లంబోర్గిని తరహాలో Maruti S Presso కారులో మార్పులు.. క్రేజీ ఫోటో వైరల్..!
లంబోర్గిని ప్రస్తుతం ఉన్న లగ్జరీ కార్లలో ఒకటి (Lamborghini). ఈ కార్లు సాధారణంగా V10 మరియు V12 వంటి శక్తివంతమైన ఇంజన్లు ఉంటాయి. ఈ కార్లకు భారత్‌లోనూ భారీగా అభిమానులున్నారు. ఈ కార్లు మెరుగైన డిజైన్, మరియు కీలక భద్రతా ఫీచర్లను కలిగి ఉంటుంది.
మారుతి ఎస్ ప్రెస్సో కారును (Maruti S Presso) లంబోర్గిని మార్చిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. మారుతి s ప్రెస్సో ప్రస్తుతం భారత మార్కెట్లో కస్టమర్లను ఆకట్టుకున్న మైక్రో ఎస్‌యూవీగా నిలిచింది. అయితే ఈ వాహనాన్ని లంబోర్గిని మాదిరిగా మార్పులు చేశారు. ఈ వీడియోను రిచ్‌టార్క్ అనే ఇన్‌స్టాగ్రాం పేజీలో వెల్లడించారు.

మారుతి S ప్రెస్సో : కారు డోర్లు పైకి తెరుచుకొనే విధంగా మార్పులు చేశారు. ఈ తరహా ఫీచర్ లంబోర్గిని కార్లు కలిగి ఉంటాయి. ఈ మారుతి కారును స్పోర్ట్స్ కారు మాదిరిగా మార్పులు చేశారు 5 స్పోక్ అల్లాయ్ వీల్స్ సహా బాడీ స్టిక్కర్‌లను అతికించారు. రేసింగ్ కోసం రూపొందించిన కారు మాదిరిగా కనిపిస్తుంది. కారు ఇంటీరియర్‌లోనూ కొన్ని మార్పులు చేశారు.
మారుతి S ప్రెస్సో వాహనం ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు 14 అంగుళాల స్టీల్ వీల్స్, స్లిక్ ఫ్రంట్ గ్రిల్, క్రోమ్ ఇన్సర్ట్, హెడ్‌ల్యాంప్, ఎక్స్‌టెండెడ్ సెంటర్ ఎయిర్ ఇన్‌టెక్, C-షేప్ టెయిల్‌గేట్ సహా మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్‌ను కలిగి ఉంటుంది.
Image Courtesy: RICH TORQUE/Instagram
దీంతోపాటు బాడీ కలర్ డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టాకోమీటర్, ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్‌ప్లే స్టూడియో సిస్టమ్, ఆపిల్ కార్‌ప్లే/ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆరెంజ్ కలర్ యూసెంట్ ఉన్నాయి. ఈ కారును తొలిసారి 2019లో మార్కెట్‌లోకి విడుదల అయింది.
మారుతి ఎస్ ప్రెస్సో మైక్రో ఎస్‌యూవీ 1.0 లీటర్ 3 సిలిండర్ K10C DualJet పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 66bhp శక్తిని, 90Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5- స్పీడ్ మాన్యువల్, 5- స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంటుంది. ఈ కారు CNG వేరియంట్‌లోనూ అందుబాటులో ఉంది.
మారుతి ఎస్ ప్రెస్సో కారు idle start/ stop ఫీచర్‌ను కలిగి ఉంది. ట్రాఫిక్ జామ్ సహా ఇతర ప్రాంతాల్లో కారు 30 సెకన్లు కంటే ఎక్కువ సేపు నిలిచి ఉన్నట్లయితే.. కారు ఇంజిన్ ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ఈ ఫీచర్ కారణంగా ఇంధన సామర్థ్యం మెరుగుపడుతుంది. ఫలితంగా కాలుష్యం కూడా కొంతవరకు తగ్గుతుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








