లగ్జరీ రేంజ్ రోవర్ కొనుగోలు చేసిన శిఖర్ ధావన్.. ధర తెలిస్తే షాక్, క్యాబిన్ అదుర్స్..!
స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్‌కు లగ్జరీ కార్లంటే ఎంతో ఇష్టం. ఇప్పటికే చాలా లగ్జరీ కార్లు తన గ్యారేజీలో ఉన్నాయి. అయితే తాజాగా రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కారును కొనుగోలు చేశారు. ఈ కారుకు సంబంధించిన రీల్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌లో ధావన్ ఫోస్టు చేశారు. ధావన్ కొనుగోలు చేసిన కారు రేంజ్ రోవర్ తాజా వెర్షన్‌గా తెలుస్తోంది. ఈ వాహనాన్ని ఇప్పటికే పలువులు సెలబ్రిటీలు కలిగి ఉన్నారు.
శిఖర్ ధావన్ కొనుగోలు చేసిన రేంజ్ రోవర్.. ముందు విడుదల అయిన కార్ల కంటే అనేక మెరుగైన డిజైన్‌ను కలిగి ఉంది. హెడ్‌ల్యాంప్ ప్రొజెక్టర్ ఎల్‌ఈడీ లైట్లు మరియు ఇంటిగ్రేటెడ్ LED DRLలను కలిగి ఉంటాయి. రీడిజైన్ చేయబడిన బంపర్‌ను కలిగి ఉంటుంది. ఈ బంపర్ ప్రీమియం లుక్‌ని ఇస్తుంది. అప్‌గ్రేడ్ చేయబడిన డోర్ హ్యాండిల్స్ ఫ్లష్ ఫిట్టింగ్‌ను కలిగి ఉంది.

రేంజ్ రోవర్ ఆటోబ్రయోగఫ్రీ లోపలి క్యాబిన్ అత్యంత విలాసవంతంగా ఉంటుంది. మరియు అప్‌గ్రేడ్ చేయబడిన అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు వచ్చిన రేంజ్ రోవర్‌లలో ఇటువంటి లగ్జరీ క్యాబిన్‌ను చూసి ఉండరు. మెరీడియన్ 35 స్పీకర్ సౌండ్ సిస్టమ్, యాక్సివ్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీని ఈ కారు కలిగి ఉంది.
ఈ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ 13.1 అంగుళాల డిజిటల్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. మరియు ఈ కారు హెడ్‌అప్ డిస్‌ప్లే, మల్టీ జోన్ క్లైమెట్ కంట్రోల్, 4-స్పోక్ స్టీరింగ్ వీల్, వెనుక సీట్లో కూడా ఎంటర్‌టైన్‌మెంట్ వ్యవస్థను కలిగి ఉంటుంది.

కొత్త రేంజ్ రోవర్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లను కలిగి ఉంది. పెట్రోల్ వేరియంట్ 4.4 లీటర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 523 Ps మరియు 750Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే డీజిల్ వేరియంట్ 3.0 లీటర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. మరియు 346Ps మరియు 700Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
శిఖర్ ధావన్ ఏ వెరియంటే రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేశారనేది స్పష్టత లేదు. కానీ ఈ కారు సరసమైన ధర రూ.3.5 కోట్ల ఉంటుంది. అదే టాప్ వేరియంట్ ధర రూ.4 కోట్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

లేటెస్ట్ వెర్షన్ రేంజ్ రోవర్‌తో పాటు మెర్సిడెస్ బెంజ్ GL- క్లాస్ మరియు BMW M8 లగ్జరీ కార్లు శిఖర్ ధావన్ వద్ద ఇప్పటికే ఉన్నాయి. 2021లో వీటిని ధావన్ కొనుగోలు చేశాడు. మెటాలిక్ బ్లాక్ షేడ్ బీఎండబ్ల్యూ కారు ధావన్ వద్ద ఉంది. BMW M8 స్లోపింగ్ రూఫ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.
20 అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. బరువు తగ్గించడంలో భాగంగా రూఫ్ సహా అనేక చోట్ల కార్బన్ ఫైబర్ మెటీరియల్‌ను వినియోగించారు. ఎమ్- స్పెక్ రియర్ డిఫ్యూజర్ మరియు ట్విన్ టెయిల్ పైపులతో కూడిన డబుల్ ఫ్లో ఎగ్జాస్ట్ వ్యవస్థను బిఎండబ్ల్యూ కలిగి ఉంటుంది.

మరియు ఈ కారు 4.4 లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 592bhp మరియు 750 గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంటుంది. మరియు xDrive AWD వ్యవస్థతో వస్తుంది. బిఎండబ్ల్యూ M8 కారు 3.3 సెకన్లలోనే 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.


Click it and Unblock the Notifications








