కరోనా E-PASS పొందాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి
కరోనా వైరస్ మహమ్మారి భారతదేశంతో సహా మొత్తం ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ 2020 మార్చి 24 నుండి 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. కానీ కరోనా తీవ్రత మరింత ఎక్కువగా ఉన్న కారణంగా ఈ లాక్ డౌన్ ప్రస్తుతం రెండు మరియు మూడవ దశలు పూర్తి కావచ్చాయి. ఇప్పుడు దేశ వ్యాప్తంగా నాల్గవ దశ లాక్ డౌన్ అమలులో ఉంది.

భారతదేశంలో నాల్గవ దశ లాక్ డౌన్ లో అన్ని రాష్ట్రాలలో గ్రీన్, ఆరంజ్ మరియు రెడ్ జోన్లుగా విభజించి కొన్ని సడలింపులు కలిపించారు. ఈ నేపథ్యంలో గ్రీన్ మరియు ఆరంజ్ జోన్లలో కొన్ని వ్యాపారాలు నియమిత సమయం వరకు చేసుకువడానికి అవకాశం కల్పించారు.
అంతే కాకుండా కొన్ని వాహన సేవలు కూడా ఈ జోన్లలో ప్రారంభించబడ్డాయి. కానీ రెడ్ జోన్లో మాత్రం ఎప్పటిలాగే లాక్ డౌన్ కొనసాగుతుంది. భారతదేశంలో లాక్ డౌన్ నాల్గవ దశ ఈ నెల 31 వరకు ఉంటుంది. అప్పటివరకు దేశవ్యాప్తంగా ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలి. విద్యా సంస్థలు, సినిమా హాల్స్ వంటివి కూడా ఇప్పుడు ఓపెన్ చేయకూడదు.

ప్రస్తుతం ఈ లాక్ డౌన్ సమయంలో రెడ్ జోన్లో అత్యవసర సేవలు మాత్రం అమలులో ఉంటాయి. ఈ ‘అత్యవసర సేవల్లో' డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు, కిరాణా షాపులు, విద్యుత్, గ్యాస్ మరియు నీటికి సంమంధించినవన్నీ లాక్ డౌన్ లో కొంత మినహాయింపు ఉంటుంది. అంతే కాకుండా మీడియా సిబ్బంది మరియు ఫార్మసీలు వంటి వాటికి కూడా లాక్ డౌన్ నుంచి మినహాయింపు లభిస్తుంది.

లాక్ డౌన్ లో అత్యవసర సమయంలో బయటికి వెల్లసిన వారు తమకు తాము ‘కర్ఫ్యూ పాస్' లేదా e-pass పొందవచ్చు. ఈ పాస్‌లను రాష్ట్రాలను బట్టి ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. కర్ఫ్యూ పాస్ ఒక వ్యక్తి పోలీసు మరియు ప్రభుత్వ పర్యవేక్షణలో తమ ప్రాంతానికి వెలుపల వెళ్లడానికి, ఎలాంటి అవసరమైన సేవలను అందించడానికైనా అనుమతించబడుతుంది.

లాక్ డౌన్ లో ఒక వ్యక్తి కర్ఫ్యూ పాస్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం..
స్టెప్ 1: నిర్దిష్ట రాష్ట్రం లేదా నగరం యొక్క అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌ను సందర్శించి, ‘ఇ-పాస్ అప్లికేషన్' టాబ్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 2: అవసరమైన అన్ని వివరాలను పూరించండి, మరియు సహాయక పత్రాలను కూడా అప్‌లోడ్ చేయండి (అవసరమైతే).
స్టెప్ 3: మీ దరఖాస్తును సమర్పించండి.
స్టెప్ 4: ఆమోదించబడిన తర్వాత, మీకు సంబంధిత అధికారుల నుండి సందేశం వస్తుంది.
స్టెప్ 5: మీరు బయటకు వెళ్లే ప్రతిసారీ ఇ-పాస్ యొక్క హార్డ్ కాపీని తీసుకెళ్లండి.

ప్రతి రాష్ట్రం ఆ రాష్ట్రం యొక్క కరోనా తీవ్రతను బట్టి, వ్యక్తులకు పాస్ ఇవ్వడానికి వేర్వేరు ప్రక్రియలు మరియు విధానాలను కలిగి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో కర్ఫ్యూ పాస్ పొందటం ఎలా..
1) ఆంధ్రప్రదేశ్ ప్రజలు e-pass అప్లై చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. లేదా https://serviceonline.gov.in/epass/ వెబ్ సైట్ ని సందర్శించి e-pass పొందవచ్చు.
2) తెలంగాణ ప్రజలు e-pass అప్లై చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. లేదా https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వారా e-pass పొందవచ్చు.


Click it and Unblock the Notifications








