హైవేపై లంబోర్ఘినీ కారులో ఓవర్‌ స్పీడ్‌తో దూసుకెళ్లిన రోహిత్‌ శర్మ.. ఫైన్‌ వేసిన ట్రాఫిక్‌ పోలీసులు

క్రికెటర్‌, టీమ్‌ ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు పూణె ట్రాఫిక్‌ పోలీసులు ఝలక్‌ ఇచ్చారు. ముంబయి- పూణె ఎక్స్‌ప్రెస్‌వేలో మెరుపు వేగంతో డ్రైవ్‌ చేసినందుకు గాను రోహిత్‌కు మూడు చలాన్లు విధించినట్లు సమచారం.

వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ సందర్భంగా ప్రత్యర్థి జట్టులతో టీం ఇండియా అత్యద్భుతమైన బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకూ జరిగిన మూడు మ్యాచుల్లో మూడూ గెలుపొంది.. ఇవ్వాళ బంగ్లాదేశ్‌తో జరగనున్న మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. కాగా ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ(Cricketer Rohit Sharma) చిక్కుల్లో పడ్డారు. తను హై స్పీడ్‌తో కారును డ్రైవ్‌ చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

Fine-For-Rohit-Sharma

ఇటీవల ముంబయి- పూణె ఎక్స్‌ప్రెస్‌వేలో నిర్లక్ష్యంగా డ్రైవ్‌ చేసినందుకు గాను రోహిత్‌కు పలు చలాన్లు విధించినట్లు సమచారం. వరల్డ్‌ కప్‌ సందర్భంగా భారత్‌ vs బంగ్లాదేశ్‌ మ్యాచ్‌కు ముందుకు టీం ఇండియా క్రికెటర్లతో కలిసి రోహిత్‌ పూణెకు వెళ్లారు. ఈ క్రమంలో ఎక్స్‌ప్రెస్‌ వే పై రోహిత్‌ మెరుపు గంటకు 200 కి.మీ వేగంతో డ్రైవింగ్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ తన లగ్జరీ లంబోర్ఘినీ ఉరుస్‌ ఎస్‌యూవీలో(Lamborghini Urus SUV) ముంబయి- పూణె ఎక్స్‌ప్రెస్‌వే పై 200 కి.మీ వేగంతో దూసుకుపోవడమే కాకుండా ఒకానొక సమయంలో ఆ స్పీడ్‌ 215 కి.మీకు చేరినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయితే ఈ సంఘటన గత సోమవారం లేదా మంగళవారం జరిగినట్లు తెలుస్తోంది.

అహ్మదాబాద్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ ఆడిన అనంతరం రోహిత్‌ ఫ్లైట్‌లో ముంబయికి చేరుకున్నారు. కాగా టీం సభ్యులందరూ పూణెలో ఉండగా.. వారికి 5 రోజులు బ్రేక్ ఉండటంతో రెండు రోజులపాటు కుటుంబ సభ్యులతో గడిపిన రోహిత్‌ శర్మ.. అనంతరం పూణెకి రోడ్డు మార్గంలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ముంబయి- పూణె ఎక్స్‌ప్రెస్‌వేపై 200 కి.మీకి తగ్గకుండా తన లంబోర్ఘినీ ఉరుస్‌ కారులో మెరుపు వేగంతో దూసుకెళ్లాడు.

కాగా రోహిత్‌ శర్మ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచుల్లో రోహిత్‌ 217 పరుగులు చేశాడు. హైవేపై రోహిత్‌ పరిమితికి మించిన వేగంతో నడిపినందుకు గాను అతనికి మూడు చలాన్లు విధించినట్లు సమాచారం. ఇప్పుడు హైవేలపై అక్కడక్కడా వేగాన్ని కొలిచే మీటర్లను అమర్చడంతో ఆటోమేటిక్‌గా వాహనాలు వెళ్లే వేగాన్ని బట్టి ఫైన్ వేస్తున్నారు. ఈ సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఓవర్ స్పీడ్ కారణంగా ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా కొంతమంది తమ లగ్జరీ కారులో స్లోగా వెళ్లడానికి ఇష్టపడారు. ఒకసారి స్పోర్ట్స్‌ కారులో డ్రైవింగ్‌ సీట్‌లో కూర్చున్న తర్వాత హైవేలపై హై స్పీడ్‌తో వెళ్లడమే సాహసంగా భావిస్తారు. కాగా వరల్డ్‌ కప్‌ జరుగుతున్న నేపథ్యంలో రోహిత్‌ ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. హై స్పీడ్‌తో వెళ్లడంతో ట్రాఫిక్‌ పోలీసుల కంటి చిక్కగా.. ఫైన్ వేసి అతడి కారు స్పీడ్‌కి బ్రేక్‌లు వేశారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Thursday, October 19, 2023, 11:31 [IST]
English summary
Cricketer rohit sharma issued multiple fines for over speed in his lamborghini urus suv
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+