సెంచరీ హీరో నితీష్ రెడ్డి కొత్త కారు కొన్నాడా..? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో.. అసలు రహస్యం ఇదే
తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా ఉన్నారు. మెల్‌బోర్న్ వెదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగో మ్యాచ్‌లో నితీష్ కుమార్ తన తొలి సెంచరీతో క్రికెట్ ప్రపంచాన్ని మొత్తం తన వైపు తిప్పుకునేలా చేశారు. కష్టాల్లో ఉన్న భారత జట్టును అద్భుతమైన బ్యాటింగ్‌తో ఫాలోఆన్ ముప్పు నుంచి తప్పించాడు. దీంతో అందరూ కూడా నితీష్ గురించే మాట్లాడుకుంటున్నారు. క్రికెట్ దిగ్గజాల నుంచి మొదలుకుని ప్రజలు, సెలబ్రిటీల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. నితీష్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు. తెలుగు వాడైన నితీష్ కుమార్ రెడ్డి గురించి సోషల్ మీడియా మొత్తం మారుమోగుతుంది. సెంచరీ చేసిన తరువాత అతని గురించి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. ఈ క్రికెటర్ కొత్త కారును కొనుగోలు చేశాడని ఒక వార్త ప్రచారం అవుతుంది.
దీనికి సంబంధించిన ఫోటోలు కూడా బాగా షేర్ అవుతున్నాయి. నితీష్‌కు కార్లు, బైకులంటే చాలా ఇష్టం. ఇటీవల అతను తన కుటుంబంతో కలిసి కొత్త కారును అందుకుంటున్నట్లు ఉన్న ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లో కనిపించింది. దీన్ని చూసిన చాలా మంది ఈ కారును అతను ఈ మధ్యనే కొనుగోలు చేశాడని కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. ఈ ఫోటోకు సంబంధించిన వివరాల గురించి తెలుసుకుందాం.

ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో కనిపించిన దాని ప్రకారం, నితీశ్ కుమార్ రెడ్డి టయోటా షోరూమ్‌లో తన తల్లిదండ్రులతో కలిసి సిబ్బంది చేతుల మీదుగా కారు తాళాలు అందుకుంటున్నట్లుగా ఉంది. ఫోటో క్రింద 'వెల్ కమ్ హోమ్' అనే టైటిల్ కూడా ఉంటుంది. డిసెంబర్ 29న పోస్టు చేశారు. అయితే బాగా వైరల్ అవుతున్న ఫోటో సెప్టెంబర్ 2023లో ఇన్‌స్టాగ్రామ్‌లో పోప్ట్ చేశారు. ఆ సమయంలో తీసిన ఫోటో ఇప్పుడు ట్రెండింగ్‌కు వచ్చింది.
ఆ ఫోటోలో నితీశ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన తండ్రి ముత్యాలరెడ్డి, తల్లి మానస ఉన్నారు. పోస్ట్‌ను చూసిన ప్రతిఒక్కరూ కొత్త కారు కొన్నందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఈ ఫోటో ఇప్పటిది కాదని తెలియడంతో ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు. 15 నెలల క్రితం ఫొటోను ఇప్పుడు ఎవరో పోస్ట్ చేయగా అది, ట్రెండింగ్‌గా మారింది. నితీశ్ గురించి చర్చ జరుగుతున్న సమయంలో ఈ వార్త కూడా వైరల్ అయింది.
నితీశ్ కుమార్ రెడ్డి కొనుగోలు చేసిన కారు విషయానికి వస్తే, అది టాయోటా అర్బన్ క్రూయిజర్ హై రైడర్ SUV (Toyota Urban Cruiser Hyryder). ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడల్ ధర రూ. 11.14 లక్షల నుండి రూ. 19.99 లక్షల వరకు ఉంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. ఇది 1.5-లీటర్ పెట్రోల్, హైబ్రిడ్(పెట్రోల్ + ఎలక్ట్రిక్), CNG వేరియంట్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనిలో 5 మంది ప్రయాణించవచ్చు.
ఇది 19.39 నుండి 27.97 kmpl మైలేజీని ఇస్తుంది. పెట్రోల్, హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్లలో 5-స్పీడ్ మాన్యువల్/6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జోడించారు. అదే CNG వేరియంట్‌లో మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుందని తెలుస్తుంది. ఇది గేమింగ్ గ్రే, కేఫ్ వైట్, స్పోర్టిన్ రెడ్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








