ఘోర ప్రమాదంలో ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన కారు.. ఆ తర్వాత రోజు ఏం జరిగిందంటే?
కొత్త కారు కొనుగోలు చేయాలనుకోవడం చాలా మందికి ఓ కల. తమ బడ్జెట్‌లో మంచి కారు కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా కారు మైలేజీ, ఫీచర్లు, డిజైన్, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న సంస్థల కార్లకు ప్రాధాన్యత ఇస్తారు. టెస్ట్ డ్రైవ్ చేసి తనకు అన్ని విధాల సరిపోతుంది అనుకుంటే వెంటనే వాటిని సొంతం చేసుకుంటారు.
టెస్ట్ డ్రైవ్ చేస్తున్న సమయాల్లో చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ఘటనల్లో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కొన్నిసార్లు కారణం అయితే మరికొన్నిసార్లు అవతలి వారు ప్రమాదాలకు కారణం అవుతారు. తాజాగా టెస్ట్ డ్రైవింగ్ తీసుకెళ్లిన టాటా పంచ్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. అయిటే కారు టెస్ట్ డ్రైవింగ్ చేసిన కస్టమర్ ఏం చేశాడో తెలుసా..?

ఈ ప్రమాదానికి సంబంధించి వీడియోను ప్రతీక్‌సింగ్ తన యూట్యూబ్ ఛానల్‌లో షేర్ చేశారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి తమ సోదరుడితో కలిసి టాటా డీలర్ వద్దకు వెళ్లారు. టాటా పంచ్ కారు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. టెస్ట్ డ్రైవ్ చేసేందుకు కారును తీసుకెళ్లారు. 4 లేన్ హైవేపైన భారీ ట్రక్‌ల మధ్య డ్రైవింగ్ చేస్తున్నారు.

టాటా పంచ్ SUV కారును సుమారు 80- 90 కి.మీ వేగంతో డ్రైవింగ్ చేస్తున్నారు. అయితే ఆ సమయంలో టాటా పంచ్ కారు ముందున్న ట్రక్ డ్రైవర్.. అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో టాటా కారును నియంత్రించే సమయం లేకుండా పోయింది.
ట్రక్‌ను ఢీకొట్టకుండా ఉండేందుకు సడన్‌గా బ్రేకులు వేసిన టాటా పంచ్ డ్రైవర్, వెంటనే కుడివైపునకు మళ్లించారు. అయితే దురదృష్టవశాత్తు టాటా పంచ్ కారు జాతీయ రహదారి పక్కన నిర్మించిన మురుగు కాలువలోకి దూసుకెళ్లి, గోడను ఢీకొట్టింది. అనంతరం చాలా సార్లు బోల్తా పడి రోడ్డు పక్కన నిలిచింది.

ప్రమాద సమయంలో ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకున్నాయి. మరియు టాటా పంచ్ వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. కుడివైపున పిల్లర్, హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్ డ్యామేజ్ అయ్యాయి. కారులో ఉన్న కస్టమర్, అతని సోదరుడు, డీలర్‌షిప్ సంస్థకు చెందిన ఉద్యోగి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. వీడియో చూసిన విధంగా కారు ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో కారులో ఉన్నవారు క్షేమంగా బయటపడ్డారు.
ఘటన వీడియోను చూసినట్లయితే ప్రమాద తీవ్రతను టాటా పంచ్ వాహనం సమర్థంగా తట్టుకుందని అర్థమవుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన టెస్ట్ డ్రైవ్ చేసిన కస్టమర్, టాటా కార్ల బిల్డ్ క్వాలిటీని మెచ్చుకొని, అంత పెద్ద ప్రమాదంలోనూ తమ ప్రాణాలు కాపాడిన టాటా పంచ్ కారును.. ఆ తర్వాత రోజునే కొనుగోలు చేశాడు. ప్రమాదానికి గురైన టాటా కారు డ్యామేజీ ఛార్జీలను డీలర్‌షిప్ యాజమాన్యం కూడా వసూలుచేయలేదు.

కొన్ని సంవత్సరాల క్రితం టాటా పంచ్ మైక్రో SUV మార్కెట్‌లోకి విడుదల అయింది. అతి తక్కువ సమయంలోనే పాపులర్ మోడల్‌గా గుర్తింపు పొందింది. పంచ్ కారు ఎంట్రీ లెవర్ SUVగా టాటా సంస్థలో ఉంది. ఈ కారు పెట్రోల్ ఇంజిన్‌లోనే అందుబాటులో ఉంది.
1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంది. 86bhp మరియు 115Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టాటా పంచ్ ఎస్‌యూవీ 5 స్పీడ్ మాన్యూవల్ మరియు AMT ట్రాన్సిమిషన్ గేర్ బాక్స్‌ను కలిగి ఉంది. టాటా పంచ్ త్వరలో CNG వెర్షన్‌ను లాంచ్ చేయనుంది.


Click it and Unblock the Notifications








