రూ. 10 నాణేలు చెల్లించి లక్షకు పైగా విలువైన ఇ స్కూటర్‌ కొనుగోలు.. సీఈవో ట్వీట్ వైరల్

ఇటీవలి కాలంలో డిజిటల్‌ లావాదేవీలు ఎక్కువయ్యాయి. ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే చాలా మంది ఆన్‌లైన్‌ పేమెంట్స్‌కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. లేదంటే రూ. 500, రూ. 2000 నోట్లను చెల్లించడం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఓ కస్టమర్‌ మాత్రం వీటి కంటే కొంచెం డిఫరెంట్‌.. అదేంటో ఇక్కడ తెలుసుకోండి..

కొత్త వాహనం కొనుగోలు చేయడమనేది చాలా మందికి కల. ఇందుకోసం ముందు నుంచే నగదును జమ చేయడం ప్రారంభిస్తుంటారు. అయితే అప్పుడప్పుడూ కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటాం. రూపాయి నాణేలు చెల్లించి బైక్‌ కొనుగోలు చేయడం. తాజాగా ఓ కస్టమర్‌ కూడా ఇదే పద్ధతిలో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను కొనుగోలు చేశారు. అయితే ఇక్కడ అతను రూ. 10 కాయిన్స్‌ చెల్లించారు.

Ather-450-E-Scooter-Rs-10-Coins

ఇందుకు సంబంధించిన పోస్ట్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో.. వైరల్‌ అవుతోంది. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఓ వ్యక్తి కొత్త ఏథర్(Ather Energy) 450 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేశారు. ఈ స్కూటర్‌కు సంబంధించిన మొత్తం చెల్లింపును ఆ కస్టమర్‌.. రూ. 10 నాణేలలో చెల్లించారు. ఈ సమాచారాన్ని ఏథర్ ఎనర్జీ CEO తరుణ్ మెహతా సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఏథర్ ఎనర్జీ CEO తరుణ్‌ మెహతా.. తన X(గతంలో ట్విట్టర్‌) లో ఇందుకు సంబంధించిన ఫొటోను పంచుకున్నారు. ఈ ఫొటో చాలా మంది దృష్టిని ఆకర్షించడంతో పాటు క్షణాల్లో వైరల్‌ అయిపోయింది. జైపూర్‌కు చెందిన కొత్త కస్టమర్ రూ. 10 నాణేలు చెల్లించి.. ఏథర్ 450(Ather 450 E Scooter) స్కూటర్‌ను కొనుగోలు చేసినట్లు సీఈవో పేర్కొన్నారు.

Ather-450-E-Scooter-Rs-10-Coins

అయితే రూ. 10 నాణేలు చెల్లించి(Customer Buys Ather 450 Scooter With rs. 10 coins) స్కూటర్‌ కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలను పోస్ట్‌లో వెల్లడించలేదు. ఈ నాణేలతోనే స్కూటర్‌ను ఎందుకు కొనుగోలు చేశారో కూడా తెలుపలేదు. దాంతో పాటు సదరు వ్యక్తి ఏథర్‌ 450 సిరీస్‌లోని ఏ స్కూటర్‌ను కొనుగోలు చేశారో కూడా పోస్ట్‌లో ఆయన వివరించలేదు.

ఇదిలా ఉండగా.. ఏథర్‌ 450 సిరీస్‌లో సంస్థలో మూడు ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మోడళ్లను విక్రయిస్తోంది. 450S, 450X మరియు 450 Apex అనే మూడు స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. భారత మార్కెట్‌లో Ather 450S స్కూటర్ ధర రూ.1.10 లక్షలు కాగా ఏథర్ 450 Apex స్కూటర్ ధర రూ.1.89 లక్షలుగా ఉంది.

దీన్ని బట్టి చూస్తే కస్టమర్‌.. ఈ మూడు మోడళ్లలోని ఏ స్కూటర్‌ను కొనుగోలు చేసినా రూ. లక్షకు మించి రూ. 10 నాణేలను చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొందరు కస్టమర్లు ఇలా రూ. 1, రూ. 5, రూ. 10 నాణేలను చెల్లించి స్కూటర్‌ లేదా బైక్‌ను కొనుగోలు చేయడం సెంటిమెంట్‌గా భావిస్తుంటారు. తీపి జ్ఞాపకంగా కూడా దాచుకుంటారు.

కాగా త్వరలో ఏథర్ ఎనర్జీ నుంచి కొత్త రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌ త్వరలో విడుదల కానుంది. ఇందుకు సంబంధించిన టీజర్‌ను సంస్థ ఇటీవల విడుదల చేయగా.. ఈ స్కూటర్‌ పెద్ద సీటు పరిమాణంతో రానుంది. ఏథర్‌ స్కూటర్లకు మార్కెట్లో మంచి ప్రజాదరణ ఉండటంతో.. ఈ స్కూటర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఫ్యామిలీ స్కూటర్‌గా, లగ్జరీ ఫీచర్లు, ప్రాక్టికాలిటీతో రిజ్టా(Rizta Electric Scooter) స్కూటర్‌ను ఏథర్‌ ఎనర్జీ డిజైన్‌ చేస్తోంది. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో అతిపెద్ద టిక్కెట్ స్కూటర్‌గా ఆటో నిపుణులు భావిస్తున్నారు. అంతే కాకుండా.. అధిక రేంజ్‌తో ఏథర్ స్కూటర్లలో ఇదే అతిపెద్ద స్కూటర్ కానుంది. దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

More from DriveSpark

Article Published On: Monday, February 19, 2024, 13:15 [IST]
English summary
Customer buys ather 450 electric scooter with rs 10 coins ceo tarun mehta reacts
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+