వ్యక్తి ప్రాణాలు కాపాడిన మహమ్మద్‌ షమీ.. ‘గ్రేట్‌ షమీ' అంటూ నెటిజన్ల ప్రశంసలు.!!

క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ 2023 లో అద్భుతమైన ప్రదర్శన చేసి అభిమానులకు ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌గా మారాడు ఫాస్ట్‌ బౌలర్‌ మహమ్మద్‌ షమీ. ఫైనల్‌ మ్యాచ్‌లో పేలవమైన ప్రదర్శన కనబరిచినా మిగతా అన్ని లీగ్‌ మ్యాచులు, సెమీ ఫైనల్లో చెలరేగాడు. సెమీ ఫైనల్‌లో ఏకంగా 7 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. కాగా తాజాగా షమీ తన గొప్ప మనసును చాటుకుని మరోసారి వార్తల్లో నిలిచాడు.

ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో బాధితుడిని కాపాడి మంచి మనసును చాటుకున్నాడు టీమ్‌ ఇండియా సీనియర్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ(Mohammed Shami). ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షమీ.. తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో షేర్‌ చేశారు. శనివారం(నవంబర్‌ 25) రాత్రి ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో యాక్సిడెంట్‌ జరిగింది. ఓ కారు లోయలో పడి ప్రమాదానికి గురైంది.

Mohammad-Shami-Saves-Mans-Life

ఆ సమయంలో అదే మార్గంలో ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్తున్న మహమ్మద్‌ షమీ.. అక్కడ ప్రమాదం జరిగినట్లుగా గుర్తించాడు. వెంటనే కారును ఆపి ప్రమాదానికి గురైన వ్యక్తిని కాపాడి మానవత్వం చాటుకున్నాడు. కాగా షమీతో పాటు అతని ఫ్రెండ్స్‌ కూడా ఆ వ్యక్తిని కారులోంచి వెలికితీసేందుకు సహాయం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

షమీ మంచి మనసు పట్ల నెటిజన్లు(Mohammed Shami Rescues a Man) ఫిదా అవుతున్నారు. సమాజ స్పృహ కలిగి ఉండటంతో ఫ్యాన్స్‌ షమీని అభినందిస్తున్నారు. కాగా వీడియోను పరిశీలించినట్లయితే కారు రోడ్డుపై నుంచి లోయలో పడిపోయినట్లుగా తెలుస్తోంది. ప్రమాదానికి గురైన వ్యక్తిని షమీ, అతని స్నేహితులు రక్షించేందుకు కృషి చేశారు.

Mohammad-Shami-Saves-Mans-Life

ఈ సందర్భంగా షమీ వీడియోను షేర్‌ చేస్తూ ఇలా పోస్ట్‌ చేశాడు. 'ఆ వ్యక్తి చాలా అదృష్టవంతుడు. దేవుడు అతనికి మరో జీవితాన్ని ఇచ్చాడు. నైనిటాల్‌లో ఓ కారు లోతైన లోయలో పడింది. నా కారు ముందు అతని కారు వెళ్తోంది. కాబట్టి వెంటనే ప్రమాదం జరిగినట్లుగా గుర్తించగలిగాను. సురక్షితంగా అతడిని బయటకు తీసుకువచ్చాం' అని ఇన్‌స్టాలో షమీ చెప్పుకొచ్చాడు.

2023 క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ టోర్నమెంట్‌లో భారత్‌ రన్నరప్‌గా నిలవగా.. ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఆస్ట్రేలియా జట్టు ఆల్‌ రౌండర్‌ ప్రదర్శనతో ప్రపంచ కప్‌ గెలవాలనే భారతీయుల కల మరోసారి కలగానే మిగిలిపోయింది. అయినప్పటికీ లీగ్‌ మ్యాచ్‌ల నుంచి సెమీ ఫైనల్‌ వరకు వరుస విజయాలతో టీమిండియా పండుగ వాతావరణాన్ని అందించింది.

Mohammad-Shami-Saves-Mans-Life

ఈ వరల్డ్‌ కప్‌ టోర్నమెంట్‌లో షమీ.. తన అద్భుత ప్రదర్శనతో హీరోగా నిలిచాడు. అతని బౌలింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. క్రికెట్ మైదానంలో దూకుడుగా కనిపించే షమీ.. సెన్సిటివ్‌ అని తాజా ఘటన ద్వారా అర్థమవుతోంది. కాగా ప్రస్తుతం షమీ.. తన ఫ్రెండ్సీతో కలిసి హాలిడే వెకేషన్‌ను నైనిటాల్‌లో ఎంజాయ్‌ చేస్తున్నాడు.

Mohammad-Shami-Saves-Mans-Life

కాగా ఇరుకైన కొండ ప్రాంతాలు ఉన్న ఘాట్‌ రోడ్లపై జర్నీ థ్రిల్‌ను అందించినా.. ఆ మార్గాల్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. ఘాట్‌ రోడ్లపై ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మీ లైన్‌లో సాధారణ వేగంతో ప్రయాణించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. ఇలాంటి రోడ్లపై డ్రైవింగ్‌ సవాలుగా ఉంటుంది కాబట్టి.. రోడ్డు నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌ను అలవరుచుకోవాలి.

More from DriveSpark

Article Published On: Monday, November 27, 2023, 19:05 [IST]
English summary
Cricketer mohammed shami rescues a man in a car accident video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+