కస్టమైజ్డ్ లాంబోర్గినీ అవెంటేడర్ కోసం హాట్ ప్రమోషన్
కార్ల తయారీ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రచారం చేసేందుకు వివిధ వినూత్న ప్రకటనలు రూపొందిస్తుంటారు. కొనుగోలుదారుల దృష్టిని తమ వైపుకు తిప్పుకునేందుకు ఎంతకైనా తెగిస్తారు. ఇదిగో ఈ ఫొటోలో చూడండి, కస్టమైజ్డ్ లాంబోర్గినీ అవెంటేడర్ సూపర్ కారును ప్రమోట్ చేసేందుకు సదరు కస్టమైజేషన్ కంపెనీ చేస్తున్న ప్రచారం ఎలా ఉందో..!
జర్మనీకు చెందిన కార్ కస్టమైజర్ ఈ లాంబోర్గినీ అవెంటేడర్ సూపర్ కారును కస్టమైజ్ చేశాడు. తమ కస్టమైజేషన్ డిజైన్‌లను ప్రమోట్ చేసేందుకు విక్టోరియా సీక్రెట్స్ బ్రాండ్‌తో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందంలో భాగంగా, విక్టోరియా సీక్రెట్స్ తమ అందమైన మోడల్స్‌కు ఇలా బికినీ దుస్తులు వేసి, కారు ముందు ఫోజులివ్వాల్సి ఉంటుంది. ఈ క్యాంపైన్ ఫొటోషూట్‌ను మియామిలో నిర్వహించారు. మరి ఈ హాట్ లాంబోర్గినీ అడ్వర్‌టైజ్‌మెంట్‌ను మనం కూడా చూసేద్దాం రండి..!
లాంబోర్గినీ అవెంటేడర్ గురించి...
లాంబోర్గినీ అవెంటేడర్ సూపర్ కారులో శక్తివంతమైన 6.5 లీటర్, వి12 ఎమ్‌పిఐ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 700 హెచ్‌పిల శక్తిని, 690 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఇది కేవలం మూడు సెకండ్లలోనే మూడంకెల వేగాన్ని (2.9 సెకండ్లలోనే 0-100 కి.మీ.) అందుకుంటుంది. ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కలిగిన లాంబోర్గినీ అవెంటేడర్ ఎల్‌పి700-4 సెవన్-స్పీడ్ ట్రాన్సిమిషన్ (ఏడు గేర్లు) సిస్టమ్‌తో లభిస్తుంది.
రెండు డోర్లు మాత్రమే కలిగిన లాంబోర్గినీ అవెంటేడర్ ఎల్‌పి700-4లో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. ఇది సిజర్ డోర్స్‌ను (కత్తెర మాదిరిగా పైవైపుకు తెరచుకునే డోర్లు) కలిగి ఉంటుంది. ఇందులో ఏబిఎస్, ఈఎస్‌పి, ఎయిర్ బ్యాగ్స్ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇది లీటర్ పెట్రోల్‌కు కేవలం మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల మైలేజీని మాత్రమే ఇస్తుంది.

లాంబోర్గినీ అవెంటేడర్ కోసం హాట్ ప్రమోషన్

లాంబోర్గినీ అవెంటేడర్ కోసం హాట్ ప్రమోషన్

లాంబోర్గినీ అవెంటేడర్ కోసం హాట్ ప్రమోషన్

లాంబోర్గినీ అవెంటేడర్ కోసం హాట్ ప్రమోషన్



Click it and Unblock the Notifications








