మేడ్‌ ఇన్‌ ఇండియా ఎలక్ట్రిక్‌ సైకిల్‌పై ఎంఎస్‌ ధోనీ.. ధర ఎంతో తెలుసా.??

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి.. ప్రస్తుతం ఐపీఎల్‌ టోర్నీలో ఫ్యాన్స్‌ను అలరిస్తున్న మిస్టర్‌ కూల్‌ ఎంఎస్‌ ధోనీ(MS Dhoni Doodle V3 E Cycle).. నిత్యం సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అందుకే ధోనీకి సంబంధించిన ఏ వీడియో అయినా సరే నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతుంది. ఈ క్రమంలో ధోనీ తాజాగా ఎలక్ట్రిక్ సైకిల్‌ నడుపుతున్న వీడియో వైరల్‌గా మారింది.

టీమిండియా మాజీ కెప్టెన్‌, క్రికెటర్‌ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)కి మోటార్‌ సైకిళ్లు, కార్లు అంటే ఎంతిష్టమో రాంచీలోని ధోనీ నివాసంలో గ్యారేజ్‌ చూస్తే తెలుస్తుంది. వింటేజ్‌ కార్లు, బైక్‌లను మొదలుకొని.. ప్రస్తుత తరం మోడళ్ల వరకు అన్ని వెరైటీలను కలిగి ఉన్నాడు. అందుకే వీలు కుదిరినప్పుడల్లా.. రాంచీ రోడ్లపై వింటేజ్‌ కార్లలో సెల్ఫ్‌ డ్రైవింగ్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను ఉత్సాహపరుస్తున్నాడు.

MS-Dhoni-On-Doodle-V3-E-Cycle

ఈ క్రమంలో ధోనీ ఇప్పుడు ఎలక్ట్రిక్‌ సైకిల్‌ నడుపుతున్న వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోకు 2 రోజుల్లోనే 1.7 మిలియన్లకు పైగా వ్యూస్‌తో పాటు.. 1.60 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. ధోనీ ఎలక్ట్రిక్‌ సైకిల్‌ నడపుతుండగా అభిమానుల కోలాహలాన్ని వీడియోలో చూడవచ్చు. ఇక ఇ సైకిల్‌ విశేషాలేంటంటే..

వీడియోలో MS ధోని నడుపుతోంది.. మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ సైకిల్ డూడుల్ V3 (Doodle V3). ఈ ఎలక్ట్రిక్‌ సైకిల్‌లో చాలా అధునాతన ఫీచర్లు ఉన్నాయి. దాదాపు రూ.53,000 ధర వద్ద డూడుల్‌ వీ3 కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇందులోని మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ స్కూటర్‌ ఫోల్డబుల్‌గా ఉండటంతో ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు.

MS-Dhoni-On-Doodle-V3-E-Cycle

ఈ Doodle V3 ఎలక్ట్రిక్ సైకిల్‌లో 12.75 Ah కెపాసిటీ గల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌ను ఉపయోగించారు. ఈ సైకిల్‌ పూర్తి ఛార్జ్‌పై 60 కి.మీల రేంజ్‌ను ఇస్తుంది. ఈ సైకిల్‌పై గరిష్ఠంగా గంటకు 25 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు. డూడుల్‌ వీ3 7-స్పీడ్ షిమానో గేర్ సిస్టమ్, ఎల్‌సీడీ డిస్‌ప్లే, యుఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి వివిధ ఫీచర్లను కలిగి ఉంది.

కాగా గతేడాది మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్, మాజీ స్పిన్నర్ సునీల్ జోషి ధోనీ రాంచీ నివాసానికి వెళ్లిన విషయం తెలిసిందే. ధోనీ బైక్, కార్ల కలెక్షన్ చూసి వెంకటేష్ ప్రసాద్ ఆశ్చర్యపోయారు. షోరూమ్‌లో ఇన్ని బైక్‌లు, కార్లు ఉండవు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలా చేయాలంటే చాలా ఇంట్రెస్ట్‌ కలిగి ఉండాలంటూ 'X' పోస్ట్‌ చేస్తూ వీడియోను పంచుకున్నారు.

MS-Dhoni-On-Doodle-V3-E-Cycle

MS ధోని నివాసంలోని గ్యారేజ్‌లో కవాసకి నింజా H2, డుకాటి 1098, యమహా రాజ్‌దూత్‌తో సహా భారీ బైక్‌లు ఉన్నాయి. వీటితో పాటు వింటేజ్‌ కార్లు ఈ గ్యారేజ్‌లో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఫెరారీ 599 GTO, జీప్ గ్రాండ్ చెరోకీ, పోంటియాక్ ఫైర్‌బర్డ్, నిస్సాన్ జోంగా, హమ్మర్‌తో సహా లగ్జరీ మరియు వింటేజ్‌ కార్లు ధోనీ సొంతం.

గతేడాది వన్డే వరల్డ్‌ కప్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని.. ఐపీఎల్‌ టోర్నీలో పాల్గొంటున్నాడు. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కి నాయకత్వం వహించే అవకాశాన్ని ధోనీ వదులుకోగా.. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ధోనీ 212 ఐపీఎల్ మ్యాచ్‌లలో చెన్నై జట్టుకు నాయకత్వం వహించగా.. 128 మ్యాచ్‌ల్లో జట్టును గెలిపించాడు.

More from DriveSpark

Article Published On: Saturday, March 30, 2024, 15:12 [IST]
English summary
Bcricketer ms dhoni riding made in india electric cycle emotorad doodle v3 video goes viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+