నేటి ఫేస్‌బుక్ వీడియో: సైకిల్‌తో కొండపై నుంచి నేరుగా క్రిందకు..
నేటి ఫేస్‌బుక్ వీడియో ఫీచర్‌లో మనం ఓ ప్రొఫెషనల్ సైక్లిస్ట్ చేసిన స్టంట్‌లను చూద్దాం రండి. కర్టిస్ కీనెస్ అనే ప్రొఫెషనల్ మౌంటైన్ బైక్ రేసర్ డౌన్‌హిల్ సైక్లింగ్ (కొండపై నుంచి సైకిల్‌ను క్రిందకు నడపటం)లో చాలా అనుభవం కలిగిన వ్యక్తి.
రెడ్ బుల్‌తో అసోసియేషన్ కలిగి ఉన్న కర్టిస్ కీనెస్ 'ఎండ్యురో రేసింగ్'గా పిలిచే అత్యంత ప్రమాదకరమైన ఈ స్పోర్ట్‌లో అద్భుతమైన స్టంట్‌లను చేస్తుంటాడు. అదుపు చేయలేని వేగంతో కొండపై నుంచి క్రిందకు దూసుకువచ్చే బైక్‌లను కంట్రోల్ చేయటం చాలా కష్టం.
సన్నగా ఉండే దార్లు, లోతైన దార్లలో సైకిల్‌ను క్రిందకు నడపటం అంటే కత్తిమీద సాము లాంటిదే. అమెరికన్ టాప్ రైడర్లలో ఒకరైన కర్టిస్ కీనెస్ ఈ సాహసాన్ని సునాయాసంగా చేస్తుంటే, చూసేవారు కళ్లార్పకుండా ఔరా అని ముక్కున వేలేసుకోవటం ఖాయం.
మరి ఆలస్యమెందుకు మనం కూడా ఆ వీడియోను చూసేద్దాం రండి.


Click it and Unblock the Notifications








