Mercedes-AMG G63 కారును కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ "జి-క్లాస్" (G-Class) కు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులు ఉన్నాయి. సెలబ్రిటీలు ఎక్కువగా ఇష్టపడే కార్లలో ఇది కూడా ఒకటి. మన టాలీవుడ్ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు కూడా ఇలాంటి కారును ఉపయోగిస్తున్నారు. ఇటీవల టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా ఇలాంటి ఓ కారును కొనుగోలు చేశాడు. బాక్సీ టైప్ బాడీ డిజైన్ ను కలిగి ఉండే మెర్సిడెస్ బెంజ్ జి-క్లాస్ ఎస్‌యూవీలు మంచి రోడ్ ప్రజెన్స్ ను కలిగి ఉండి, చూపరుల దృష్టిని ఆకట్టుకుంటాయి. అందుకే, ఈ మోడల్ కు అంత క్రేజ్.

Mercedes-AMG G63 కారును కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్

తాజాగా, కోల్‌కతా నైట్ రైడర్ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఓ మెర్సిడెస్-ఏఎమ్‌జి జి63 (Mercedes-AMG G63) ఎస్‌యూవీని కొనుగోలు చేశారు. శ్రేయాస్ అయ్యర్ గ్యారాజ్ లో ఇప్పటికే కొన్ని ప్రసిద్ధ లగ్జరీ కార్లు ఉండగా, ఈ ఆటగాడు ఇప్పుడు తాజాగా కొత్త Mercedes-AMG G63 SUVని తమ కార్ కలెక్షన్ లో చేర్చుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్ అతనిని తమ జట్టులోకి తీసుకురావడానికి KKR సుమారు రూ.12.25 కోట్లు వెచ్చించిన తర్వాత ఈ సంవత్సరం IPL వేలం అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో చేరాడు.

Mercedes-AMG G63 కారును కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్

ఆ తర్వాత అయ్యర్ IPL ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా నియమితుడయ్యాడు మరియు అతని జట్టు సరిగ్గా ఆడకపోయినప్పటికీ, అతను తన బిల్లింగ్‌కు అనుగుణంగా జీవించాడు. ఇప్పుడు IPL ముగియడంతో, అయ్యర్ తన కార్ కలెక్షన్‌లో Mercedes-AMG G63 SUVని జోడించారు. భారతదేశంలో దీని ధర సుమారు రూ. 2.55 కోట్లు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.

Mercedes-AMG G63 కారును కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్

మెర్సిడెస్ ఏఎమ్‌జి జి63 అనేది మెర్సిడెస్ G-Wagen (Gelandewagen) SUV యొక్క గో-ఫాస్టర్ వెర్షన్, ఇది జర్మన్ కార్ బ్రాండ్ యెక్క పెర్ఫార్మెన్స్ కార్ విభాగం AMG ప్రత్యేకంగా ట్యూన్ చేయబడింది. ఈ పవర్‌ఫుల్ ఎస్‌యూవీ మెర్సిడెస్-ఏఎమ్‌జి యొక్క పవర్‌ఫుల్ 4.0 లీటర్ ట్విన్ టర్బో వి8 ఇంజన్ ఉంటుంది. ఇది గరిష్టంగా 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 577 బిహెచ్‌పి పవర్ ను మరియు 2,500 - 3,500 ఆర్‌పిఎమ్ మధ్యలో 850 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Mercedes-AMG G63 కారును కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్

మొత్తం 2.35 టన్నుల కంటే ఎక్కువ బరువు కలిగి ఉండే మెర్సిడెస్ ఏఎమ్‌జి జి63 కేవలం 4.5 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. ఈ పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీ గరిష్టంగా గంటకు 240 కిమీ వేగంతో పరుగులు తీస్తుంది. మెర్సిడెస్ బెంజ్ ప్రస్తుతం ఈక్యూజి (EQG) అని పిలువబడే జి-క్లాస్ యొక్క ఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్‌పై పని చేస్తోంది, ఇది గత సంవత్సరం కాన్సెప్ట్ రూపంలో ఆవిష్కరించబడింది.

Mercedes-AMG G63 కారును కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్

శ్రేయాస్ అయ్యర్ కార్ గ్యారాజ్ లో కొత్తగా వచ్చిన Mercedes-AMG G63 లగ్జరీ ఎస్‌యూవీతో పాటుగా పలు ఇతర లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. శ్రేయాస్ అయ్యర్ కార్ కలెక్షన్‌లో ఆడి ఎస్5 మరియు లంబోర్ఘిని హురాకాన్ వంటి స్పోర్ట్స్ కార్లు కూడా ఉన్నాయి. శ్రేయాస్ అయ్యర్ తన రెడ్ కలర్ లాంబో కారులో తిరుగుతున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌ లో వైరల్ అయ్యింది. ప్రకాశవంతమైన రెడ్ షేడ్‌లో ఉన్న లంబోర్ఘిని హురాకాన్ ఎవో కారులో ఈ స్టార్ క్రికెటర్ చక్కర్లు కొడుతూ కనిపించారు.

Mercedes-AMG G63 కారును కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్

లంబోర్ఘిని హురాకాన్ ఎవో దాని వి10 ఇంజన్ ‌ను హురాకాన్ యొక్క పెర్ఫార్మంటే వెర్షన్‌తో పంచుకుంటుంది. లంబోర్ఘిని హురాకాన్ ఎవోలో, 5.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి10 ఇంజన్ ఉంటుంది, ఇది 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 631 బిహెచ్‌పి శక్తిని మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 601 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ నుంచి వచ్చే శక్తి 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ గేర్‌బాక్స్ ద్వారా నాలుగు చక్రాలకు పంపిణీ చేయబడుతుంది. లంబోర్ఘిని హురాకాన్ ఎవో కేవలం 2.9 సెకన్లలో గంటకు 0 నుండి 10 కిమీ వేగాన్ని చేరుకుంటుంది మరియు గరిష్టంగా గంటకు 325 కిమీ కంటే ఎక్కువ వేగంతో పరుగులు తీస్తుంది.

Mercedes-AMG G63 కారును కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్

శ్రేయాస్ అయ్యర్ నడపుతున్న మరొక కారు ఆడి ఎస్5. ఇది కూడా జర్మన్ బ్రాండ్ కు చెందినదే. అయ్యర్ నడుపుతున్న ఆడి ఎస్5 ప్రీ-ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌గా కనిపిస్తుంది. ఇది 3.0 లీటర్ టర్బోచార్జ్డ్ వి6 ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 5,400 - 6,400 ఆర్‌పిఎమ్ మధ్యలో 349 బిహెచ్‌పి శక్తిని మరియు 1,370 మరియు 4,500 ఆర్‌పిఎమ్ మధ్యలో 500 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

Most Read Articles

English summary
Cricketer shreyas iyer buys mercedes amg g63 luxury suv
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X