బస్సులో అనిల్‌ కుంబ్లే ప్రయాణం.. సోషల్‌ మీడియాలో వైరల్‌ కామెంట్లు..!

బెంగళూరులో ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్‌ యూనియన్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. క్యాబ్‌లు, ఆటోలు సహా ఇతర ప్రైవేటు వాహనాల సంఘాలు బంద్‌కు మద్దతు ఇచ్చాయి. బంద్‌ ప్రభావం టీమిండియా మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లేపైనా పడింది. ఫలితంగా బీఎంసీటీ బస్సులో ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఈ సంఘటనపై అనిల్‌ కుంబ్లే స్పందించారు. బస్సులో ప్రయాణం చేస్తున్న ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ నుంచి బీఎంటీసీ బస్సులో ఇంటికి వెళ్లినట్లు పోస్ట్‌పైన కామెంట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌ అవుతోంది. బీఎంటీసీ వాయువజ్ర బస్సులో కుంబ్లే ప్రయాణించడంపై క్రికెట్‌ అభిమానులు ప్రశంసిస్తున్నారు. కుంబ్లే సర్కిల్‌ దగ్గర బస్సు ఆపమని కండక్టర్‌కు ఎలా చెబుతారంటూ ఓ నెటిజన్‌ ఆసక్తికర కామెంట్ చేశాడు. అనేక మంది వివిధ రకాల కామెంట్లు చేశారు.

cricketer anil kumble travelled in bmtc bus

ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు యూనియన్‌ బంద్‌ కారణంగా క్యాబ్‌లు అందుబాటులో లేకపోవడంతో అనేక మంది బస్సుల్లో ప్రయాణం చేశారు. బంద్‌ కారణంగా ఆర్టీసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఎయిర్‌పోర్టు నుంచి నగరంలోనికి అదనపు వాయువజ్ర బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ బస్సులోనే కుంబ్లే తన ఇంటికి చేరుకున్నారు.

ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి సోమవారం అర్ధరాత్రి 12 గంటల వరకు ప్రైవేటు ట్రాన్స్‌పోర్ట్‌ యూనియన్‌ బెంగళూరు బంద్‌కు పిలుపు ఇచ్చింది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొన్ని కొందరు వాహనాల యాజమానులు ప్రయాణికుల దగ్గర నుంచి అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. అయితే ప్రైవేటు యూనియన్‌ డిమాండ్లపై కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖ మంత్రి స్పందించారు. డిమాండ్లు నేరవేరుస్తామని ప్రకటన చేశారు. దీంతో బంద్‌ను విరమించింది.

కర్ణాటకలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం శక్తి పథకం అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన మహిళలకు ప్రభుత్వం బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. దీంతో ప్రైవేటు వాహనాల డ్రైవర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రోజంతా డ్యూటీలో ఉన్న కనీసం సంపాదన ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన వీడియోలో ఇప్పటికే వైరల్‌ అవుతున్నాయి. ఈ ఇబ్బందుల నేపథ్యంలో ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు యూనియన్‌ బంద్‌కు పిలుపునిచ్చింది.

ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు యూనియన్‌ డిమాండ్లను నెరవేరుస్తామని కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి హామీ ఇచ్చారు. వారికి ఇబ్బందులు కలగకుండా చూస్తామని తెలిపారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో చర్చించి.. వారందరికీ తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే విషయంపై చర్చిస్తామని హామీ ఇచ్చారు. డ్రైవర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, September 11, 2023, 19:08 [IST]
English summary
Cricketer anil kumble travelled in bmtc bus in bangalore due to strike
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+