి తన బుల్లెట్ బైక్‌ను ఇలా మార్చేశాడు. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్‌ను ఇలా కస్టమైజ్ చేయించుకున్నాడు. సీటు వెనుక భాగంలో రెండు ఇనుప రాడ్ల సాయంతో, తలకు పైభాగాన ఓ రూఫ్‌ను ఏర్పాటు చేశాడు. అంతేకాదండోయ్.. హాట్ హాట్ సమ్మర్‌లో కూల్ కూల్‌గా ప్రయాణించేందుకు ఈ రూఫ్‌కో ఫ్యాన్‌ను కూడా జోడింటాడు.

ఆగండి.. ఆగండి.. అప్పుడే అయిపోలేదు. పైన అమర్చిన ఫ్యాన్ ద్వారా తలకు మాత్రమే గాలి వస్తుంది కదా, మరి ముఖానికి గాలి రావాలంటే..? అందుకే హ్యాండిల్ బార్‌పై మరొక చిన్న ఫ్యాన్‌కు కూడా అమర్చేశాడు ఈ ఇంజనీర్. బాగుంది కదూ ఈ ఐడియా. ఇప్పుడు ఈ ఫోటో ఫేస్‌బుక్‌లో హల్ చేస్తుంది.

Crazy Royal Enfield Customisation With Roof And Fans

More from DriveSpark

Article Published On: Monday, May 13, 2013, 12:10 [IST]
English summary
Royal Enfield motorcycle enthusiast has customised his Bullet bike with roof and fans to escape from the summer hotness. He fixed a big fan to the roof and an another fan on handle bar.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+