Shubman Gill స్పైడర్ మ్యాన్‌లా శుభ్‌మన్ గిల్.. కారుపై ఎక్కి పోజులు.. వీడియో వైరల్..
ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే.. యువ ఆటగాళ్లు తమ మెరుపు ఇన్నింగ్స్ పర్ఫామెన్స్‌తో అదరగొడుతుంటారు. ఈ కోవలో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న శుభ్‌మన్ గిల్ పేరు ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించిన గిల్.. ఓ కారుపై నిల్చుని డిఫరెంట్‌గా పోజులిచ్చి ట్రోల్ అవుతున్నాడు.
ప్రస్తుతం ఐపీఎల్ 2023 లో బాగా వినిపిస్తున్న పేరు శుభ్‌మన్ గిల్. గుజరాత్ జెయింట్స్ ఓపెనర్‌గా పరుగుల సునామీ సృష్టిస్తున్న ఈ క్రికెటర్.. ఇటీవలే సన్ రైజర్స్ హైదరాబాద్ మీద సెంచరీ చేసి ఫుల్ జోష్‌లో ఉన్నాడు. అంచనాలకు మించి రాణిస్తున్న గిల్.. క్రీడల్లోనే కాదు సినిమా రంగంలోను తన సత్తా చాటుతున్నాడు. తాజాగా ఓ హాలీవుడ్ యానిమేషన్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో తన కారుపై సందడి చేశాడు.

యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ గురించి ఒకదాని తర్వాత ఒకటి సోషల్ మీడియాలో న్యూస్ హల్‌చల్ చేస్తోంది. ముఖ్యంగా, అతను సారా టెండూల్కర్‌తో డేటింగ్ చేస్తున్నారనే విషయం గత కొన్ని నెలలుగా చర్చలో ఉంది. అలాగే ఇటీవల గిల్, బాలీవుడ్ నటి సారా అలీఖాన్‌ల ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. హాలీవుడ్ ఫ్రాంఛైజీలకు చెందిన ఓ సినిమాలో ఓ పాత్రకు డబ్బింగ్ చెబుతున్న తొలి క్రీడాకారుడిగా శుభ్‌మన్ రికార్డులకెక్కాడు.
తాజాగా స్పైడర్ మ్యాన్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో మరోసారి సందడి చేశాడు శుభ్‌మన్ గిల్. 'స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్' హిందీ ట్రైలర్ ఈవెంట్‌లో సూటు, బూటు ధరించి వేడుకకు BMW 5 సిరీస్ సెడాన్‌లో వచ్చాడు. అనంతరం అందరూ చూస్తుండగానే టయోటా క్యామ్రీ కారు పైకి ఎక్కి సూపర్ హీరో 'స్పైడర్ మ్యాన్'లా పోజులివ్వడం మొదలుపెట్టాడు. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఏప్రిల్ 2021లో, శుభ్‌మన్ గిల్ కుటుంబానికి మహీంద్రా థార్ కారును బహుమతిగా అందించారు. గిల్ అద్భుత ఆటకు మహీంద్రా గ్రూప్ యజమాని ఆనంద్ మహీంద్రా ఈ గిఫ్ట్ ఇచ్చారు. కారు డెలివరీ తీసుకుంటున్న ఫొటోను అతని సోదరి తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఆ సమయంలో గిల్ ఐపీఎల్‌లో ఆడుతున్నందున, గిల్ స్వయంగా థోర్‌ను బహుమతిగా స్వీకరించలేకపోయాడు.
గిల్ వద్ద కాస్ట్లీ కారు : అలాగే, శుభ్‌మన్ గిల్ మరో కారు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వెలార్‌ను కలిగి ఉన్నారు. దీని ధర దాదాపు రూ.89 లక్షలుగా ఉంది. ఇది శక్తివంతమైన 2.0 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్‌తో ఉంది. గరిష్ఠంగా 204 PS శక్తిని మరియు 430 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 217 km/h గరిష్ఠ వేగాన్ని కూడా కలిగి ఉంటుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








